iDreamPost

విరాట్ కోహ్లీ కొడుక్కి బ్రిటన్ పౌరసత్వం.. సరికొత్త చర్చ!

కోహ్లీ కొడుకు బ్రిటన్ లో జన్మించాడు కాబట్టి అతడికి బ్రిటన్ పౌరసత్వం ఇస్తారా? ప్రస్తుతం ఈ క్వశ్చన్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. నిజంగానే విరాట్ కొడుకు అకాయ్ కి బ్రిటన్ పౌరసత్వం ఇస్తారా? ఇవ్వరా? పూర్తి వివరాలు..

కోహ్లీ కొడుకు బ్రిటన్ లో జన్మించాడు కాబట్టి అతడికి బ్రిటన్ పౌరసత్వం ఇస్తారా? ప్రస్తుతం ఈ క్వశ్చన్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. నిజంగానే విరాట్ కొడుకు అకాయ్ కి బ్రిటన్ పౌరసత్వం ఇస్తారా? ఇవ్వరా? పూర్తి వివరాలు..

విరాట్ కోహ్లీ కొడుక్కి బ్రిటన్ పౌరసత్వం.. సరికొత్త చర్చ!

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఇటీవలే తండ్రిగా ప్రమోషన్ పొందిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 15న విరాట్ భార్య అనుష్క శర్మ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ బాబుకు ‘అకాయ్’ అని నామకరణం కూడా చేశారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోహ్లీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక కోహ్లీ కొడుకు అకాయ్ పేరుకు అర్ధం ఏంటి? ఈ పేరే ఎందుకు పెట్టారు? అంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. తాజాగా సరికొత్త చర్చకు తెరలేపారు నెటిజన్లు. కోహ్లీ కొడుకు బ్రిటన్ లో జన్మించాడు కాబట్టి అతడికి బ్రిటన్ పౌరసత్వం ఇస్తారా? అంటూ సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. మరి నిజంగానే కోహ్లీ కొడుక్కి బ్రిటన్ పౌరసత్వం ఇస్తారా? పూర్తి వివరాల్లోకి వెళితే..

విరాట్ కోహ్లీకి కొడుకు పుట్టడంతో.. ఫ్యాన్స్ తెగ సంతోషపడుతున్నారు. విరుష్క జంటకు ఇదివరకే వామిక అనే కూతురు ఉన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు బాబు అకాయ్ పుట్టడంతో.. ఫ్యాన్స్ మరింత ఆనందపడుతున్నారు. ఇదంతా కాసేపు పక్కనపెడితే.. సోషల్ మీడియాలో సరికొత్త చర్చనడుస్తోంది. అకాయ్ లండన్ లో జన్మించాడు. దీంతో అతడికి బ్రిటన్ పౌరసత్వం లభిస్తుందా? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే యునైటెడ్ కింగ్ డమ్ ఆస్పత్రిలో జన్మించాడు కాబట్టి అతడికి బ్రిటన్ పౌరసత్వం ఇవ్వరు. ఎందుకుంటే? తల్లిదండ్రుల్లో ఒకరు బ్రిటీష్ పౌరుడై ఉండాలి. లేదంటే? సుదీర్ఘకాలం బ్రిటన్ లో స్థిర నివాసం ఏర్పరచుకుని ఉండాలి. అప్పుడే పుట్టిన బిడ్డకు బ్రిటన్ పౌరసత్వం లభిస్తుంది.

కాగా.. బ్రిటన్ పౌరతస్వం లభించాలంటే.. ఈ దేశ పౌరసత్వం కలిగిన తల్లిదండ్రులకు యూకే వెలుపల పుట్టిన బిడ్డలకు తమ దేశ సిటిజన్ షిప్ ఇస్తుంది అక్కడి ప్రభుత్వం. ఇక అకాయ్ లండన్ లో జన్మించినా.. విరాట్-అనుష్క దంపతులు భారత పౌరులు కాబట్టి, అకాయ్ కు బ్రిటన్ పౌరసత్వం వచ్చే ఛాన్స్ లేదు. 2017లో ఇటలీ వేదికగా విరాట్ కోహ్లీ-అనుష్క శర్మలు పెళ్లి చేసుకున్నారు. వారికి 2021లో వామిక జన్మించింది. రెండోసారి తండ్రైన కోహ్లీ.. తన విలువైన సమయాన్ని పూర్తిగా కుటుంబానికే కేటాయించాడు. అందుకే ఇంగ్లండ్ తో జరుగుతున్న ఐదు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ కు పూర్తిగా దూరమైయ్యాడు.

ఇదికూడా చదవండి: సచిన్ సింప్లిసిటీకి ఫిదా.. ఏం చేశాడో తెలుసా? వైరలవుతున్న వీడియో!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి