T20 World Cup: పాక్‌ను ఓడించి, ఇండియాను వెనక్కి నెట్టి.. అమెరికా అరాచకం!

USA, T20 World Cup 2024, India, Pakistan: పాకిస్థాన్‌ లాంటి బలమైన టీమ్‌ను ఓడించి.. అమెరికా సంచలనం సృష్టించింది. అయితే.. ఇటు పాకిస్థాన్‌ను ఓడించడంతో పాటు.. మరోవైపు ఇండియాను వెనక్కి నెట్టింది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..

USA, T20 World Cup 2024, India, Pakistan: పాకిస్థాన్‌ లాంటి బలమైన టీమ్‌ను ఓడించి.. అమెరికా సంచలనం సృష్టించింది. అయితే.. ఇటు పాకిస్థాన్‌ను ఓడించడంతో పాటు.. మరోవైపు ఇండియాను వెనక్కి నెట్టింది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..

టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో భాగంగా గురువారం డల్లాస్‌ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అమెరికా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ప్రపంచ క్రికెట్‌లో అసోసియేట్‌ టీమ్‌గా ఉన్న అమెరికా.. పాకిస్థాన్‌ లాంటి పెద్ద టీమ్‌ను ఓడించి సంచలనం సృష్టించింది. ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్‌ కప్‌ ట్రోఫీలో చిన్న టీమ్స్‌ పెద్ద టీమ్స్‌ను ఇబ్బంది పెడుతున్న విషయం తెలిసిందే. కానీ, అమెరికా ఏకంగా పాక్‌ను చిత్తుగా ఓడించింది. చివరి ఓవర్‌ ఓవరకు నరాలు తెగే ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌.. సూపర్‌ ఓవర్‌ వరకు సాగినా.. పాక్‌ మ్యాచ్‌ గెలవలేకపోయింది. ఈ విజయంతో అమెరికా.. పాకిస్థాన్‌ పరువుతీయడమే కాకుండా.. టీమిండియాను కూడా వెనక్కి నెట్టింది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..

ఈ టీ20 వరల్డ్‌ కప్‌ టోర్నీలో మొత్తం 20 జట్లు పాల్గొంటున్నాయి. వాటిని నాలుగు గ్రూపులుగా విడదీశారు. ఒక్కో గ్రూప్‌లో ఐదేసి జట్లు ఉన్నాయి. గ్రూప్‌-ఏలో టీమిండియాతో పాటు పాకిస్థాన్‌, అమెరికా, కెనడా, ఐర్లాండ్‌ జట్లు ఉన్నాయి. ఇప్పటికే ఇండియా, ఐర్లాండ్‌తో ఒక మ్యాచ్‌ ఆడిన విషయం తెలిసిందే. ప్రతి జట్టు మిగిలిన టీమ్స్‌తో ఒక్కో మ్యాచ్‌ ఆడిన తర్వాత.. టేబుల్‌ టాపర్‌గా ఉన్న రెండు టీమ్స్‌ సూపర్‌ 8కు అర్హత సాధిస్తాయి. అయితే.. ప్రస్తుతం గ్రూప్‌-ఏలో టేబుల్‌ టాపర్‌గా అమెరికానే ఉంది. టీమిండియా, పాకిస్థాన్‌ లాంటి బలమైన జట్లు ఉన్న ఈ గ్రూప్‌లో అమెరికా టేబుల్‌ టాపర్‌గా ఉండటం గమనార్హం. అయితే.. గ్రూప్‌లోని అన్ని టీమ్స్‌ కంటే అమెరికా ఒక మ్యాచ్‌ ఎక్కువ ఆడి ఉంది.

టీమిండియా, ఐర్లాండ్‌, కెనడా, పాకిస్థాన్‌ ఒక్కో మ్యాచ్‌ ఆడి ఉన్నాయి. అమెరికా.. కెనడా, పాకిస్థాన​్‌పై గెలిచింది. ఇండియా, ఐర్లాండ్‌పై విజయం సాధించింది. రెండు విజయాలు నాలుగు పాయింట్లతో అమెరికా టేబుల్‌ టాపర్‌గా ఉంటే, ఇండియా ఒక విజయం రెండు పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. జూన్‌ 9న పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా గెలిస్తే.. ఫస్ట్‌ ప్లేస్‌కు చేరుకునే అవకాశం ఉంది. ఐర్లాండ్‌పై యూఎస్‌ఏ గెలిచి.. టీమిండియాపై పాకిస్థాన్‌ ఓడితే.. పాక్‌ జట్టు ఇంటి బాట పట్టడం ఖాయంగా కనిపిస్తోంది. మరి పాక్‌ను ఓడించి.. టీమిండియా ఉన్న గ్రూప్‌లో అమెరికా టాప్‌లో ఉండటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments