iDreamPost

శ్రీలంక క్రికెట్‌ బోర్డును ICC ఎందుకు బ్యాన్‌ చేసింది! ఫుల్‌ స్టోరీ

  • Published Nov 12, 2023 | 3:51 PMUpdated Nov 12, 2023 | 3:51 PM

ఒకప్పుడు ప్రపంచ క్రికెట్‌ను గడగడలాడించిన జట్టు.. ఇప్పుడు ఏకంగా ఐసీసీ నుంచి నిషేధాన్ని ఎదుర్కొంది. చాలా తక్కువ టైమ్‌లో క్రికెట్‌ శిఖరాగ్రాలను శ్రీలంక ఇప్పుడు పాతాళానికి పడిపోయింది. మరి ఆ జట్టుకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? అసలు ఐసీసీ ఎందుకు లంక క్రికెట్‌ బోర్డుపై సస్పెషన్‌ విధించిందో ఇప్పుడు చూద్దాం..

ఒకప్పుడు ప్రపంచ క్రికెట్‌ను గడగడలాడించిన జట్టు.. ఇప్పుడు ఏకంగా ఐసీసీ నుంచి నిషేధాన్ని ఎదుర్కొంది. చాలా తక్కువ టైమ్‌లో క్రికెట్‌ శిఖరాగ్రాలను శ్రీలంక ఇప్పుడు పాతాళానికి పడిపోయింది. మరి ఆ జట్టుకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? అసలు ఐసీసీ ఎందుకు లంక క్రికెట్‌ బోర్డుపై సస్పెషన్‌ విధించిందో ఇప్పుడు చూద్దాం..

  • Published Nov 12, 2023 | 3:51 PMUpdated Nov 12, 2023 | 3:51 PM
శ్రీలంక క్రికెట్‌ బోర్డును ICC ఎందుకు బ్యాన్‌ చేసింది! ఫుల్‌ స్టోరీ

ఓ వైపు వన్డే ప్రపంచ కప్‌ మ్యాచ్‌లతో క్రికెట్‌ లోకం అంతా వినోదాన్ని పొందుతుంటే.. అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌(ఐసీసీ) మాత్రం అందరికీ షాక్‌ ఇస్తూ.. శ్రీలంకపై బ్యాన్‌ విధించింది. ఇక ఐసీసీ ఈవెంట్స్‌లో కానీ, ఇతర మ్యాచ్‌లు కానీ శ్రీలంక జట్టు ఆడకుండా నిషేధం విధించింది. ఓ అంతర్జాతీయ టీమ్‌ను, అందులోనా ప్రపంచ క్రికెట్‌లో పెద్ద టీమ్స్‌లో ఒకటిగా ఉన్న లంక జట్టుపై బ్యాన్‌ విధించడం అందరిని షాక్‌కు గురిచేస్తోంది. 1996లో వరల్డ్‌ కప్‌ గెలిచిన జట్టు.. అర్జున రణతుంగా, జయసూర్య, ఆటపట్టు, కుమార సంగాక్కర, మహేళ జయవర్ధనే, ముత్యమురళీ ధరణ్‌ లాంటి గొప్ప క్రికెటర్లను అందించిన శ్రీలంకపై బ్యాన్‌ విధించడం సగటు క్రికెట్‌ అభిమానిని ఆశ్యర్యంలో ముంచేసింది. అసలు ఇంత సడన్‌గా లంకపై ఈ బ్యాన్‌ ఎందుకు విధించారు? ప్రపంచ క్రికెట్‌ను గడగడలాడించిన ఓ అగ్రశ్రేణి జట్టుకు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం..

1965లో శ్రీలంక, అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌లో అసోసియేట్‌ మెంబర్‌గా చేరింది. 1981లో ఆ జట్టుకు టెస్ట్‌ హోదాను కల్పించింది ఐసీసీ. అతి తక్కువ కాలంలోనే అద్భుతమైన జట్టుగా ఎదిగిన పేరు లంకకు ఉంది. ప్రపంచ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇ‍చ్చిన సమయంలో పసికూనగా ఉన్న లంక.. అతి తక్కువకాలంలోనే ఆ ముద్రను పొగొట్టుకుని.. పెద్ద టీమ్స్‌లో ఒకటిగా చేరింది. ఒకానొక దశలో లంక జట్టు ఆస్ట్రేలియాను సైతం డామినేట్‌ చేసింది. అర్జున రణతుంగా కెప్టెన్సీలో 1996లో ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్‌లో విజయం సాధించి.. విశ్వవిజేతగా అవతరించింది. ఇక అక్కడి నుంచి లంక జట్టు వెనుదిరిగి చూడలేదు. వరుసగా 2007, 2011 వన్డే వరల్డ్ కప్స్‌లో ఫైనల్స్‌కు చేరుకుంది. అలాగే 2002లో ఛాంపియన్స్ ట్రోఫీ, 2014లో టీ20 వరల్డ్‌ కప్‌ గెలిచింది. 2009, 2012లో టీ20 ప్రపంచ కప్‌లో రన్నరప్‌గా నిలిచింది.

అతి తక్కువ కాలంలోనే పెద్ద జట్టుగా రూపాంతరం చెందిన లంక.. ప్రపంచ క్రికెట్‌కు ఎంతో మంది గొప్ప ఆటగాళ్లను అందించింది. టాలెంట్‌కు ఏ మాత్రం కొదవలేని శ్రీలంక జట్టు.. గత కొన్నేళ్లుగా తమ ప్రాభవం కోల్పోతూ వస్తుంది. చెత్త ప్రదర్శనలు చేస్తూ.. బలహీనమైన జట్టుగా మారింది. టీ20 వరల్డ్‌ కప్‌లో ఆడేందుకు క్వాలిఫైయర్స్‌ ఆడే దీన స్థితికి దిగజారిపోయింది. ఇప్పుడు ఏకంగా.. ఐసీసీ నుంచి నిషేధం ఎదుర్కొంది. అయితే.. ఇదంతా శ్రీలంక దేశ ప్రభుత్వం జోక్యం వల్లే జరిగింది. సాధారణంగా ఏ దేశ క్రికెట్‌ బోర్డు కూడా స్వతంత్రంగానే వ్యవహరిస్తుంది. క్రికెట్‌ బోర్డు వ్యవహారాల్లో ఆ దేశ ప్రభుత్వం జోక్యం ఉండకూడదు. ఇది ఐసీసీ విధించిన నిబంధన. కానీ, శ్రీలంక క్రికెట్‌ బోర్డు విషయంలో ఆ దేశ ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందనే కారణంతోనే ఐసీసీ.. లంక క్రికెట్‌ బోర్డును బ్యాన్‌ చేసింది.

అయితే.. ఈ నిషేధం ఎన్నాళ్లు కొనసాగుతుంది? ఇకపై శ్రీలంక టీమ్‌ను క్రికెట్‌ ఆడుతుండగా చూడలేమా? అనే అనుమానాలు క్రికెట్‌ అభిమానుల్లో కలుగుతున్నాయి. కాగా, ఐసీసీ నిషేధం ఎన్నాళ్ల కొనసాగుతుందన్న దానిపై ఎలాంటి స్పష్టత లేదు. సస్పెన్షన్ షరతులను తగిన సమయంలో నిర్ణయిస్తామని ఐసీసీ తెలిపింది. ఈ విషయంపై నవంబర్ 21న ఐసీసీ బోర్డు సమావేశం కానుందని, ఆ తర్వాత భవిష్యత్ కార్యాచరణపై స్పష్టత వస్తుందని రావచ్చు. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. 2024 టీ20 వరల్డ్‌ కప్‌కు శ్రీలంకనే ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. మరి బ్యాన్‌ కొనసాగితే.. టోర్నీ నిర్వహణపై కూడా ఐసీసీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అప్పటి వరకు లంక జట్టు క్రికెట్‌ ఆడకపోవచ్చు. ఇకపోతే ప్రస్తుతం జరుగుతున్న వన్డే వరల్డ్‌ కప్‌ 2023లో లంక అంత గొప్ప ప్రదర్శన చేయలేదు. 9 మ్యాచ్‌ల్లో కేవలం 2 విజయాలు సాధించి 7 ఓటములతో పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో నిలిచి, నిష్క్రమించింది. మరి ప్రదర్శన పరంగా దీనస్థితి ఉన్న లంకపై ఐసీసీ బ్యాన్‌ విధించడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి