Nidhan
Dinesh Karthik: టీ20 వరల్డ్ కప్ గెలిచి సంతోషంలో ఉన్న టీమిండియా గురించి మాజీ బ్యాటర్ దినేష్ కార్తీక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత జట్టులోని ఆ ఆటగాడ్ని కాపాడుకోవాలన్నాడు.
Dinesh Karthik: టీ20 వరల్డ్ కప్ గెలిచి సంతోషంలో ఉన్న టీమిండియా గురించి మాజీ బ్యాటర్ దినేష్ కార్తీక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత జట్టులోని ఆ ఆటగాడ్ని కాపాడుకోవాలన్నాడు.
Nidhan
టీ20 వరల్డ్ కప్-2024 టైటిల్‌ను దేశానికి అందించిన టీమిండియా ప్లేయర్లను అందరూ మెచ్చుకుంటున్నారు. 13 ఏళ్లుగా అందని ద్రాక్షగా ఉన్న కప్పు కలను తీర్చారంటూ ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. ఇది ఎప్పటికీ మర్చిపోలేమని, పోరాడాలంటూ తమలో స్ఫూర్తిని నింపిన ఆటగాళ్లకు సెల్యూట్ చేస్తున్నారు అభిమానులు. జట్టును ముందుండి నడిపించిన కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు వెనుక నుంచి మార్గదర్శకత్వం చేసిన కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు థ్యాంక్స్ చెబుతున్నారు. వీళ్లతో పాటు టీమ్ సక్సెస్‌లో కీలకంగా వ్యవహరించిన అందరు ఆటగాళ్లు, కోచింగ్ స్టాఫ్, సపోర్ట్ స్టాఫ్‌ను ప్రశంసిస్తున్నారు. టీమిండియా కప్పుతో స్వదేశానికి చేరుకోగానే మరింతగా సెలబ్రేట్ చేసుకోవాలని చూస్తున్నారు.
ఇక, వరల్డ్ కప్ విక్టరీలో కీలక పాత్ర పోషించిన పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రాను అందరూ మెచ్చుకుంటున్నారు. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌ను అందుకున్నాడంటేనే కప్పు గెలవడంలో అతడి కాంట్రిబ్యూషన్ ఏంటో అర్థం చేసుకోవలని అంటున్నారు. ఇలాంటోడు జట్టులో ఉంటే ఏదైనా సాధ్యమేనని చెబుతున్నారు. బుమ్రా లాంటి అద్భుత ఆటగాళ్లు మరింత మంది టీమిండియాలోకి రావాలని కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా మాజీ క్రికెటర్ దినేష్ కార్తీక్ కూడా అతడ్ని ప్రశంసల్లో ముంచెత్తాడు. బుమ్రా కోహినూర్ వజ్రం కంటే కూడా విలువైనోడని అన్నాడు. అతడ్ని టీమ్ మేనేజ్మెంట్ కాపాడుకోవాలని సూచించాడు డీకే. అతడో అద్భుత బౌలర్ అని తెలిపాడు.
‘కోహినూర్ డైమండ్ కంటే కూడా జస్ప్రీత్ బుమ్రా ఎంతో విలువైనోడు. ప్రస్తుత ప్రపంచ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలోనూ అతడే గొప్ప బౌలర్. బుమ్రాను మించినోడు ఎవరూ లేరు. తీవ్ర ఒత్తిడిలో వచ్చి అలా బౌలింగ్ చేయడం మామూలు విషయం కాదు. టీమ్ ప్రెజర్లో ఉన్న ప్రతిసారి వచ్చి అలా పెర్ఫార్మ్ చేయడాన్ని ఎంత మెచ్చుకున్నా తక్కువే. క్రికెట్లో చాలా కొద్ది మంది ప్లేయర్లు మాత్రమే ఇలా చేయగలరు. ఎంతటి కఠిన పరిస్థితుల్లోనైనా అతడు రాణిస్తాడు. బుమ్రా లాంటి బౌలర్ తమ టీమ్‌లో ఉండాలని ప్రతి కెప్టెన్ కోరుకుంటాడు. ఇది అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు’ అని కార్తీక్ చెప్పుకొచ్చాడు. ఇక, మెగాటోర్నీలో 8 మ్యాచుల్లో కలిపి 15 వికెట్లు పడగొట్టాడు బుమ్రా. అతడి ఎకానమీ 4.17గా ఉంది. దీన్ని బట్టే అతడి బౌలింగ్ ఏ రేంజ్లో సాగిందో అర్థం చేసుకోవచ్చు. మరి.. బుమ్రా కోహినూర్ కంటే విలువైనోడనే వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.
Dinesh Karthik ” Jasprit Bumrah is more valuable than a Kohinoor diamond.Genuinely,he is the greatest all-format bowler at the moment in world cricket.Under pressure to come and keep performing time and time again,not many can do that.”pic.twitter.com/rDo9KhGmXw
— Sujeet Suman (@sujeetsuman1991) July 3, 2024