iDreamPost
android-app
ios-app

సచిన్ సెంచరీలు సమం చేసినా.. కోహ్లీలో అసంతృప్తి! కారణం?

విరాట్ కోహ్లీ నిన్న తన 35వ బర్త్‌డే సెలబ్రేట్ చేసుకున్నారు. భారత్, సౌతాఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్ లో ఛేజ్ మాసస్టర్ కోహ్లీ మరోసారి తన సత్తా ఏంటో చూపించాడు. విరాట్ బ్యాటింగ్ ముందు సఫారీల బౌలర్లు తేలిపోయారు.

విరాట్ కోహ్లీ నిన్న తన 35వ బర్త్‌డే సెలబ్రేట్ చేసుకున్నారు. భారత్, సౌతాఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్ లో ఛేజ్ మాసస్టర్ కోహ్లీ మరోసారి తన సత్తా ఏంటో చూపించాడు. విరాట్ బ్యాటింగ్ ముందు సఫారీల బౌలర్లు తేలిపోయారు.

సచిన్ సెంచరీలు సమం చేసినా.. కోహ్లీలో అసంతృప్తి! కారణం?

వన్డే వరల్డ్ కప్ 2023లో టీమిండియా జైత్ర యాత్ర కొనసాగుతోంది. ఓటమెరుగని జట్టుగా రోహిత్ సేన దూసుకెళ్తోంది. ఇప్పటికే సెమీస్ లోకి అడుగుపెట్టిన భారత్ టైటిలే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. కాగా నిన్న (నవంబర్ 05) కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్ వేదికగా భారత్, సౌతాఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్ పలు రికార్డులకు దారితీసింది. టీమిండియా మాజీ కెప్టెన్ కోహ్లీ అసాధారణ బ్యాటింగ్ తో చెలరేగాడు. క్లిష్ట పరిస్థితుల్లో సైతం అద్భుతమైన ప్రదర్శన చేశాడు. దీంతో కింగ్ కోహ్లీ 121 బంతుల్లో 10 ఫోర్లతో 101 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. దీంతో వన్డేల్లో 49 వ సెంచరీని సాధించి క్రికెట్ గాడ్ సచిన్ తెందూల్కర్ పేరిట ఉన్న రికార్డును సమం చేశాడు. దీంతో ఛేజ్ మాస్టర్ పై ఫ్యాన్స్ తో పాటు క్రీడాలోకం ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా కోహ్లీ మాత్రం అసంతృప్తిగానే ఉన్నట్లు తెలుస్తోంది. దీనిక గల కారణం ఏంటంటే?

విరాట్ కోహ్లీ నిన్న తన 35వ బర్త్‌డే సెలబ్రేట్ చేసుకున్నారు. భారత్, సౌతాఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్ లో ఛేజ్ మాసస్టర్ కోహ్లీ మరోసారి తన సత్తా ఏంటో చూపించాడు. విరాట్ బ్యాటింగ్ ముందు సఫారీల బౌలర్లు తేలిపోయారు. 121 బంతులు ఎదుర్కొన్న కోహ్లీ 10 ఫోర్లతో విరుచుకుపడి 101 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. అంతేగాక అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందుల్కర్ సెంచరీల రికార్డు కూడా సమం చేసాడు. తన వన్డే కెరీర్ లో 49వ సెంచరీని సాధించి క్రికెట్ దేవుడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ పేరిట ఉన్న రికార్డును సమం చేశాడు. కాగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్ లో 2009లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో కోహ్లీ వన్డే కెరీర్‌లో తొలి సెంచరీ చేశాడు. వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన సచిన్ రికార్డును బద్దలు కొట్టేందుకు కింగ్ కోహ్లీ మరో అడుగు దూరంలో ఉన్నాడు. ఈ అరుదైన రికార్డును సొంతం చేసుకున్న కోహ్లీపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

అయితే గాడ్‌ ఆఫ్‌ క్రికెట్‌కు 49 సెంచరీలు చేసేందుకు 463 వన్డే మ్యాచ్ లు 451 ఇన్నింగ్స్‌లు అవసరమైతే.. కేవలం 289 మ్యాచ్ లు 277 ఇన్నింగ్స్‌ల్లోనే కోహ్లీ దాన్ని ఆ ఘనతను సాధించాడు. అయితే ఇంతటి అరుదైన గౌరవాన్ని పొందిన కోహ్లీ కొంత అసంతృప్తికిలోనయ్యాడు. తాను ఎప్పుడు సెంచరీ చేసినా విజయగర్వంతో సెలబ్రేట్ చేసుకునే విరాట్ చాలా డల్ గా కనిపించాడు. దానికి గల కారణం తాను బ్యాటింగ్ స్లోగా చేశానని ఇంకా 30 పరుగుల వరకు చేయాల్సిందని చెప్పుకొచ్చాడు. ఈ కారణంగానే కోహ్లీ సెంచరీ చేసినా, సచిన్ రికార్డును సమం చేసినా అసంతృప్తికి గురైనట్లు తెలుస్తోంది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి