iDreamPost
android-app
ios-app

టీ20 వరల్డ్‌ కప్‌ 2024 షెడ్యూల్‌ ఖరారు! అమెరికాలో మ్యాచ్‌లు..

  • Author Soma Sekhar Published - 03:49 PM, Sat - 29 July 23
  • Author Soma Sekhar Published - 03:49 PM, Sat - 29 July 23
టీ20 వరల్డ్‌ కప్‌ 2024 షెడ్యూల్‌ ఖరారు! అమెరికాలో మ్యాచ్‌లు..

టీ20 వరల్డ్ కప్ 2024 మెగా టోర్నీకి తెరలేచింది. ఈ మినీ సంగ్రామానికి సంబంధించిన షెడ్యూల్ ను ఐసీసీ ప్రకటించింది. 2024, జూన్ 4 నుంచి 30 వరకు పొట్టి ప్రపంచ కప్ జరగనుంది. ఇక టోర్నీలో మెుత్తం 20 జట్లు పాల్గొంటుండగా.. ఇప్పటికే 17 జట్లు క్వాలిఫై అయ్యాయి. ప్రస్తుతం క్వాలిఫయింగ్ మ్యాచ్ లు జరుగుతున్నాయి. ఇక ఈ పొట్టి సంగ్రామానికి వెస్టిండీస్-అమెరికాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. మెుత్తం 10 వేదికల్లో మ్యాచ్ లు నిర్వహించనున్నారు.

2024 టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ ను ప్రకటించింది ఐసీసీ. వచ్చే ఏడాది జూన్ 4 నుంచి 30 వరకు వెస్టిండీస్-అమెరికా వేదికగా ఈ మీని యుద్ధం ప్రారంభంకానుంది. ఇందుకు సంబంధించిన వేదికలను ప్రస్తుతం ఐసీసీ బృందం పరిశీలిస్తోంది. ఐసీసీ నిబంధనల ప్రకారం మ్యాచ్ లకు ఆతిథ్యం ఇచ్చే వేదికలకు ఇంటర్నేషనల్ హోదా తప్పనిసరి. ఇక ఈ టోర్నీలో మెుత్తం 20 జట్లు పాల్గొనబోతున్నాయి. ఈ 20 జట్లను నాలుగు గ్రూప్ లుగా విభజించి ఒక్కోగ్రూప్ లో 5 టీమ్స్ కు స్థానం కల్పిస్తారు. ప్రతీ గ్రూప్ లో తొలి, రెండో స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్ 8కు అర్హత సాధిస్తాయి.

కాగా.. మెుత్తం 10 స్టేడియాల్లో మ్యాచ్ లు నిర్వహిస్తూ ఉండగా.. వాటిలో అమెరికాలోని డల్లాస్ (గ్రాండ్ ప్రైరీ స్టేడియం), మోరిస్ విల్లే (చర్చ్ స్ట్రీట్ పార్క్), ఫ్లోరిడాలోని లౌడర్ హిల్ స్టేడియంతో పాటుగా న్యూయార్క్ (వాన్న కార్ట్ ల్యాండ్ పార్క్) లో మ్యాచ్ లు నిర్వహించనున్నారు. అయితే ఈ స్టేడియాలకు ఇంకా అంతర్జాతీయ హోదా ప్రకటించలేదు. త్వరలోనే వీటికి ఇంటర్నేషనల్ హోదా ప్రకటిస్తారని సమాచారం.


ఇదికూడా చదవండి: VIDEO: మళ్లీ మళ్లీ ఇలాంటి క్యాచ్‌లు చూడలేరు! రూట్‌ మామ భలే పట్టాడు