iDreamPost
android-app
ios-app

ఆ విషయంలో రోహిత్​ శర్మను అధిగమించిన విరాట్ కోహ్లీ.. ఇద్దరూ ఇద్దరే!

  • Author singhj Published - 03:06 PM, Mon - 13 November 23

ఒక విషయంలో భారత కెప్టెన్ రోహిత్ శర్మను సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అధిగమించాడు. హిట్​మ్యాన్​ను కింగ్ కోహ్లీ దాటేశాడు.

ఒక విషయంలో భారత కెప్టెన్ రోహిత్ శర్మను సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అధిగమించాడు. హిట్​మ్యాన్​ను కింగ్ కోహ్లీ దాటేశాడు.

  • Author singhj Published - 03:06 PM, Mon - 13 November 23
ఆ విషయంలో రోహిత్​ శర్మను అధిగమించిన విరాట్ కోహ్లీ.. ఇద్దరూ ఇద్దరే!

వన్డే ప్రపంచ కప్-2023లో విజయాల పరంపరను భారత్ కంటిన్యూ చేస్తోంది. రికార్డు స్థాయిలో వరుసగా తొమ్మిది మ్యాచుల్లోనూ నెగ్గి అగ్రస్థానంతో సెమీస్​కు దూసుకెళ్లింది. నెదర్లాండ్స్​లో జరిగిన చివరి లీగ్ మ్యాచ్​లోనూ గెలిచి నాకౌట్ మ్యాచ్​కు ముందు కాన్ఫిడెన్స్​ను మరింత పెంచుకుంది. 411 పరుగుల భారీ టార్గెట్​ను డచ్ టీమ్ ముందు ఉంచడంతో కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్​లో ప్రయోగాలు చేశాడు. ఈ మ్యాచ్​లో ఏకంగా తొమ్మిది మంది భారత క్రికెటర్లతో బౌలింగ్ చేయించాడు. ప్రధాన బౌలర్లైన జస్​ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమి, మహ్మద్ సిరాజ్, కుల్​దీప్ యాదవ్, రవీంద్ర జడేజా​తో పాటు విరాట్ కోహ్లీ, శుబ్​మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్​ను కూడా బౌలింగ్​కు దింపాడు హిట్​మ్యాన్. అలాగే ఆఖర్లో తానూ బౌలింగ్ చేశాడు.

రోహిత్ శర్మ ప్రయోగం ఊరికే పోలేదు. ఇద్దరు నెదర్లాండ్స్ బ్యాటర్లను భారత పార్ట్ టైమ్ బౌలర్లు ఔట్ చేశారు. అందులో ఒక వికెట్​ను కింగ్ కోహ్లీ దక్కించుకున్నాడు. మరో డచ్ వికెట్​ హిట్​మ్యాన్ అకౌంట్​లో పడింది. భారీగా పరుగులు ఇచ్చినప్పటికీ సూర్యకుమార్ తన బౌలింగ్ యాక్షన్​తో ఆకట్టుకున్నాడు. రెగ్యులర్​గా అతడికి అవకాశం ఇస్తే మంచి బౌలర్​గా అయ్యే అవకాశం ఉందని సోషల్ మీడియాలో నెటిజన్స్ అంటున్నారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు నెదర్లాండ్స్​ ఇన్నింగ్స్​లో బౌలింగ్​కు దిగినప్పుడు చిన్నస్వామి స్టేడియం అంతా ఒక్కసారి షేక్ అయింది. చాన్నాళ్ల తర్వాత బౌలింగ్​కు దిగడంతో ఫ్యాన్స్ అరుస్తూ, ఈలలు వేస్తూ ఎంజాయ్ చేశారు.

నెదర్లాండ్స్​తో మ్యాచ్​లో కోహ్లీ వికెట్ తీసినప్పుడైతే స్టేడియంలోని ప్రేక్షకులు రచ్చ రచ్చ చేశారు. కోహ్లీ వికెట్ తీయగానే విజిల్స్ వేస్తూ, అతడి నామస్మరణ చేస్తూ ఫ్యాన్స్ తెగ సందడి చేశారు. విరాట్ వికెట్​ తీసిన టైమ్​లో అతడి భార్య అనుష్క శర్మ ఇచ్చిన రియాక్షన్ కూడా నెట్టింట వైరల్ అవుతోంది. పట్టరాని సంతోషంలో నవ్వుతూ, గెంతులేస్తూ.. కోహ్లీ వైపు చూస్తూ రెండు చేతులు పైకి లేపి పిడికిళ్లతో ఆమె అభివాదం చేశారు. కింగ్ కూడా అనుష్క వైపు చూస్తూ పిడికిలితో సాధించానంటూ సైగ చేశారు. వికెట్​ను గ్రౌండ్​లో ఉన్న కోహ్లీతో పాటు గ్యాలరీలోని అనుష్క సెలబ్రేట్ చేసుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

నెదర్లాండ్స్ బ్యాటర్​ను స్కాట్ ఎడ్వర్డ్స్​ను ఔట్ చేయడం ద్వారా 9 ఏళ్ల తర్వాత వికెట్ తీశాడు కోహ్లీ. 3,572 రోజుల తర్వాత వన్డేల్లో వికెట్ తీశాడు కింగ్. ఈ మ్యాచ్​లో రోహిత్ కూడా ఒక వికెట్ తీసిన సంగతి తెలిసిందే. అతడు 3,980 రోజుల తర్వాత వన్డే క్రికెట్​లో వికెట్ తీయడం గమనార్హం. ఈ గ్యాప్ విషయంలో హిట్​మ్యాన్​ను కింగ్ కోహ్లీ అధిగమించాడు. ఇద్దరు లెజెండరీ బ్యాటర్లు ఒకే మ్యాచ్​లో బౌలింగ్ చేయడం, అంతేగాక వికెట్లు కూడా తీయడంతో అభిమానుల సంతోషానికి హద్దే లేకుండా పోయింది. ఇద్దరూ ఇద్దరేనంటూ ఫ్యాన్స్ హ్యాపీనెస్​లో మునిగిపోయారు. ఇక, రోహిత్ చేతికి గాయం కారణంగా చాన్నాళ్లుగా బౌలింగ్ చేయట్లేదు. ఓపెనర్​గా ప్రమోషన్ సాధించినప్పటి నుంచి అతడు బౌలింగ్​కు దూరమయ్యాడు. మరి.. కోహ్లీ, రోహిత్​లు బౌలింగ్ చేసిన తీరుపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: శ్రీలంక క్రికెట్‌ బోర్డును ICC ఎందుకు బ్యాన్‌ చేసింది! ఫుల్‌ స్టోరీ