iDreamPost

ఐపీఎల్ కెప్టెన్లలో అందరికంటే డేంజర్.. కప్పు కొట్టకుండా ఆపే దమ్ముందా?

  • Published Mar 19, 2024 | 8:41 PMUpdated Mar 19, 2024 | 8:41 PM

ఈసారి ఐపీఎల్​లో అన్ని జట్ల కెప్టెన్లు కప్పు కొట్టాలని ఫిక్స్ అయ్యారు. అయితే అందరిలోనూ ఒక సారథి మాత్రం మోస్ట్ డేంజరస్​గా కనిపిస్తున్నాడు. టైటిల్ కొట్టకుండా అతడ్ని ఆపడం కష్టంగా ఉంది.

ఈసారి ఐపీఎల్​లో అన్ని జట్ల కెప్టెన్లు కప్పు కొట్టాలని ఫిక్స్ అయ్యారు. అయితే అందరిలోనూ ఒక సారథి మాత్రం మోస్ట్ డేంజరస్​గా కనిపిస్తున్నాడు. టైటిల్ కొట్టకుండా అతడ్ని ఆపడం కష్టంగా ఉంది.

  • Published Mar 19, 2024 | 8:41 PMUpdated Mar 19, 2024 | 8:41 PM
ఐపీఎల్ కెప్టెన్లలో అందరికంటే డేంజర్.. కప్పు కొట్టకుండా ఆపే దమ్ముందా?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ జాతర మరో మూడ్రోజుల్లో మొదలుకానుంది. సమ్మర్​ హీట్​ను మరింత పెంచేందుకు క్యాష్ రిచ్ లీగ్ వచ్చేస్తోంది. మార్చి 22వ తేదీన చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్స్ మధ్య జరిగే తొలి మ్యాచ్​తో నయా సీజన్​ స్టార్ట్ కానుంది. ఈసారి కప్ ఎగరేసుకుపోవాలని అన్ని జట్లు కృతనిశ్చయంతో ఉన్నాయి. అందుకోసం గేమ్ ప్లానింగ్ దగ్గర నుంచి టీమ్ కాంబినేషన్ వరకు అన్నీ ఇప్పటి నుంచే సెట్ చేసుకుంటున్నాయి. ఆటగాళ్లు కూడా బరిలోకి దిగి సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నారు. ప్రాక్టీస్ సెషన్స్​లో తీవ్రంగా చెమటోడ్చుతూ కొత్త సీజన్ కోసం రెడీ అవుతున్నారు. అయితే ఈసారి అన్ని టీమ్స్ కెప్టెన్స్ కప్ కొట్టేయాలని చూస్తున్నారు. కానీ ఓ సారథి మాత్రం మోస్ట్ డేంజరస్​గా కనిపిస్తున్నాడు. అతను ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం..

ఈసారి ఐపీఎల్​ను అన్ని జట్ల కెప్టెన్లు చాలా సీరియస్​గా తీసుకుంటున్నారు. టీమ్​ కోసం అని కాదు గానీ.. పర్సనల్​గా కూడా కప్పు కొట్టడానికి ప్రతి ఒక్కరికీ ఒక్కో రీజన్ ఉంది. ఇదే లాస్ట్ ఐపీఎల్ అని చెన్నై కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, రెండేళ్ల తర్వాత కమ్​బ్యాక్ ఇస్తున్నాడు కాబట్టి ఢిల్లీ సారథి రిషబ్ పంత్, రోహిత్ శర్మ కంటే తానే బెటర్ అని ప్రూవ్ చేసుకోవాలని ముంబై నయా కెప్టెన్ హార్దిక్ పాండ్యా చూస్తున్నారు. అయితే వీళ్లందరూ కాదు.. టైటిల్ నెగ్గాలనే కసి ఎక్కువ ఉంది మాత్రం కోల్​కతా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్​కే. ఎందుకంటే వన్డే వరల్డ్ కప్​లో దేశం తరఫున ఆడాలని గతేడాది ఐపీఎల్​ సీజన్ మొత్తానికి దూరంగా ఉన్నాడతను. టీమిండియా కోసం కోట్ల రూపాయలు వద్దనుకున్నాడు. మెగా టోర్నీ తర్వాత కూడా భారత్ తరఫున వరుస సిరీస్​ల్లో ఆడుతూ వచ్చాడు. అయినా అతడికి ఏమీ మిగల్లేదు సరికదా.. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ కూడా తీసేసింది. దీంతో కసి మీద ఉన్నాడు అయ్యర్.

Iyer

ఎలాగైనా ఐపీఎల్ టైటిల్​ను కైవసం చేసుకోవాలని చూస్తున్నాడు అయ్యర్. కప్ కొట్టి బీసీసీఐ కాంట్రాక్ట్ తిరిగి రాబట్టుకోవడమే కాదు.. టీమిండియాలో ప్లేస్, అలాగే జట్టు ఫ్యూచర్ కెప్టెన్ బరిలో కూడా ఉండాలనే లాంగ్ టర్మ్ గోల్స్ సెట్ చేసుకుంటున్నాడు. టార్గెట్ సెట్ చేసుకున్న అయ్యర్.. అందుకు తగ్గట్లే నెట్స్​లో చెమటోడ్చుతున్నాడు. గంటల కొద్దీ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. అదే టైమ్​లో ఇతర ఆటగాళ్ల సాధనను కూడా దగ్గర ఉండి పర్యవేక్షిస్తున్నాడు. కొత్త మెంటార్ గౌతమ్ గంభీర్​తో డిస్కషన్స్ చేస్తున్నాడు.

టీమ్​ను విజయాల బాట ఎలా పట్టించాలి? జట్టు కూర్పును ఎలా సెట్ చేసుకోవాలి? ఆటగాళ్లందర్నీ ఒక్కతాటి పైకి తీసుకొచ్చి ఎలా ఆడించాలి? అనే విషయాలపై గంభీర్​తో చర్చలతో అవగాహన పెంచుకుంటున్నాడు అయ్యర్. టోర్నీ స్టార్ట్ అయ్యేలోగా ఓ క్లారిటీతో ఉండాలని అనుకుంటున్నాడు. ఒక్కో గెలుపుతో ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాలని ఫిక్స్ అయ్యాడు. కేకేఆర్​తో మ్యాచ్ అంటేనే ఇతర జట్లు భయపడేలా వ్యూహాలు పన్నుతున్నాడు. అందుకే ధోని, రాహుల్ లాంటి వాళ్ల కంటే అతడు డిఫరెంట్​గా, డేంజరస్​గా కనిపిస్తున్నాడు. ఒకవేళ అన్నీ కుదిరి కోల్​కతా ట్రోఫీ నెగ్గితే మాత్రం అయ్యర్​ను అందరూ నెత్తిన పెట్టుకుంటారు. మరి.. అయ్యర్​ అనుకున్నది సాధిస్తాడని మీరు అనుకుంటే కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి