Nidhan
టీమిండియా నయా కోచ్‌గా గౌతం గంభీర్ పేరును ప్రకటించింది బీసీసీఐ. గౌతీ రాకతో భారత క్రికెట్ కోచింగ్ స్టాఫ్‌లో సమూల మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో గంభీర్ కొత్త రోల్‌పై సౌతాఫ్రికా లెజెండ్ డేల్ స్టెయిన్ రియాక్ట్ అయ్యాడు.
టీమిండియా నయా కోచ్‌గా గౌతం గంభీర్ పేరును ప్రకటించింది బీసీసీఐ. గౌతీ రాకతో భారత క్రికెట్ కోచింగ్ స్టాఫ్‌లో సమూల మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో గంభీర్ కొత్త రోల్‌పై సౌతాఫ్రికా లెజెండ్ డేల్ స్టెయిన్ రియాక్ట్ అయ్యాడు.
Nidhan
ఎట్టకేలకు టీమిండియా కోచ్ పదవిపై భారత క్రికెట్ బోర్డు తేల్చేసింది. కొత్త కోచ్‌గా లెజెండ్ గౌతం గంభీర్ పేరును ప్రకటిస్తూ అధికారిక ప్రకటన చేసింది. భారత జట్టులోకి గౌతీని ఆహ్వానిస్తున్నామంటూ బోర్డు సెక్రెటరీ జైషా అనౌన్స్మెంట్ చేశారు. టీమిండియాను ముందుకు తీసుకెళ్లేందుకు గంభీర్‌కు పూర్తిగా సహకరిస్తామని, బోర్డు నుంచి ఎలాంటి సాయం కావాలన్నా అందించేందుకు సిద్ధంగా ఉంటామని ఆయన తెలిపారు. కోచ్ పదవి దక్కడంపై గౌతీ ఎమోషనల్ అయ్యాడు. జాతీయ జట్టుకు మరోమారు సేవలు అందించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నాడు. జట్టును గెలుపు మార్గంలో నడిపేందుకు తన శాయశక్తులా కృషి చేస్తానని చెప్పాడు. 140 కోట్ల మంది ప్రజలు గర్వపడేలా చేయడమే తన గోల్ అని స్పష్టం చేశాడు.
గంభీర్ రాకతో భారత్‌కు ఎదురుండదని అభిమానులు, మాజీ క్రికెటర్లు అంటున్నారు. రెండు వరల్డ్ కప్‌లు గెలిచిన గౌతీకి ఇంటర్నేషనల్ క్రికెట్లో ఉండే ప్రెజర్, ఫ్యాన్స్ పెట్టుకునే ఎక్స్పెక్టేషన్స్.. ఇలా అన్నీ తెలుసునని, అతడు టీమ్‌ను గెలుపు బాటలో నడపడం ఖాయమని అంటున్నారు. అతడి కోచింగ్‌లో భారత్ మరిన్ని కప్పులు కొట్టడం పక్కా అని చెబుతున్నారు. ఈ తరుణంలో మెన్ ఇన్ బ్లూ హెడ్ కోచ్‌గా గంభీర్‌ను ఎంపిక చేయడంపై సౌతాఫ్రికా దిగ్గజం డేల్ స్టెయిన్ స్పందించాడు. తాను గౌతీకి బిగ్ ఫ్యాన్‌నని అన్నాడు. అతడిలో అగ్రెషన్ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పాడు. డ్రెస్సింగ్ రూమ్‌లోకి ఆ అగ్రెషన్, ఫైర్‌ను తీసుకొస్తాడనే ఉద్దేశంతోనే అతడ్ని కోచ్‌గా తీసుకున్నారని స్టెయిన్ తెలిపాడు.
‘నేను గంభీర్‌కు వీరాభిమానిని. అతడి అగ్రెషన్ అంటే నాకు ఇష్టం. చాలా తక్కువ మంది భారతీయ ఆటగాళ్లు అలా ఉంటారు. వారిలో అతనొకడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి సీనియర్ ప్లేయర్లు ఇక మీదట ఎక్కువ క్రికెట్ ఆడే అవకాశాలు కనిపించడం లేదు. అందుకే డ్రెస్సింగ్ రూమ్‌లోకి అగ్రెషన్, ఫైర్‌ను తీసుకొచ్చే గంభీర్‌కు కోచింగ్ బాధ్యతలు అప్పగించారు. గౌతీ లాంటి వాళ్ల అవసరం వరల్డ్ క్రికెట్‌కు ఎంతో ఉంది. భారత జట్టుకే కాదు, ఇతర టీమ్స్‌ను కూడా అగ్రెసివ్‌గా ముందుండి నడిపించే వాళ్ల ఆవశ్యకత ఉంది. అలాంటి వాళ్లు మరింత కసితో ఆడతారు. గ్రౌండ్లో గంభీర్ అగ్రెసివ్‌గా కనిపించినా.. బయట అతడో జెంటిల్మన్. అతడో స్మార్ట్ క్రికెటర్. అతడి బుర్ర భలేగా పని చేస్తుంది. క్రికెట్‌ను అవపోసన పట్టిన వారిలో గంభీర్ ఒకడు. ఈ విధంగా చూసుకుంటే టీమిండియాకు అతడి లాంటి కోచ్ దొరకడం నిజంగా అదృష్టమే’ అని స్టెయిన్ చెప్పుకొచ్చాడు. మరి.. గంభీర్‌లోని అగ్రెషన్‌ను చూసే అతడ్ని కోచ్‌గా తీసుకున్నారంటూ స్టెయిన్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.
Dale Steyn, Kallis and Shahid Afridi talking about Gautam Gambhir. 🌟pic.twitter.com/RM76dBysFC
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 11, 2024