iDreamPost
android-app
ios-app

విరాట్ కోహ్లీ చేసిన పనికి ఫ్యాన్స్ ఫిదా! వైరలవుతున్న వీడియో..

  • Author Soma Sekhar Published - 09:09 PM, Mon - 20 November 23

ఇండియా-ఆస్ట్రేలియా మ్యాచ్ ముగిసిన తర్వాత అవార్డ్స్ ప్రజెంటేషన్ కార్యక్రమంలో విరాట్ కోహ్లీ చేసిన పనికి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇండియా-ఆస్ట్రేలియా మ్యాచ్ ముగిసిన తర్వాత అవార్డ్స్ ప్రజెంటేషన్ కార్యక్రమంలో విరాట్ కోహ్లీ చేసిన పనికి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

  • Author Soma Sekhar Published - 09:09 PM, Mon - 20 November 23
విరాట్ కోహ్లీ చేసిన పనికి ఫ్యాన్స్ ఫిదా! వైరలవుతున్న వీడియో..

ప్రపంచ కప్ ఫైనల్లో టీమిండియా ఓడిపోవడంతో.. సగటు క్రికెట్ అభిమాని గుండే కాకుండా.. ప్రతీ భారతీయుడి హృదయం ముక్కలైంది. ఈ ఓటమి ఫ్యాన్స్ ను తీవ్ర ఆవేదనకు గురిచేసింది. ఇక క్రికెటర్లు అయితే మ్యాచ్ ఓడిపోయిన అనంతరం గ్రౌండ్ లోనే భావోద్వేగానికి లోనై.. చెమర్చిన కళ్లతో మైదానాన్ని వీడారు. రోహిత్, సిరాజ్ లు ఎమోషనల్ అయిన వీడియోలు నెట్టింట వైరల్ గా మారిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మ్యాచ్ తర్వాత అవార్డ్స్ ప్రజెంటేషన్ కార్యక్రమంలో విరాట్ కోహ్లీ చేసిన పనికి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

విరాట్ కోహ్లీ.. వరల్డ్ కప్ 2023లో అత్యధిక పరుగులు చేసిన వీరుడిగా నిలిచాడు. ఈ మెగాటోర్నీలో ఎన్నో రికార్డులు బద్దలు కొట్టిన విరాట్.. 3 సెంచరీల సాయంతో 11 మ్యాచ్ ల్లో 765 పరుగులు చేశాడు. అయితే టీమిండియాకు మాత్రం వరల్డ్ కప్ ను అందించడంలో సఫలం కాలేకపోయాడు. తన బ్యాట్ కు పనిచెబుతూ.. ఈ టోర్నీలో పరుగుల వరదపారించాడు కింగ్ కోహ్లీ. కాగా.. వరల్డ్ కప్ లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా ఎంపికైయ్యాడు విరాట్ కోహ్లీ. ఈ నేపథ్యంలో అవార్డ్స్ ప్రజెంటేషన్ కార్యక్రమంలో.. విరాట్ కోహ్లీని ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ ట్రోఫీ అందుకోవడానికి పిలిచాడు రవిశాస్త్రి.

అప్పుడు కోహ్లీ సరాసరి అవార్డును తీసుకుని రవిశాస్త్రి దగ్గరికి వెళ్లకుండా నేరుగా కిందికి దిగిపోయాడు. ఇది చూసిన రవిశాస్త్రి స్పీచ్ ఇవ్వవా అన్నట్లు సైగ చేసి.. ఓకే అని చెయి చూపాడు. గుండెలు బద్దలైన బాధలో ఉన్న విరాట్ కోహ్లీ ఆ సమయంలో మాట్లాడదలచుకోలేదు. కొండంత బాధను దిగమింగుకుని చెమర్చిన కళ్లతోనే అవార్డు తీసుకుని వెళ్లిపోయాడు విరాట్. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో బాధలో ఉన్నప్పుడు మౌనంగా ఉండటం కంటే మంచి పని మరోటి ఉండదని, కోహ్లీ చేసిన పనికి మేము ఫిదా అవుతున్నామని ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. మరి కోహ్లీ చేసిన పనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.