iDreamPost
android-app
ios-app

Asia Cup 2022 పాకిస్థాన్‌తో సూప‌ర్4 లో భారత్ ఫేవ‌రేట్, రోహిత్ శ‌ర్మ ఫామ్ సంగ‌తేంటి?

  • Published Sep 03, 2022 | 8:34 PM Updated Updated Sep 03, 2022 | 8:35 PM
Asia Cup 2022 పాకిస్థాన్‌తో సూప‌ర్4 లో భారత్ ఫేవ‌రేట్, రోహిత్ శ‌ర్మ ఫామ్ సంగ‌తేంటి?

భారతదేశం వర్సెస్ పాకిస్తాన్ రెండో రౌండ్ గేమ్ కి ఇరు జ‌ట్లు సిద్ధం. ఇది సూప‌ర్ 4 కాబ‌ట్టి ఉత్కంఠ వేరే లెవెల్ లో ఉంటుంది. వారం క్రితం జ‌రిగిన మ్యాచ్ ఇండియా-పాక్ మ్యాచ్ అంటే మజా ఏంటో చూపించింది. ఇంకో సంగతి 2018 ఆసియా కప్ తర్వాత ఈ రెండు జ‌ట్లు ఇంత త్వరగా తలపడడం ఇదే తొలిసారి.

ఈ గేమ్ సూపర్ 4 దశలో రెండు జట్లకు ఫ‌స్ట్ గేమ్. నిజానికి ఆసియా క‌ప్ మీద ఇండియా అంత సీరియ‌స్ గా తీసుకోవ‌డంలేదు. కోచ్ ద్రావిడ్, కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌ల‌కు టార్గెట్ రెండు నెలల వ్యవధిలో ఆస్ట్రేలియాలో జరిగే T20 ప్రపంచ కప్ గేమ్‌. అందుకే పాక్ లాంటి మంచి బౌలింగ్ లైన‌ప్ ఉన్న టీం మీద మ‌రోసారి గెల‌వ‌డానికి ఇది మ‌రో అవ‌కాశం

వారం క్రితం నాటి ట‌ఫ్ మ్యాచ్ లో ఇండియా చివ‌రిదాకా గేమ్ ను కంట్రోల్ చేస్తూనే ఉంది. నిజానికి దుబాయ్ పిచ్ మీద‌ పాక్ ఇండియా బ‌లాబ‌లాల‌ మ‌ధ్య పెద్ద‌గా తేడాలేదు. కాని ఎప్పుడైనాస‌రే, గేర్ లు మార్చ‌గ‌లిగే స‌త్తా ఇండియాకు ఉంది. అంద‌రూ మ్యాచ్ విన్న‌రే. జస్ప్రీత్ బుమ్రా , హర్షల్ పటేల్ లేకపోయినా భార‌త్ బౌల‌ర్లు మాత్రం గొప్ప‌గా రాణించారు, షార్ట్ బాల్‌ను వాడి బాబ‌ర్ అజం లాంటి ఆట‌గాళ్ల‌ను దెబ్బ‌తీశారు. బ‌హుశా ఈ రెండు జ‌ట్ల మ‌ధ్య ఉన్న ఒక‌టే తేడా మిడిల్ ఆర్డర్‌లో, హార్దిక్ పాండ్యా రూపంలో ఉన్న‌ టూ-ఇన్-వన్ ఆట‌గాడు. హార్డిక్ వాల్యూ తెలుసుకాబ‌ట్టే, ఇండియా 12 మంది ఆట‌గాళ్ల‌తో ఆడుతోంద‌ని క్రీడా పండితులు కామెంట్ చేస్తున్నారు.

చుట్టూ రాబందులాంటి క్రిటిక్స్ వెంటాడుతున్న వేళ‌ విరాట్ కోహ్లి, హాంకాంగ్‌పై అజేయ అర్ధ సెంచరీతో చెల‌రేగాడు. పాక్ తో కీల‌క‌మైన‌ 35 పరుగులతో తిరిగి ఫామ్‌లోకి వస్తున్నట్లు కనిపిస్తోంది. మ‌ళ్లీ సెకండ్ రౌండ్ మ్యాచ్ లో పాక్ పై అదే ధాటిని చూపిస్తే, కోహ్లీకి మ‌హ‌ర్ధ‌శ వ‌చ్చిన‌ట్లే అనుకోవాలి.

కాని పాక్ బౌలింగ్ ను త‌క్కువ‌గా చూడ‌కూడ‌దు. హాంకాంగ్‌పై పాకిస్తాన్ అదగొట్టింది. బౌలింగ్ స‌త్తా ఏంటో మ‌రోసారి ప్ర‌ద్శించింది. ముందు బ్యాటింగ్ లో మహ్మద్ రిజ్వాన్ 57 బంతుల్లో అజేయంగా 78 పరుగులతో ఫామ్‌లోకి వచ్చాడు. ఇక చివ‌ర్లో ఖుష్దిల్ షా 15 బంతుల్లో 35 పరుగులతో చెల‌రేగి ఆడాడు. ఇప్పుడు పాక్ కు కావాల్సింది ఇలాంటి ఆట‌గాళ్ల‌కు కొన్ని బంతుల‌ను మిగ‌ల్చ‌డం. ఇంకో సంగ‌తి, ఫ‌స్ట్ బ్యాటింగ్ చేస్తే, ఎన్ని ర‌న్స్ కొట్టాలో పాక్ కు అర్ధంకావ‌డంలేదు.

ఇప్పుడు ఇండియా స‌మ‌స్య కోహ్లీ ఫామ్ కాదు. రోహిత్ శర్మ ఆట‌తీరు. రోహిత్ శ‌ర్మ చివ‌రి 6 T20Iల్లో ఒక అర్ధ సెంచరీ మాత్రమే ఉంది. పాకిస్తాన్ తో ఆడుతున్న‌ప్పుడు దూకుడు బాగా ప‌డిపోయింది. అతని సగటు కెరీర్ సగటు 32. అదే పాక్ తో ఆడుతున్న‌ప్పుడు 13.66 ర‌న్స్ కి పడిపోయింది. స్ట్రైక్ రేట్ రేటు కూడా అంతే. గత వారం దుబాయ్‌లో ఇరు జట్లు తలపడినప్పుడు, రోహిత్ 18 బంతుల్లో 12 పరుగులు మాత్ర‌మే చేశాడు. ఈ మ్యాచ్ లో రోహిత్ రాణించాల్సి ఉంది.

దుబాబ్ పిచ్ మీద మధ్యాహ్నం ఉష్ణోగ్రత 40°Cకి చేరుకుంటుందన్న‌ది అంచ‌నా. ఆట మొద‌లైయ్యే స‌మ‌యానికి వేడి త‌గ్గొచ్చు. కాని విప‌రీత‌మైన ఉక్క‌పోత త‌ప్ప‌దు.

టాస్ గెలిస్తే ఏ జ‌ట్టు అయినా ఛేజింగ్ కోరుకొంటుంది.