iDreamPost
android-app
ios-app

కోహ్లీని IPL నుంచి బ్యాన్ చేయాలి.. కేఎల్ రాహుల్ షాకింగ్ కామెంట్స్!

  • Published Mar 20, 2024 | 10:20 AM Updated Updated Mar 20, 2024 | 10:20 AM

ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని ఉద్దేశించి లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఐపీఎల్ నుంచి విరాట్​ను బ్యాన్ చేయాలన్నాడు.

ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని ఉద్దేశించి లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఐపీఎల్ నుంచి విరాట్​ను బ్యాన్ చేయాలన్నాడు.

  • Published Mar 20, 2024 | 10:20 AMUpdated Mar 20, 2024 | 10:20 AM
కోహ్లీని IPL నుంచి బ్యాన్ చేయాలి.. కేఎల్ రాహుల్ షాకింగ్ కామెంట్స్!

ఐపీఎల్​కు ఈ రేంజ్​లో క్రేజ్ వచ్చిందంటే అది ఏ ఒక్క ప్లేయర్ వల్లో కాదు. ఇండియన్ స్టార్స్​తో పాటు ఫారెన్ ప్లేయర్స్, డొమెస్టిక్ హీరోస్.. ఇలా అందరూ అదరగొట్టడంతోనే క్యాష్ రిచ్ లీగ్ ఇంత ఫేమస్ అయింది. అయితే అద్వితీయ ఆటతీరుతో లీగ్​కు వన్నె తెచ్చిన ప్లేయర్లు కొందరు ఉన్నారు. ఏళ్లకు ఏళ్లుగా ప్రతి సీజన్​లోనూ సూపర్బ్​గా ఆడుతూ లీగ్ క్రేజ్​ను డబుల్ చేసిన ఆటగాళ్లు ఉన్నారు. అలాంటి అరుదైన ప్లేయర్ల జాబితాలో ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లీ టాప్​లో ఉంటాడు. కోహ్లీ ఆడుతున్నాడంటే చాలు.. అటు స్టేడియాలు నిండిపోతాయి, ఇటు టీవీలు, మొబైల్ ఫోన్స్​ ముందు కూడా ఆడియెన్స్ స్ట్రీమింగ్​కు రెడీ అయిపోతారు. ఒకరకంగా చెప్పాలంటే ఫేస్ ఆఫ్​ ది ఐపీఎల్​గా మారిపోయాడు కింగ్. అలాంటి కోహ్లీ లేకుండా లీగ్​ను ఊహించలేని పరిస్థితి.

ఐపీఎల్ అంటే కోహ్లీ.. కోహ్లీ అంటే ఐపీఎల్ అనేలా మారిపోయింది. ప్రతి ఏడాది ఐపీఎల్​లో సూపర్బ్‌ బ్యాటింగ్​తో అలరిస్తున్నాడు విరాట్. అలాంటి కోహ్లీని క్యాష్ రిచ్ లీగ్ నుంచి బ్యాన్ చేయాలని డిమాండ్ చేశాడు స్టైలిష్ బ్యాటర్, లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్. సీరియస్​గా కాదు గానీ.. ఫన్నీగా అతడీ కామెంట్స్ చేశాడు. ఐపీఎల్​ కొత్త సీజన్ ఆరంభానికి ముందు కోహ్లీ-కేఎల్ ఓ సోషల్ మీడియా ప్లాట్​ఫామ్​లో వీడియా కాల్ చేసుకున్నారు. ఇద్దరూ లైవ్​లో కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. విరాట్​ను ఐపీఎల్​లో నుంచి బ్యాన్ చేయాలని అన్నాడు. ‘నీతో పాటు ఏబీ డివిలియర్స్​ను ఐపీఎల్ నుంచి బ్యాన్ చేయాలి. లీగ్​లో మీరు చాలా రికార్డులు క్రియేట్ చేశారు. 5 వేలకు పైగా పరుగులు చేశారు. కాబట్టి ఇక మీరు తప్పుకొని మా లాంటి వాళ్లకు ఆ బాధ్యతను అప్పజెప్పాలి’ అని రాహుల్ చెప్పుకొచ్చాడు.

ఐపీఎల్ నుంచి తనను బ్యాన్ చేయాలని రాహుల్ అనగానే కోహ్లీ గట్టిగా నవ్వాడు. కేఎల్ మాట్లాడుతున్నంత సేపు విరాట్ నవ్వుతూనే ఉన్నాడు. వీళ్లిద్దరి కన్వర్జేషన్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్స్ నవ్వుకుంటున్నారు. కోహ్లీ లేని ఐపీఎల్​ను ఊహించలేమని అంటున్నారు. అయితే అతడు స్ఫూర్తిగా కేఎల్​తో పాటు యంగ్ క్రికెటర్స్ అందరూ పరుగుల వర్షం కురిపించాలని చెబుతున్నారు. విరాట్ మరిన్ని సీజన్లు ఆడతాడని.. ఐపీఎల్​లో అతడి రికార్డులను బ్రేక్ చేయడం ఎవరి వల్ల కాదని కామెంట్స్ చేస్తున్నారు. ఇక, గాయం కారణంగా ఇంగ్లండ్​ సిరీస్ మధ్యలోనే తప్పుకున్న రాహుల్.. ఐపీఎల్​తో కమ్​బ్యాక్ ఇస్తున్నాడు. అతడు ఫిట్​గా ఉన్నట్లు నేషనల్ క్రికెట్ అకాడమీ ప్రకటించింది. అయితే ఐపీఎల్ ఆరంభ మ్యాచులకు అతడు వికెట్ కీపింగ్​కు దూరంగా ఉంటే బెటర్ అని సూచించింది. మరి.. కోహ్లీని బ్యాన్ చేయాలంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: ఐపీఎల్ కెప్టెన్లలో అందరికంటే డేంజర్.. కప్పు కొట్టకుండా ఆపే దమ్ముందా?