Nidhan
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పుడు కసితో ఉన్నాడు. ఎలాగైనా పొట్టి కప్పు కొట్టాలని అనుకుంటున్న హిట్‌మ్యాన్.. ఆ దిశగా సక్సెస్‌ఫుల్‌గా కొన్ని అడుగులు వేశాడు.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పుడు కసితో ఉన్నాడు. ఎలాగైనా పొట్టి కప్పు కొట్టాలని అనుకుంటున్న హిట్‌మ్యాన్.. ఆ దిశగా సక్సెస్‌ఫుల్‌గా కొన్ని అడుగులు వేశాడు.
Nidhan
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పుడు కసితో ఉన్నాడు. ఎలాగైనా పొట్టి కప్పు కొట్టాలని అనుకుంటున్న హిట్‌మ్యాన్.. ఆ దిశగా సక్సెస్‌ఫుల్‌గా కొన్ని అడుగులు వేశాడు. కెరీర్ మొదట్లో టీ20 ప్రపంచ కప్‌ను ఒడిసిపట్టిన అతడు.. ఆ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ విన్నింగ్ టీమ్‌లోనూ భాగంగా ఉన్నాడు. అయితే కెరీర్ పరంగా ఇప్పుడు అతడు పీక్‌లో ఉన్నాడు. అందునా భారత జట్టుకు కెప్టెన్‌గా ఉండటంతో ఎలాగైనా టీమ్‌కు కప్పును అందించాలని చూస్తున్నాడు. వరల్డ్ కప్ టైటిల్‌ను నెగ్గి కెరీర్‌ను మరింత చిరస్మరణీయంగా మార్చుకోవాలని రోహిత్ పట్టుదలతో ఉన్నాడు. గతేడాది స్వదేశంలో జరిగిన వన్డే వరల్డ్ కప్-2023లో ఫైనల్లో ఓడిపోయింది భారత్. దీంతో చాన్నాళ్లు బయటకు రాని హిట్‌మ్యాన్.. క్రమంగా ఆ పెయిన్ నుంచి బయటపడ్డాడు.
వన్డే ప్రపంచ కప్ ఓటమికి బదులు తీర్చుకోవాలని భావిస్తున్న రోహిత్.. ప్రస్తుత టీ20 వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియాను చిత్తు చేయాలని ప్లాన్స్ వేస్తున్నాడు. అలాగే కప్‌ను ఒడిసిపట్టి వంద కోట్ల మంది భారతీయుల్ని సంతోషపర్చాలని చూస్తున్నాడు. ఆ దిశగా ఇప్పటికే టీమ్ ప్రయత్నాలు మొదలయ్యాయి. గ్రూప్ దశను దాటిన మెన్ ఇన్ బ్లూ.. ఇప్పుడు సూపర్-8కు చేరుకుంది. ఈ స్టేజ్‌ను కూడా దాటితే ఇక మిగిలేది సెమీస్, ఫైనల్సే. మెగా టోర్నీ కీలక దశకు చేరుకోవడంతో జట్టు విజయం కోసం కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో కలసి రోహిత్ తన వ్యూహాలకు పదును పెడుతున్నాడు. ఎదురొచ్చిన ప్రత్యర్థిని తుక్కుతుక్కుగా కొట్టాలని చూస్తున్నాడు. ఈ తరుణంలో అతడి గురించి సహచర ఆటగాళ్లు రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్, సంజూ శాంసన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. హిట్‌మ్యాన్ లాంటోడు ఇంకొకడు లేడంటూ ప్రశంసల్లో ముంచెత్తారు.
జట్టులోకి ఏ యువ ఆటగాడు వచ్చినా అతడ్ని రోహిత్ అక్కున చేర్చుకుంటాడని స్పిన్నర్ కుల్దీప్ తెలిపాడు. యంగ్‌స్టర్స్‌కు కావాల్సిన సపోర్ట్ ఇస్తూ, వాళ్లలోని టాలెంట్‌ను బయటకు తీయడంలో హిట్‌మ్యాన్ దిట్ట అని అన్నాడు. దశాబ్దంన్నర కాలంగా ఆడుతున్నా రోహిత్లో ఇంకా నేర్చుకునే తత్వం అలాగే ఉందన్నాడు పంత్. ఇంత క్రికెట్ ఆడినా ప్రతి రోజు నెట్స్‌లో అంతే శ్రమిస్తుంటాడని, తన గేమ్‌ను మరింతగా మెరుగుపర్చుకోవడంపై అతడు వర్క్ చేస్తుంటాడని.. ఇదే అతడి గొప్పతనమని పేర్కొన్నాడు. రోహిత్ కదలికలన్నీ గమనిస్తుంటామని, అతడి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నామని సంజూ శాంసన్ వ్యాఖ్యానించాడు. ఇక, వీళ్ల ముగ్గురి కెరీర్ల విషయానికొస్తే.. కుల్దీప్ ధోని కెప్టెన్సీలో టీమ్‌లోకి అడుగుపెట్టాడు. కానీ అతడ్ని స్టార్‌గా మార్చింది, టీమ్ అవసరాలకు తగ్గట్లు పర్ఫెక్ట్గా వాడుకుంది హిట్‌మ్యానే. కోహ్లీ సారథ్యంలో వెలుగులోకి వచ్చిన పంత్‌ను మ్యాచ్ విన్నర్‌గా మార్చిన ఘనత కూడా అతడిదే. సంజూ టాలెంట్‌పై నమ్మకం ఉంచి మళ్లీ జట్టులోకి ఎంట్రీ ఇచ్చేలా చేశాడు రోహిత్. అలా వీళ్ల ముగ్గురి సక్సెస్‌లో రోహిత్ పాత్ర ఉంది.