iDreamPost
android-app
ios-app

Brian Lara: నా ‘400’ రికార్డును ఆ ఇద్దరు టీమిండియా కుర్రాళ్లే బద్దలు కొట్టగలరు: లారా

  • Published Jul 11, 2024 | 5:52 PM Updated Updated Jul 11, 2024 | 5:52 PM

వెస్టిండీస్ దిగ్గజం బ్రియానా లారా సుదీర్ఘ కెరీర్​లో ఎన్నో అరుదైన ఘనతలు సాధించాడు. బ్రేక్ చేయలేని చాలా రికార్డులు క్రియేట్ చేశాడు. అతడి అన్​బ్రేకబుల్ రికార్డ్స్​లో ‘400’ ఒకటి.

వెస్టిండీస్ దిగ్గజం బ్రియానా లారా సుదీర్ఘ కెరీర్​లో ఎన్నో అరుదైన ఘనతలు సాధించాడు. బ్రేక్ చేయలేని చాలా రికార్డులు క్రియేట్ చేశాడు. అతడి అన్​బ్రేకబుల్ రికార్డ్స్​లో ‘400’ ఒకటి.

  • Published Jul 11, 2024 | 5:52 PMUpdated Jul 11, 2024 | 5:52 PM
Brian Lara: నా ‘400’ రికార్డును ఆ ఇద్దరు టీమిండియా కుర్రాళ్లే బద్దలు కొట్టగలరు: లారా

బ్రియాన్ లారా.. ఈ పేరు తెలియని క్రికెట్ లవర్ ఉండరంటే అతిశయోక్తి కాదు. క్లాస్ బ్యాటింగ్​తో కోట్లాది మంది అభిమానాన్ని సంపాదించుకున్నాడతను. ఒకప్పుడు తిరుగులేని విధంగా క్రికెట్​ను ఏలిన వెస్టిండీస్ 90వ దశకం చివరి నుంచి బలహీనంగా మారుతూ వచ్చింది. అప్పటి నుంచి కొన్నేళ్ల పాటు విండీస్​కు లారానే దిక్కయ్యాడు. టీమ్ మొత్తం పెవిలియన్​కు చేరినా అతడు మాత్రం ఒకవైపు ఒంటరిగా పోరాడుతూ ఉండేవాడు. అద్భుతమైన బ్యాటింగ్​తో ఎన్నో మ్యాచుల్లో టీమ్​ను ఓటమి నుంచి గట్టున పడేశాడు. లారాను ఔట్ చేసేవరకు కరీబియన్ టీమ్​ను ఆపలేమని ఇతర జట్లకు తెలుసు. అందుకే అతడి కోసం రకరకాల ప్లాన్స్​తో వచ్చేవి. అయితే అతడు మాత్రం సొగసైన షాట్లు, కళాత్మక డ్రైవ్​లతో ప్రత్యర్థి ఎత్తుగడను చిత్తు చేసేవాడు. కెరీర్​లో ఎన్నో అరుదైన ఘనతలు అందుకున్నాడు లారా.

లారా కెరీర్​లో ఎన్నో రేర్ రికార్డ్స్​ ఉన్నాయి. అయితే టెస్టుల్లో బాదిన 400 మాత్రం ఇప్పటికీ చెక్కుచెదరలేదు. లాంగ్ ఫార్మాట్​లో ట్రిపుల్ సెంచరీ కొట్టడమే పెద్ద ఘనతగా చెప్పుకునే టైమ్​లో ఏకంగా నాలుగొందలు బాదేశాడు లారా. ఇంగ్లండ్​తో 2004లో జరిగిన టెస్టులో ఈ అద్భుతం జరిగింది. అయితే ఇన్నేళ్లలో ఏ ఒక్క ప్లేయర్ కూడా దీనికి దరిదాపుల్లోకి రాలేకపోయాడు. ఇప్పటి తరం బ్యాటర్లు టీ20లు, వన్డేల్లో వీరబాదుడు బాదుతున్నా బ్యాటింగ్​కు అసలు సిసలు పరీక్ష లాంటి టెస్టుల్లో ఆ లెవల్​లో అటాకింగ్​ అప్రోచ్​తో వెళ్లలేకపోతున్నారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి దిగ్గజాలు కూడా ఈ రికార్డ్​ను టచ్ చేయలేకపోయారు. అయితే ప్రస్తుత భారత జట్టులోని ఇద్దరు యంగ్​స్టర్స్ తన రికార్డ్​ను బ్రేక్ చేయగలరని అంటున్నాడు లారా.

టీమిండియా యంగ్ బ్యాటర్స్ శుబ్​మన్ గిల్, యశస్వి జైస్వాల్​కు టెస్టుల్లో ఒకే ఇన్నింగ్స్​లో 400 పరుగుల మార్క్​ను చేరుకునే సత్తా ఉందన్నాడు లారా. వాళ్లిద్దరే తన రికార్డును బద్దలు కొట్టగలరని నమ్మకంగా చెప్పాడు. గిల్-జైస్వాల్ క్రీజులో కుదురుకుంటే ఇలాంటి చాలా రికార్డులకు పాతర వేయగలరన్నాడు లారా. తాను క్రికెట్ ఆడే టైమ్​లో వీరేంద్ర సెహ్వాగ్, క్రిస్ గేల్, ఇంజమామ్ ఉల్ హక్, సనత్ జయసూర్య లాంటి కొందరు ప్లేయర్లు క్వాట్రపుల్ సెంచరీ మార్క్​ను దాటేందుకు తెగ ప్రయత్నించారన్నాడు. అయితే అలాంటి దూకుడైన ఆటగాళ్లు ఇప్పుడు పెద్దగా లేరని పేర్కొన్నాడు. ఇంగ్లండ్ టీమ్​లో జాక్ క్రాలే, హ్యారీ బ్రూక్ అగ్రెసివ్​గా ఆడుతున్నారని మెచ్చుకున్నాడు. మరి.. లారా 400 రికార్డును జైస్వాల్, గిల్​ బ్రేక్ చేయగలరని మీరు భావిస్తే కామెంట్ చేయండి.