iDreamPost
android-app
ios-app

మ్యాక్స్‌వెల్‌ డబుల్‌ సెంచరీపై విరాట్ కోహ్లీ షాకింగ్‌ రియాక్షన్‌!

  • Author singhj Published - 03:03 PM, Wed - 8 November 23

ఆస్ట్రేలియా ఆల్​రౌండర్ గ్లెన్ మ్యాక్స్​వెల్​ బ్యాటింగ్​ను అందరూ మెచ్చుకుంటున్నారు. ఆఫ్ఘాన్​ మీద అతడు ఆడిన ఇన్నింగ్స్​పై భారత్ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ కూడా రియాక్ట్ అయ్యాడు.

ఆస్ట్రేలియా ఆల్​రౌండర్ గ్లెన్ మ్యాక్స్​వెల్​ బ్యాటింగ్​ను అందరూ మెచ్చుకుంటున్నారు. ఆఫ్ఘాన్​ మీద అతడు ఆడిన ఇన్నింగ్స్​పై భారత్ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ కూడా రియాక్ట్ అయ్యాడు.

  • Author singhj Published - 03:03 PM, Wed - 8 November 23
మ్యాక్స్‌వెల్‌ డబుల్‌ సెంచరీపై విరాట్ కోహ్లీ షాకింగ్‌ రియాక్షన్‌!

ఆఫ్ఘానిస్థాన్​పై విక్టరీతో ఆస్ట్రేలియా సెమీస్ బెర్త్​ను ఖరారు చేసుకుంది. పించ్ హిట్టర్ గ్లెన్ మ్యాక్స్​వెల్ డబుల్ సెంచరీతో తన జట్టును ఒంటిచేత్తో సెమీస్​కు చేర్చాడని చెప్పొచ్చు. అతడి మాస్ బ్యాటింగ్​ను ఎవ్వరూ అంత ఈజీగా మర్చిపోలేరు. ఆఫ్ఘాన్​ బౌలర్లను అతడు చీల్చి చెండాడిన తీరు వేరే లెవల్ అనే చెప్పాలి. తొడ కండరాలు పట్టేయడంతో సరిగ్గా నిలబడలేని స్థితిలోనూ ఒంటి కాలు మీదే నిల్చొని అలవోకగా సిక్సర్ల మీద సిక్సర్లు బాదాడు మ్యాక్సీ. నూర్, రషీద్, ముజీబ్​ లాంటి వరల్డ్ క్లాస్ స్పిన్ బౌలర్ల బౌలింగ్​లో నిల్చొన్న చోట నుంచి ఏమాత్రం కదలకుండా బంతుల్ని స్టేడియంలోకి పంపించాడు. అతడు ఆడుతుంటే ఏంటి సిక్సర్లు కొట్టడం ఇంత తేలికా? అనిపించింది. ఏదో స్కూల్ పిల్లల బౌలింగ్​లో బ్యాటింగ్ చేస్తున్నట్లుగా కనిపించింది.

91 రన్స్​కే ఆస్ట్రేలియా 7 వికెట్లు కోల్పోయింది. కానీ ఆ తర్వాత ఒక్క వికెట్ కూడా పడకుండానే 292 రన్స్ టార్గెట్​ను ఛేజ్ చేసేసింది. ఆఫ్ఘాన్ బౌలర్లు మొదట్లో మ్యాక్సీకి బాగా బౌలింగ్ చేశారు. అయితే అదృష్టవశాత్తూ ఒక ఎల్బీడబ్ల్యూ అప్పీల్ నుంచి బయటపడ్డాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే అతడు ఇచ్చిన సులువైన క్యాచ్​ను స్పిన్నర్ ముజీబుర్ రెహ్మాన్ వదిలేశాడు. హాఫ్​ సెంచరీ తర్వాత మ్యాడ్ మ్యాక్స్ మరింత చెలరేగి ఆడాడు. గ్యాప్స్​లోకి ఫోర్లు కొడుతూ.. చెత్త బంతుల్ని సిక్సులుగా తరలిస్తూ పోయాడు. గాయంతో ఇబ్బంది పడుతూ నిల్చున్న చోట నుంచే షాట్లు ఆడాడు.

మ్యాక్స్​వెల్​కు యార్కర్లు లేదా ఫ్రంట్ ఫుట్​పై వచ్చి ఆడేలా బాల్స్ సంధించలేదు ఆఫ్ఘాన్. అతడి విధ్వంసాన్ని ఎలా అడ్డుకోవాలో తెలియక కన్​ఫ్యూజ్ అయిపోయారు. ఫీల్డింగ్ ఛేంజెస్ సరిగ్గా లేకపోవడంతో మ్యాక్సీ ఆఫ్ఘాన్ బౌలర్లను ఓ ఆటాడుకున్నాడు. అతడి డబుల్ సెంచరీపై ప్రముఖ క్రికెటర్లు అందరూ రియాక్ట్ అవుతున్నారు. ఆసీస్​ స్టార్​ను ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. ఈ ఇన్నింగ్స్​ మీద టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ స్పందిస్తూ.. మ్యాక్స్​వెల్ మాత్రమే ఇలా ఆడగలడని మెచ్చుకున్నాడు. ఇది అద్భుతమైన ఇన్నింగ్స్​ అని ప్రశంసించాడు.

వన్డే క్రికెట్​లో తాను ఇప్పటిదాకా చూసిన వాటిల్లో ఇదే బెస్ట్ ఇన్నింగ్స్ అని టీమిండియా లెజెండ్ సచిన్ టెండూల్కర్ అన్నాడు. మ్యాక్స్​వెల్‌ ఓ అద్భుతమని.. ఇలాంటి ఇన్నింగ్స్​లు అతడికి మాత్రమే సాధ్యమని ఇంగ్లండ్ ఆల్​రౌండర్ బెన్ స్టోక్స్ మెచ్చుకున్నాడు. ఫిజికల్​గా, మెంటల్​గా జీనియస్ అయిన మ్యాక్స్​ ఫైటింగ్ స్పిరిట్​కు రెస్పెక్ట్ ఇవ్వాల్సిందేనని.. వన్డేల్లో ఇదే అత్యుత్తమ ఇన్నింగ్స్ అని పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ చెప్పాడు. మ్యాక్సీ ఇన్నింగ్స్ సుధీర్ఘకాలం అందరికీ గుర్తుండిపోతుందని భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. మరి.. గ్లెన్ మ్యాక్స్​వెల్ వీరోచిత బ్యాటింగ్​పై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: షకీబ్ కు మాథ్యూస్ శాపం.. వరల్డ్ కప్ కు దూరం!