Nidhan
Rohit Sharma: టీమిండియాకు ప్రస్తుతం మ్యాచ్‌లు లేవు. ఇంకో నెల రోజుల పాటు ఆటగాళ్లంతా రెస్ట్ తీసుకోనున్నారు. ఆ తర్వాత మళ్లీ వరుస సిరీస్‌లతో బిజీ అయిపోతారు. అయితే అంతా విశ్రాంతి తీసుకుంటున్నా.. కెప్టెన్ రోహిత్ మాత్రం వేట మొదలుపెట్టేశాడు.
Rohit Sharma: టీమిండియాకు ప్రస్తుతం మ్యాచ్‌లు లేవు. ఇంకో నెల రోజుల పాటు ఆటగాళ్లంతా రెస్ట్ తీసుకోనున్నారు. ఆ తర్వాత మళ్లీ వరుస సిరీస్‌లతో బిజీ అయిపోతారు. అయితే అంతా విశ్రాంతి తీసుకుంటున్నా.. కెప్టెన్ రోహిత్ మాత్రం వేట మొదలుపెట్టేశాడు.
Nidhan
టీమిండియాకు ప్రస్తుతం మ్యాచ్‌లు లేవు. ఇంకో నెల రోజుల పాటు ఆటగాళ్లంతా రెస్ట్ తీసుకోనున్నారు. ఆ తర్వాత మళ్లీ వరుస సిరీస్‌లతో బిజీ అయిపోతారు. బ్యాక్ టు బ్యాక్ ఐపీఎల్, టీ20 వరల్డ్ కప్, జింబాబ్వే సిరీస్, శ్రీలంక టూర్‌తో ఆటగాళ్లు అలసిపోవడంతో రెస్ట్ ఇచ్చింది బీసీసీఐ. బడా టోర్నమెంట్స్ తర్వాత ప్లేయర్లకు విశ్రాంతి ఇవ్వాలని ముందే షెడ్యూల్‌ను ఇలా ప్లాన్ చేసింది. దీంతో ఈ గ్యాప్‌ను క్రికెటర్లు బాగా యూజ్ చేసుకుంటున్నారు. తమ ఫ్యామిలీస్‌తో కలసి వెకేషన్స్‌లో గడుపుతున్నారు. దేశ, విదేశాలు చుట్టేసి సేదతీరుతున్నారు. అయితే కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం రెస్ట్ గిస్ట్ జాన్తా నహీ అంటున్నాడు. కాళ్లకు షూస్ వేసుకొని ప్రాక్టీస్ మొదలుపెట్టాడు.
అందరు క్రికెటర్లు ట్రిప్స్తో బిజీ అయిపోతే రోహిత్ ఒక్కడు మాత్రం ప్రాక్టీస్ ఎందుకు చేస్తున్నట్లు అనే డౌట్ వచ్చే ఉంటుంది. అయితే సరిగ్గా గమనిస్తే హిట్‌మ్యాన్ లెక్క ఏంటో అర్థమవుతుంది. చాన్నాళ్ల తర్వాత టీ20 ప్రపంచ కప్‌ను ఇటీవల ముద్దాడింది భారత్. అలా హిట్‌మ్యాన్ కెప్టెన్సీలో ఓ కల నెరవేరింది. కానీ అతడి సారథ్యంలో వన్డేలు, టెస్టుల్లో ఐసీసీ ట్రోఫీలు సాధించాల్సి ఉంది. లాస్ట్ టైమ్ డబ్ల్యూటీసీ ట్రోఫీ చేతికి అందినట్లే అంది చేజారింది. ఈసారి దాన్ని వదలొద్దని ఫిక్స్ అయిన టీమిండియా కెప్టెన్.. ఖాళీ సమయాన్ని వృథా చేయొద్దని పట్టుదలతో ఉన్నాడట. త్వరలో టెస్ట్ సీజన్ తిరిగి స్టార్ట్ అవుతుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ చేరాలంటే ఇక మీదట జరిగే ప్రతి సిరీస్‌లోనూ భారత్ విజయం సాధించాలి.
టెస్ట్ సీజన్‌ను దృష్టిలో పెట్టుకొని టైమ్ వేస్ట్ చేయకుండా ఈ గ్యాప్‌ను తన ఫిట్నెస్ మెరుగుపర్చుకునేందుకు రోహిత్ వాడుకుంటున్నాడని తెలుస్తోంది. హిట్‌మ్యాన్ ఫిట్నెస్ కాపాడుకుంటే ఇంకో మూడేళ్లు ఆడే అవకాశం ఉంది. సేమ్ టైమ్ డబ్ల్యూటీసీ, ఛాంపియన్స్ ట్రోఫీ లాంటివి నెగ్గాలంటే దృష్టి మరలకుండా చూసుకోవాలి. అందులో భాగంగానే దొరికిన సమయాన్ని కుటుంబంతో గడపడంతో పాటు ఫిట్నెస్, బ్యాటింగ్ టెక్నిక్ బెటర్ చేసుకోవడం కోసం హిట్‌మ్యాన్ యూజ్ చేస్తున్నట్లు సమాచారం. సెప్టెంబర్ మొదటి వారంలో మొదలయ్యే దులీప్ ట్రోఫీలో ఆడాల్సిందిగా భారత సారథిని బీసీసీఐ ఆదేశించిందని తెలిసింది. అతడు ఇంత త్వరగా ప్రాక్టీస్ మొదలుపెట్టడానికి అది కూడా ఓ రీజన్ అని అంటున్నారు. హిట్‌మ్యాన్ కమిట్మెంట్, డెడికేషన్‌ను అందరూ మెచ్చుకుంటున్నారు.
Rohit Sharma has started the Preparation for the Home Test season. 🇮🇳 pic.twitter.com/lVgYGOF4Za
— Johns. (@CricCrazyJohns) August 13, 2024