Nidhan
సన్‌రైజర్స్ యంగ్ సెన్సేషన్ నితీష్ రెడ్డి ఈ ఏడాది ఐపీఎల్లో అదరగొట్టాడు. విధ్వంసక బ్యాటింగ్‌తో ప్రత్యర్థి జట్లను భయపెట్టాడు. అలాంటోడు తాజాగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
సన్‌రైజర్స్ యంగ్ సెన్సేషన్ నితీష్ రెడ్డి ఈ ఏడాది ఐపీఎల్లో అదరగొట్టాడు. విధ్వంసక బ్యాటింగ్‌తో ప్రత్యర్థి జట్లను భయపెట్టాడు. అలాంటోడు తాజాగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
Nidhan
పేరుకే తెలుగు జట్టు.. అందులో తెలుగువాళ్లే లేరంటూ విమర్శించారు. లోకల్ ప్లేయర్లను ఆడించనప్పుడు ఇంకా ఆ ఫ్రాంచైజీ ఎందుకంటూ ట్రోల్ చేశారు. ఇతర రాష్ట్రాల ఆటగాళ్లు, ఇంటర్నేషనల్ ప్లేయర్లతో టీమ్‌ను నింపేశారని.. జట్టులో స్థానికులకు అన్యాయం జరుగుతోందంటూ గగ్గోలు పెట్టారు. ఇదంతా సన్‌రైజర్స్ హైదరాబాద్ గురించే. ఇరు తెలుగు రాష్ట్రాల అభిమానుల మద్దతుతో ఐపీఎల్లో అదరగొడుతోంది ఎస్ఆర్హెచ్. అయితే ఫస్ట్ నుంచి కూడా ఈ జట్టు విషయంలో ఒక కంప్లయింట్ బాగా వస్తుండేది. అదే లోకల్ ప్లేవర్ మిస్సవడం. అయితే ఈ సీజన్‌తో అది కూడా పూర్తైంది. తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డికి ఛాన్స్ ఇచ్చింది టీమ్ మేనేజ్మెంట్. అతడు దాన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు. విధ్వంసక బ్యాటింగ్‌తో ఆడియెన్స్ హృదయాలు దోచుకున్నాడు.
ఈ సీజన్లో ఆడిన 13 మ్యాచుల్లో 303 పరుగులు చేశాడు నితీష్ రెడ్డి. బౌలింగ్‌లోనూ రాణించి 3 వికెట్లు పడగొట్టాడు. అతడికి ఎక్కువగా బౌలింగ్ చేసే ఛాన్స్ రాలేదు. కెప్టెన్ కమిన్స్ తన చేతికి బాల్ ఇచ్చినప్పుడల్లా మాత్రం ప్రూవ్ చేసుకున్నాడు. ఒక మ్యాచ్‌లో 17 పరుగులు ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్ ఫైనల్స్‌కు చేరుకోవడంలో కీలక పాత్ర పోషించాడు నితీష్. అందుకే అతడు ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్నాడు. టీమిండియాకు ఫ్యూచర్ ఆల్‌రౌండర్‌గా అతడ్ని అందరూ మెచ్చుకుంటున్నారు. ఈ తరుణంలో నితీష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఆ భారత స్టార్ ప్లేయర్‌తో తనను తాను పోల్చుకోనని చెప్పాడు. కానీ తన మీద తనకు పూర్తి నమ్మకం ఉందని స్పష్టం చేశాడు.
‘టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాతో నన్ను నేను పోల్చుకోను. కానీ నా బ్యాటింగ్ ఎబిలిటీస్ మీద నాకు విశ్వాసం ఉంది. నేను బాగా బ్యాటింగ్ చేయగలనని తెలుసు. కానీ బౌలింగ్ విషయంలో మాత్రం అంత కాన్ఫిడెన్స్ లేదు. బౌలింగ్‌లో నేను మరింత మెరుగవ్వాలి. పాండ్యా స్థాయికి చేరుకోవాలంటే నేను చాలా బెటర్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు బౌలింగ్ చేస్తున్న స్పీడ్ కంటే ఇంకో 3 నుంచి 4 కిలోమీటర్లు అదనపు వేగంతో బౌలింగ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు భారత జట్టు తరఫున బౌలర్‌గా కూడా బరిలోకి దిగే సామర్థ్యం నాకు ఉందని చెప్పొచ్చు. కాబట్టి ఆ దిశగా నేను మరింత కష్టపడాల్సి ఉంటుంది’ అని నితీష్ రెడ్డి చెప్పుకొచ్చాడు. మరి.. పాండ్యాలాగే నితీష్ కూడా టీమిండియాకు ఆడగలడని మీరు భావిస్తున్నట్లయితే కామెంట్ చేయండి.
Nitish Reddy “I am not comparable to Hardik Pandya.I’m confident about my batting & rate it highly but In bowling,I need to improve,to get to his stage.If I can improve those 3-4 kph then I can assure India that I have a great ability to bowl like bowler”pic.twitter.com/cPHU5EJD3W
— Sujeet Suman (@sujeetsuman1991) June 1, 2024