Somesekhar
భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ కు రజత పతకం ఇవ్వాలని టీమిండియా దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ డిమాండ్ చేశాడు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ చేశాడు.
భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ కు రజత పతకం ఇవ్వాలని టీమిండియా దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ డిమాండ్ చేశాడు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ చేశాడు.
Somesekhar
పారిస్ ఒలింపిక్స్ 2024లో అద్భుతమైన ప్రదర్శనతో రెజ్లింగ్ లో ఫైనల్ కు దూసుకెళ్లిన వినేశ్ ఫొగాట్ కు ఊహించని షాక్ తగిలిన విషయం తెలిసిందే. కేవలం 100 గ్రాముల బరువు ఎక్కువ ఉందన్న ఒకే ఒక కారణంతో ఫొగాట్ పై అనర్హత వేటు వేశారు ఒలింపిక్స్ నిర్వాహకులు. దాంతో భారత్ కు గోల్డ్ మెడల్ వచ్చే ఛాన్స్ చేజారింది. ఇక ఈ విషయంపై ఇప్పటికే ఆమెకు చాలా మంది సెలబ్రిటీలు అండగా నిలిచారు. తాజాగా టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ సైతం ఆమెకు అండగా నిలుస్తూ.. రజత పతకం ఇవ్వాలని డిమాండ్ చేశాడు.
వినేశ్ ఫొగాట్.. భారత్ కు కచ్చితంగా ఈ ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ తెస్తుందని అందరు భావించారు. అందుకు తగ్గట్లుగానే వరుస విజయాలతో ఫైనల్ కు దూసుకెళ్లింది. కానీ అనూహ్యంగా 100 గ్రాముల బరువు ఎక్కువ ఉన్న కారణంగా అనర్హతకు గురైంది. దాంతో పతకం కల చెదిరింది. ఈ సంఘటనతో తన రెజ్లింగ్ కెరీర్ కు వినేశ్ ఫొగాట్ రిటైర్మెంట్ సైతం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. ఆమెకు రజతం ఇవ్వాలని డిమాండ్ చేశాడు టీమిండియా దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండుల్కర్. ఇందుకు సంబంధించి ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ చేశాడు.
“ఈ ఒలింపిక్స్ లో వినేశ్ ఫొగాట్ అద్భుతమైన ఆటతీరుతో ఫైనల్ కు చేరుకుంది. అయితే.. అధిక బరువు కారణంగా ఆమె అనర్హత వేటుకు గురైంది. ఆటలో నిబంధనలు ఉంటాయి, కానీ వాటిని సందర్భాన్ని బట్టి చూడాలి, లేదా సవరించాలి. అంతే తప్ప ఇలా చేయకూడదు. డోప్ టెస్ట్ లో దొరికితే చివరి స్థానం ఇవ్వడం కరెక్టే. కానీ వినేశ్ అద్భుతంగా ఆడి ఫైనల్ కు చేరుకుంది. ఆమె రజత పతకానికి అర్హురాలే. కోర్ట్ ఆఫ్ ఆర్బిటేషన్(సీఏఎస్) తీర్పు తర్వాత అయినా.. వినేశ్ కు రజతం వస్తుందని ఆశిస్తున్నాను” అంటూ ట్విట్టర్ వేదికగా సచిన్ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది.
#VineshPhogat #Paris2024 #Olympics @WeAreTeamIndia pic.twitter.com/LKL4mFlLQq
— Sachin Tendulkar (@sachin_rt) August 9, 2024