iDreamPost

Sachin Tendulkar: రోహిత్ కాదు.. ఆ ఇద్దరి వల్లే టీమిండియా గెలిచింది! సచిన్ షాకింగ్ కామెంట్స్..

ఆస్ట్రేలియాపై టీమిండియా విజయానికి కారణం రోహిత్ సూపర్ ఇన్నింగ్స్ కాదని.. ఆ ఇద్దరి వల్లే భారత్ విజయం సాధించిందని ట్విట్టర్ వేదికగా చెప్పుకొచ్చాడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్. మరి ఆ ఇద్దరు ఆటగాళ్లు ఎవరు?

ఆస్ట్రేలియాపై టీమిండియా విజయానికి కారణం రోహిత్ సూపర్ ఇన్నింగ్స్ కాదని.. ఆ ఇద్దరి వల్లే భారత్ విజయం సాధించిందని ట్విట్టర్ వేదికగా చెప్పుకొచ్చాడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్. మరి ఆ ఇద్దరు ఆటగాళ్లు ఎవరు?

Sachin Tendulkar: రోహిత్ కాదు.. ఆ ఇద్దరి వల్లే టీమిండియా గెలిచింది! సచిన్ షాకింగ్ కామెంట్స్..

టీ20 వరల్డ్ కప్ లో వరుస విజయాలతో సెమీస్ కు దూసుకెళ్లింది టీమిండియా. సెయింట్ లూసియా వేదికగా సోమవారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో 24 పరుగుల తేడాతో అద్భుతమైన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో కెప్టెన్ రోహిత్ శర్మ 92 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అయితే ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన రోహిత్ శర్మ వల్ల మ్యాచ్ గెలవలేదని, ఆ ఇద్దరి వల్లే టీమిండియా గెలిచింది షాకింగ్ కామెంట్స్ చేశాడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్. సచిన్ చెప్పిన ఆ ఇద్దరు ఎవరంటే?

ఆస్ట్రేలియాపై 24 పరుగు తేడాతో విజయం సాధించిన టీమిండియా.. దర్జాగా సెమీస్ కు దూసుకెళ్లింది. ఇక సెమీ ఫైనల్లో పటిష్టమైన ఇంగ్లండ్ తో తలపడనుంది భారత్. ఇదిలా ఉండగా.. ఆస్ట్రేలియాపై విజయం సాధించడంలో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన కెప్టెన్ రోహిత్ శర్మదే కీలక పాత్ర అని, అతడి వల్లే మ్యాచ్ గెలిచిందని అందరూ అంటున్నారు. అయితే ఈ విషయంలో కాస్త భిన్నంగా స్పందించాడు దిగ్గజ బ్యాటర్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్. ట్విట్టర్ వేదికగా ఈ మ్యాచ్ పై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. అందులో భాగంగా ఆ ఇద్దరి వల్లే టీమిండియా  విజయం సాధించిందని చెప్పుకొచ్చాడు.

సచిన్ టెండుల్కర్ ట్విట్టర్ లో ఈ విధంగా రాసుకొచ్చాడు..”అద్భుతమైన విజయం సాధించిన టీమిండియాకు ముందుగా కంగ్రాచ్యూలేషన్స్. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో టీమిండియా విజయానికి రెండు మూమెంట్స్ కారణం అయ్యాయి. అందులో ఒకటి బౌండరీలైన్ దగ్గర అక్షర్ పటేల్ పట్టిన అద్భుతమైన క్యాచ్. ఇంకోటి ట్రావిస్ హెడ్ ను బుమ్రా పెవిలియన్ కు పంపడం. ఈ రెండు టీమిండియాను గెలిపించాయి. సెమీ ఫైనల్ చూడటానికి నేను ఎంతో ఆత్రుతగా ఉన్నాను” అని మాస్టర్ బ్లాస్టర్ పేర్కొన్నాడు. అయితే ఈ ట్వీట్ లో సూపర్బ్ నాక్ ఆడిన రోహిత్ పేరును ప్రస్తావించకపోవడం గమనార్హం.

ట్రావిస్ హెడ్-మిచెల్ మార్ష్ ఇద్దరు 48 బంతుల్లో 81 పరుగుల పార్ట్ నర్ షిప్ నెలకొల్పి.. మ్యాచ్ ను తమ అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో భారీ షాట్ కు ప్రయత్నించాడు. బంతి సిక్సర్ వెళ్తుందని  అందరూ అనుకున్నారు. కానీ బౌండరీలైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న అక్షర్ పటేల్ గాల్లోకి ఎగిరి అద్బుతమైన క్యాచ్ అందుకున్నాడు. ఇక ప్రమాదకరంగా మారుతున్న ట్రావిస్ హెడ్ ను బుమ్రా బోల్తా కొట్టించాడు. ఈ రెండు సంఘటనలే మ్యాచ్ ను టీమిండియా వైపు తిప్పాయి. మరి టీమిండియా విజయానికి బుమ్రా, అక్షర్ పటేల్ కారణమన్న సచిన్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి