iDreamPost
android-app
ios-app

దుమ్మురేపుతున్న టీ20 వరల్డ్ కప్ ప్రోమో.. మీరూ ఓ లుక్కేయండి!

  • Published Feb 22, 2024 | 10:03 PM Updated Updated Feb 22, 2024 | 10:03 PM

T20 World Cup 2024 promo: టీ20 వరల్డ్ కప్ 2024 ప్రోమోను తాజాగా రిలీజ్ చేసింది ఐసీసీ. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మరి మీరూ ఆ ప్రోమోను ఓసారి చూసేయండి.

T20 World Cup 2024 promo: టీ20 వరల్డ్ కప్ 2024 ప్రోమోను తాజాగా రిలీజ్ చేసింది ఐసీసీ. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మరి మీరూ ఆ ప్రోమోను ఓసారి చూసేయండి.

దుమ్మురేపుతున్న టీ20 వరల్డ్ కప్ ప్రోమో.. మీరూ ఓ లుక్కేయండి!

2024.. క్రికెట్ లవర్స్ కు పండగనే చెప్పాలి. ఈ ఏడాది మార్చిలో ఐపీఎల్ జాతర ఉండగా.. ఆ వెంటనే టీ20 ప్రపంచ కప్ ఉండనే ఉంది. దీంతో క్రికెట్ ప్రేమికులకు కావాల్సినంత వినోదం అందనుంది. ఇక జూన్ లో వెస్టిండీస్, అమెరికా వేదికగా ప్రారంభం కానున్న పొట్టి ప్రపంచ కప్ కు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదల చేసింది ఐసీసీ. ప్రోమో ఇలా రిలీజ్ అయ్యిందో లేదో.. సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

టీ20 ప్రపంచ కప్ 2024.. జూన్ 1న ప్రారంభం అయ్యి జూన్ 29న ముగుస్తుంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ టోర్నీలో ఏకంగా 20 జట్లు పోటీ పడబోతున్నాయి. దీంతో మ్యాచ్ సంఖ్య కూడా పెరగనుంది. ఇక ఈ మెగాటోర్నీని అమెరికా, వెస్టిండీస్ దేశాలు సంయుక్తంగా నిర్వహించనున్నాయి. ఇక ఇప్పటి నుంచే ఈ పొట్టి ప్రపంచ కప్ కు సిద్దమవుతూ వస్తున్నాయి జట్లు. ఎలాగైనా ఈ కప్ ను గెలుచుకోవాలని అన్ని జట్లు ఆరాటపడుతున్నాయి. ఇక ఈ మెగా టోర్నీకి సంబంధించిన ప్రోమోను తాజాగా రిలీజ్ చేసింది.

ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాను ఉర్రూతలూగిస్తోంది. నాలుగు తోక చుక్కలు(బాల్స్) మిట్ట మధ్యాహ్నం ఆకాశంలో వెళ్తూ ఉంటాయి. వాటిని చూస్తూ శుబ్ మన్ గిల్, షాహిన్ అఫ్రిదీతో పాటుగా మరికొందరు నమ్మలేకపోతారు. ఆ బాల్స్ ఒకటి కారుపై ఇంకోటి స్విమ్మింగ్ పూల్ లో పడుతాయి. ఇక ఈ ప్రోమోలో పొలార్డ్, స్టోయినిస్ కనిపించి అలరించారు. బ్యాటర్లు కొట్టే బంతులే తోక చుక్కలుగా చూపించారు ప్రోమోలో. ఈ అద్బుతమైన ప్రోమో క్రికెట్ ప్రేమికులను అలరిస్తోంది. మ్యాచ్ లకు  సంబంధించిన టికెట్లను కూడా బుక్ చేసుకోమని ఐసీసీ సూచించింది. మరి ఆ వీడియో చూసి.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by ICC (@icc)

ఇదికూడా చదవండి: విరాట్ కోహ్లీ కొడుక్కి బ్రిటన్ పౌరసత్వం.. సరికొత్త చర్చ!