Vinesh Phogat: ఒలింపిక్స్ లో అనర్హత వేటు.. అయినా చరిత్ర సృష్టించిన వినేశ్ ఫొగాట్!

100 గ్రాముల బరువు అధికంగా ఉందన్న కారణంతో ఒలింపిక్స్ నిర్వాహకులు భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ పై అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే. అయితే పతకం రాకపోయినా సరికొత్త చరిత్ర సృష్టించింది వినేశ్. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

100 గ్రాముల బరువు అధికంగా ఉందన్న కారణంతో ఒలింపిక్స్ నిర్వాహకులు భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ పై అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే. అయితే పతకం రాకపోయినా సరికొత్త చరిత్ర సృష్టించింది వినేశ్. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

వినేశ్ ఫొగాట్.. ప్రస్తుతం వరల్డ్ వైడ్ గా హాట్ టాపిక్ గా మారిన అథ్లెట్. పారిస్ వేదికగా జరిగిన 2024 ఒలింపిక్స్ లో 50 కేజీల రెజ్లింగ్ విభాగంలో బరిలోకి దిగింది. అందరిని ఓడిస్తూ.. ఫైనల్ కూడా చేరుకుంది. కానీ, అనూహ్యంగా ఫైనల్ నుంచి అనర్హత వేటుకు గురైంది. నిబంధనలకు మించి 100 గ్రాముల బరువు అధికంగా ఉందన్న కారణంతో ఒలింపిక్స్ నిర్వాహకులు ఆమెపై అనర్హత వేటు వేశారు. దాంతో కచ్చింగా రెజ్లింగ్ లో ఇండియాకు గోల్డ్ మెడల్ తెస్తుందనుకున్న భారతీయుల కల చెదిరింది. అయితే పతకం గెలవకపోయినా గానీ చరిత్ర సృష్టించింది వినేశ్ ఫొగాట్.

తాజాగా ముగిసిన పారిస్ ఒలింపిక్స్ లో పతకం గెలిచే విభాగాల్లో రెజ్లింగ్ ఒకటి. ఇందులో భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ గ్యారెంటీగా గోల్డ్ మెడల్ సాధిస్తుందని 140 కోట్ల మంది భారతీయులు అనుకున్నారు. కానీ దురదృష్టవశాత్తు 100 గ్రాముల బరువు ఎక్కువ ఉందన్న కారణంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. దాంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఆమె తన రెజ్లింగ్ కెరీర్ కు వీడ్కోలు పలికింది. ఇందతా కాసేపు పక్కనపెడితే.. ఒలింపిక్స్ లో పతకం గెలవకపోయినా.. చరిత్ర సృష్టించింది వినేశ్ ఫొగాట్. వరల్డ్ వైడ్ గా లాస్ట్ వీక్ లో గూగుల్ లో అత్యధిక మంది సెర్చ్ చేసిన అథ్లెట్ గా వినేశ్ నిలిచింది. దాంతో సరికొత్త చరిత్ర సృష్టించింది. కాగా.. వినేశ్ ఫొగాట్ అప్పీల్ పై తీర్పును మరోసారి వాయిదా వేసింది కోర్టు. ఈనెల 16న తుది తీర్పు వెల్లడించనుంది.

Show comments