Nidhan
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కమ్‌బ్యాక్ ఇచ్చేందుకు కఠోరంగా శ్రమిస్తున్నాడు. పాండ్యా తపన చూస్తుంటే అతడి కంటే తానే బెస్ట్ అని ప్రూవ్ చేయడానికే అన్నట్లు ఉంది.
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కమ్‌బ్యాక్ ఇచ్చేందుకు కఠోరంగా శ్రమిస్తున్నాడు. పాండ్యా తపన చూస్తుంటే అతడి కంటే తానే బెస్ట్ అని ప్రూవ్ చేయడానికే అన్నట్లు ఉంది.
Nidhan
ఏ గేమ్లోనైనా సక్సెస్ అవ్వాలంటే టాలెంట్ ఒక్కటే సరిపోదు. కాస్త లక్ కూడా కలిసొస్తేనే విజయవంతం అవ్వొచ్చు. కెరీర్‌ను సుదీర్ఘ కాలం పొడిగించుకోవాలంటే గాయాల బారిన పడకుండా ఉండాలి. అందుకు ఫిట్నెస్ మాత్రమే సరిపోదు.. కాస్త అదృష్టం కూడా తోడవ్వాలి. ఆటల్లో ఇంజ్యురీలు అవడం కామనే. అయితే కొందరు ప్లేయర్లకు మాత్రం ఎప్పుడూ గాయాల గోలే ఉంటుంది. దీని వల్ల కెరీర్ నాశనం అవుతుంది. ఇప్పుడు టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా పరిస్థితి అలాగే ఉంది. గాయాలతో సావాసం చేసే హార్దిక్.. వన్డే వరల్డ్ కప్-2023లో బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో తన బౌలింగ్‌లోనే గాయపడ్డాడు. ప్రత్యర్థి బ్యాటర్ కొట్టిన బంతిని ఆపబోయి కిందపడ్డాడు. దీంతో హార్దిక్ కాలికి గాయమైంది. దీని వల్ల మెగాటోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. అయితే రీఎంట్రీ కోసం కఠోరంగా శ్రమిస్తున్నాడు పాండ్యా. ఇది చూస్తుంటే అతడి కంటే బెటర్ అనిపించుకునేందుకే హార్దిక్ ఇలా చేస్తున్నాడనే డౌట్స్ వస్తున్నాయి.
ఐపీఎల్ నెక్స్ట్ సీజన్ స్టార్ట్ అయ్యే లోపు ఇంజ్యురీ నుంచి పూర్తిగా కోలుకోవాలని హార్దిక్ పట్టుదలతో ఉన్నాడు. గాయం కారణంగా వన్డే వరల్డ్ కప్ మధ్యలో నుంచి వచ్చేసిన ఈ స్టార్ ఆల్‌రౌండర్.. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌తో పాటు సౌతాఫ్రికా టూర్‌కూ దూరంగా ఉన్నాడు. త్వరలో ఆఫ్ఘానిస్థాన్‌తో జరగబోయే టీ20 సిరీస్‌తో పాటు తదుపరి ఇంగ్లండ్‌తో ఆడే 5 టెస్టుల సిరీస్‌కూ పాండ్యా దూరం కానున్నాడు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఐపీఎల్కల్లా కోలుకోవాలని అతడు అనుకుంటున్నాడు. అందుకోసం జిమ్‌లో తెగ కష్టపడుతున్నాడు. బరువులు ఎత్తుతూ కఠోరంగా శ్రమిస్తున్నాడు. పాండ్యా జిమ్ వర్కవుట్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఏడాది జూన్‌లో టీ20 వరల్డ్ కప్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌తో పాటు మెగా టోర్నీలో ఆడటమే లక్ష్యంగా సాధన చేస్తున్నాడు పాండ్యా.
ఈసారి ఐపీఎల్లో ముంబై ఇండియన్స్‌ను కెప్టెన్‌గా ముందుండి నడిపించనున్నాడు హార్దిక్. గుజరాత్ సారథిగా ఉన్న అతడ్ని మినీ వేలంలో దక్కించుకొని కెప్టెన్సీ పగ్గాలు అప్పజెప్పింది ముంబై యాజమాన్యం. ఈ నేపథ్యంలో ఎలాగైనా క్యాష్ రిచ్ లీగ్‌లో బరిలోకి దిగి సత్తా చాటాలని హార్దిక్ ఉవ్విళ్లూరుతున్నాడు. అయితే ఇది చూసిన నెటిజన్స్ మాత్రం పాండ్యా ఇంత కష్టపడుతోంది రోహిత్ శర్మ కోసమేనని అంటున్నారు. హిట్‌మ్యాన్ కంటే బ్యాటింగ్, కెప్టెన్సీలో తానే బెటర్ అనేది ప్రూవ్ చేయాలనే ఉద్దేశంతోనే జిమ్‌లో చెమటోడుస్తున్నాడని కామెంట్స్ చేస్తున్నారు. పాండ్యా ఎంత బాగా ఆడినా రోహిత్ కిందేనని చెబుతున్నారు. టీమ్‌కు ఐదుసార్లు కప్ అందించిన హిట్‌మ్యాన్‌కు ఏ విషయంలో అతడు సాటిరాడని అంటున్నారు. మరి.. పాండ్యా జిమ్ ఫొటోలపై భిన్నాభిప్రాయలు వ్యక్తమవడం మీద మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.
ఇదీ చదవండి: టీమిండియాపై సీనియర్ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్.. పంత్ వచ్చే దాకా అతనే గతి!
Hardik Pandya getting ready for World Cup & IPL. 🔥 pic.twitter.com/a0nWnrKPbO
— Johns. (@CricCrazyJohns) January 8, 2024
Hardik Pandya trains hard in gym to regain his fitness! 💪pic.twitter.com/jJlV8B9WBk
— OneCricket (@OneCricketApp) January 8, 2024