Nidhan
టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఇప్పుడు ఫుల్ జోష్‌లో ఉన్నాడు. యాక్సిడెంట్ తర్వాత కమ్‌బ్యాక్ ఇచ్చిన పంత్.. వరల్డ్ కప్‌ను భారత్ గెలుచుకోవడంతో సంతోషంలో మునిగిపోయాడు. కప్పు నెగ్గిన టీమ్‌లో భాగం కావడంతో విక్టరీని సెలబ్రేట్ చేసుకుంటున్నాడు.
టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఇప్పుడు ఫుల్ జోష్‌లో ఉన్నాడు. యాక్సిడెంట్ తర్వాత కమ్‌బ్యాక్ ఇచ్చిన పంత్.. వరల్డ్ కప్‌ను భారత్ గెలుచుకోవడంతో సంతోషంలో మునిగిపోయాడు. కప్పు నెగ్గిన టీమ్‌లో భాగం కావడంతో విక్టరీని సెలబ్రేట్ చేసుకుంటున్నాడు.
Nidhan
టీ20 వరల్డ్ కప్‌ను భారత్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. 13 ఏళ్లుగా అందని ద్రాక్షగా ఉన్న మెగాట్రోఫీని ఎట్టకేలకు కైవసం చేసుకుంది. రోహిత్ నాయకత్వంలోని టీమిండియా.. పొట్టి కప్పు ఫైనల్లో 7 పరుగుల తేడాతో సౌతాఫ్రికాను చిత్తు చేసింది. దీంతో దేశమంతటా సంబురాలు మిన్నంటాయి. భారత్ గెలుపును కోట్లాది మంది అభిమానులు సెలబ్రేట్ చేసుకున్నారు. బాణసంచా కాలుస్తూ, మిఠాయిలు పంచుతూ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. టీమిండియా ప్లేయర్లు కూడా విన్నింగ్స్ సెలబ్రేషన్స్‌లో మునిగిపోయారు. జట్టు వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఇప్పుడు ఫుల్ జోష్‌లో ఉన్నాడు. యాక్సిడెంట్ తర్వాత కమ్‌బ్యాక్ ఇచ్చిన పంత్.. వరల్డ్ కప్‌ను భారత్ గెలుచుకోవడంతో సంతోషంలో మునిగిపోయాడు. కప్పు నెగ్గిన టీమ్‌లో భాగం కావడంతో విక్టరీని సెలబ్రేట్ చేసుకుంటున్నాడు.
ఫైనల్లో ప్రొటీస్‌పై భారత్ విజయం సాధించగానే భావోద్వేగానికి లోనయ్యాడు పంత్. కెప్టెన్ రోహిత్ శర్మను పట్టుకొని ఏడ్చేశాడు. ఇతర ఆటగాళ్లను కౌగిలించుకొని నవ్వుతూ గెలుపును సెలబ్రేట్ చేసుకున్నాడు. కప్‌ను చేతబట్టి అందరితో కలసి ఫొటోలకు ఫోజులు ఇచ్చాడు. సాధించాం.. మనమే ఛాంపియన్స్ అంటూ గట్టిగా అరుస్తూ కనిపించాడు. దానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ఇంకా వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా పంత్ మరో ఎమోషనల్ పోస్ట్‌తో వార్తల్లో నిలిచాడు. విన్నింగ్ మెడల్‌తో ఉన్న ఫొటోలను అతడు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఇది ఆ భగవంతుడు రాసిన స్క్రిప్ట్ అని ఆ పోస్ట్‌లో రాసుకొచ్చాడు. వరల్డ్ కప్ టీమ్‌లో భాగమైనందుకు ఎంతో గర్వంగా, సంతోషంగా, గొప్పగా ఉందన్నాడు.
‘చాలా గొప్పగా, గర్వంగా అనిపిస్తోంది. ఎంతో సంతోషంగానూ ఉంది. ఆ దేవుడికి తన సొంత ప్లాన్ ఒకటి ఉంది. ఈ మెడల్ నాకు ఎంతో విభిన్నమైన అనుభూతిని ఇచ్చింది’ అంటూ పంత్ తన ఇన్‌స్టా పోస్ట్‌లో రాసుకొచ్చాడు. అతడి పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ పోస్ట్‌పై అక్షర్ పటేల్‌తో పాటు మహ్మద్ సిరాజ్ రియాక్ట్ అయ్యారు. అయితే వీళ్లు చాలా సరదాగా కామెంట్స్ పెట్టడం విశేషం. అచ్చం ఇలాంటి మెడలే తమ దగ్గర ఉందంటూ వాళ్లు ఫన్నీ రిప్లయ్స్ ఇచ్చారు. ఇక, మెగాటోర్నీలో పంత్ బ్యాటర్‌గా, కీపర్‌గా రాణించాడు. 8 మ్యాచుల్లో కలిపి అతడు 171 పరుగులు చేశాడు. వన్‌డౌన్‌లో వస్తూ విలువైన పరుగులు చేశాడు. దాదాపు ప్రతి మ్యాచ్‌లో ఆ పొజిషన్లో వస్తూ దూకుడైన బ్యాటింగ్‌తో టీమ్‌ను ఆదుకున్నాడు. అదే టైమ్‌లో ఇతర జట్లను భారీ షాట్లతో భయపెట్టాడు. మరి.. పంత్ ఎమోషనల్ పోస్ట్‌పై మీ ఒపీనియన్‌ను కామెంట్ చేయండి.