P Venkatesh
Vinesh Phogat: పారిస్ ఒలింపిక్స్ లో వినేశ్ ఫొగాట్ మెడల్ మిస్ చేసుకుంది. ఫైనల్ కు చేరి హిస్టరీ క్రియేట్ చేసిన ఆమె ఆ ఒక్క కారణంతో మెడల్ కోల్పోయింది. ఇలా చేస్తే సిల్వర్ అయినా దక్కేది.
Vinesh Phogat: పారిస్ ఒలింపిక్స్ లో వినేశ్ ఫొగాట్ మెడల్ మిస్ చేసుకుంది. ఫైనల్ కు చేరి హిస్టరీ క్రియేట్ చేసిన ఆమె ఆ ఒక్క కారణంతో మెడల్ కోల్పోయింది. ఇలా చేస్తే సిల్వర్ అయినా దక్కేది.
P Venkatesh
పారిస్ ఒలింపిక్స్ అట్టహాసంగా సాగిపోతున్నాయి. భారత్ కు చెందిన అథ్లెట్స్ పలు క్రీడల్లో మెడల్స్ సాధిస్తున్నారు. అయితే భారత్ ఖాతాలో గోల్డ్ మెడల్ పక్కా అనుకున్న తరుణంలో ఊహించని పరిణామం ఎదురైంది. భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ కు ఊహించని షాక్ తగిలింది. ఆమెను ఒలింపిక్స్ ఫైనల్ నుంచి డిస్ క్వాలిఫై చేశారు. మహిళల 50 కేజీల ఫ్రీస్టైల్ రెజ్లింగ్‌లో ఫైనల్‌కు చేరుకున్న వినేశ్ ఫొగాట్ పై అనర్హత వేటు వేశారు. దీంతో క్రీడాలోకం నిరాశలో పడిపోయింది. దీనికి గల కారణం ఏంటంటే? వినేశ్ ఫొగాట్ శరీర బరువు కొన్ని గ్రాములు ఎక్కువగా ఉండడమే. గ్రాముల్లో బరువు ఎక్కువగా ఉండడం వల్ల వినేశ్ ఒలింపిక్స్ లో మెడల్ కోల్పోయింది.
ఒలింపిక్స్ నిబంధనల ప్రకారం అథ్లెట్ 50 కేజీల బరువు ఉండాల్సి ఉంటుంది. అయితే వినేశ్ ఫొగాట్ 50 కేజీల కన్నా కొన్ని గ్రాములే ఎక్కువ వెయిట్ ఉంది. ఈ కారణం చేత మహిళల రెజ్లింగ్ 50 కేజీల విభాగం నుంచి ఆమెపై అనర్హత వేటు వేసినట్లు ఇండియన్ ఒలింపిక్ అసోసియోషన్ తెలిపింది. వినేశ్ బరువు తగ్గించుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయిందని వెల్లడించింది. అయితే బరువు ఎక్కువగా ఉన్న విషయం ముందే తెలిసి కూడా పోటీ నుంచి తప్పుకోకపోవడం వల్ల ఏ రకమైన మెడల్ రాకుండా పోయిందని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. వినేశ్ ఫొగాట్ పోటీ నుంచి తప్పుకుంటే సిల్వర్ మెడల్ అయినా దక్కేదని పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
ఎలాగు ఫైనల్ కు చేరింది కాబట్టి పోటీ నుంచి తప్పుకుంటే రజతం ఖాయం అయ్యేది. ఇప్పుడు రూల్స్ ప్రకారం బరువు ఎక్కువగా ఉండడం వల్ల గోల్డ్, సిల్వర్ మెడల్ దేవుడెరుగు అసలు పోటీలోనే లేకుండా అనర్హత వేటు పడిందంటూ క్రీడా నిపుణులు వెల్లడిస్తున్నారు. కాగా వినేశ్ ఫొగాట్ మహిళల 50 కేజీల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ సెమీ ఫైనల్‌లో వినేశ్ 5-0తో క్యూబాకు చెందిన ఉస్నేలిస్ గుజ్‌మన్ లోపెజ్‌పై విజయం సాధించింది. ఈ విజయంతో వినేష్ సరికొత్త రికార్డు సృష్టించింది.