Nidhan
వెస్టిండీస్ దిగ్గజం బ్రియానా లారా సుదీర్ఘ కెరీర్లో ఎన్నో అరుదైన ఘనతలు సాధించాడు. బ్రేక్ చేయలేని చాలా రికార్డులు క్రియేట్ చేశాడు. అతడి అన్బ్రేకబుల్ రికార్డ్స్‌లో ‘400’ ఒకటి.
వెస్టిండీస్ దిగ్గజం బ్రియానా లారా సుదీర్ఘ కెరీర్లో ఎన్నో అరుదైన ఘనతలు సాధించాడు. బ్రేక్ చేయలేని చాలా రికార్డులు క్రియేట్ చేశాడు. అతడి అన్బ్రేకబుల్ రికార్డ్స్‌లో ‘400’ ఒకటి.
Nidhan
బ్రియాన్ లారా.. ఈ పేరు తెలియని క్రికెట్ లవర్ ఉండరంటే అతిశయోక్తి కాదు. క్లాస్ బ్యాటింగ్‌తో కోట్లాది మంది అభిమానాన్ని సంపాదించుకున్నాడతను. ఒకప్పుడు తిరుగులేని విధంగా క్రికెట్‌ను ఏలిన వెస్టిండీస్ 90వ దశకం చివరి నుంచి బలహీనంగా మారుతూ వచ్చింది. అప్పటి నుంచి కొన్నేళ్ల పాటు విండీస్‌కు లారానే దిక్కయ్యాడు. టీమ్ మొత్తం పెవిలియన్‌కు చేరినా అతడు మాత్రం ఒకవైపు ఒంటరిగా పోరాడుతూ ఉండేవాడు. అద్భుతమైన బ్యాటింగ్‌తో ఎన్నో మ్యాచుల్లో టీమ్‌ను ఓటమి నుంచి గట్టున పడేశాడు. లారాను ఔట్ చేసేవరకు కరీబియన్ టీమ్‌ను ఆపలేమని ఇతర జట్లకు తెలుసు. అందుకే అతడి కోసం రకరకాల ప్లాన్స్‌తో వచ్చేవి. అయితే అతడు మాత్రం సొగసైన షాట్లు, కళాత్మక డ్రైవ్‌లతో ప్రత్యర్థి ఎత్తుగడను చిత్తు చేసేవాడు. కెరీర్లో ఎన్నో అరుదైన ఘనతలు అందుకున్నాడు లారా.
లారా కెరీర్లో ఎన్నో రేర్ రికార్డ్స్ ఉన్నాయి. అయితే టెస్టుల్లో బాదిన 400 మాత్రం ఇప్పటికీ చెక్కుచెదరలేదు. లాంగ్ ఫార్మాట్లో ట్రిపుల్ సెంచరీ కొట్టడమే పెద్ద ఘనతగా చెప్పుకునే టైమ్‌లో ఏకంగా నాలుగొందలు బాదేశాడు లారా. ఇంగ్లండ్‌తో 2004లో జరిగిన టెస్టులో ఈ అద్భుతం జరిగింది. అయితే ఇన్నేళ్లలో ఏ ఒక్క ప్లేయర్ కూడా దీనికి దరిదాపుల్లోకి రాలేకపోయాడు. ఇప్పటి తరం బ్యాటర్లు టీ20లు, వన్డేల్లో వీరబాదుడు బాదుతున్నా బ్యాటింగ్‌కు అసలు సిసలు పరీక్ష లాంటి టెస్టుల్లో ఆ లెవల్లో అటాకింగ్ అప్రోచ్‌తో వెళ్లలేకపోతున్నారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి దిగ్గజాలు కూడా ఈ రికార్డ్‌ను టచ్ చేయలేకపోయారు. అయితే ప్రస్తుత భారత జట్టులోని ఇద్దరు యంగ్‌స్టర్స్ తన రికార్డ్‌ను బ్రేక్ చేయగలరని అంటున్నాడు లారా.
టీమిండియా యంగ్ బ్యాటర్స్ శుబ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్‌కు టెస్టుల్లో ఒకే ఇన్నింగ్స్‌లో 400 పరుగుల మార్క్‌ను చేరుకునే సత్తా ఉందన్నాడు లారా. వాళ్లిద్దరే తన రికార్డును బద్దలు కొట్టగలరని నమ్మకంగా చెప్పాడు. గిల్-జైస్వాల్ క్రీజులో కుదురుకుంటే ఇలాంటి చాలా రికార్డులకు పాతర వేయగలరన్నాడు లారా. తాను క్రికెట్ ఆడే టైమ్‌లో వీరేంద్ర సెహ్వాగ్, క్రిస్ గేల్, ఇంజమామ్ ఉల్ హక్, సనత్ జయసూర్య లాంటి కొందరు ప్లేయర్లు క్వాట్రపుల్ సెంచరీ మార్క్‌ను దాటేందుకు తెగ ప్రయత్నించారన్నాడు. అయితే అలాంటి దూకుడైన ఆటగాళ్లు ఇప్పుడు పెద్దగా లేరని పేర్కొన్నాడు. ఇంగ్లండ్ టీమ్‌లో జాక్ క్రాలే, హ్యారీ బ్రూక్ అగ్రెసివ్‌గా ఆడుతున్నారని మెచ్చుకున్నాడు. మరి.. లారా 400 రికార్డును జైస్వాల్, గిల్ బ్రేక్ చేయగలరని మీరు భావిస్తే కామెంట్ చేయండి.
Legendary West Indies batter Brian Lara has backed Indian youngsters Yashasvi Jaiswal and Shubman Gill to break his world record of highest individual score in Tests of 400.#ShubmanGill #BrianLara #YashasviJaiswal
Read More: https://t.co/9pXUyaeorD pic.twitter.com/uYeLBcuGKD— IndiaToday (@IndiaToday) July 11, 2024