iDreamPost
android-app
ios-app

శుబ్ మన్ గిల్ కు సచిన్ స్పెషల్ బర్త్ డే విషెస్! పోస్ట్ వైరల్..

  • Author Soma Sekhar Published - 09:32 PM, Fri - 8 September 23
  • Author Soma Sekhar Published - 09:32 PM, Fri - 8 September 23
శుబ్ మన్ గిల్ కు సచిన్ స్పెషల్ బర్త్ డే విషెస్! పోస్ట్ వైరల్..

టీమిండియా యువ ఓపెనర్ శుబ్ మన్ గిల్ తన 24వ పుట్టినరోజు(సెప్టెంబర్ 8) జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా అతడికి సహచర ఆటగాళ్ల నుంచి అభిమానుల నుంచి నెటిజన్స్ నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే శుబ్ మన్ గిల్ ను ప్రత్యేకంగా విష్ చేశాడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్. దీంతో ఈ పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షించింది. సచిన్ కూతురు సారా టెండుల్కర్ తో ప్రేమలో ఉన్నట్లు గతంలో వార్తలు సైతం వచ్చాయి. ఇక వీరిద్దరు బ్రేకప్ కూడా చెప్పుకున్నారని న్యూస్ వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గిల్ కు సచిన్ బర్త్ డే విషెస్ చెప్పడం గమనార్హం.

టీమిండియా యువ సంచలనం శుబ్ మన్ గిల్ తన 24వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. అతి తక్కువ కాలంలోనే టీమిండియాలో మూడు ఫార్మాట్లలో తన స్థానాన్ని సుస్థిర పరచుకున్నాడు ఈ యువ బ్యాటర్. 2019లో టీమిండియా తరపున అరంగేట్రం చేసిన గిల్ ఆ మరుసటి ఏడాదే టెస్టుల్లో, టీ20ల్లో అడుగుపెట్టాడు గిల్. తనకు వచ్చిన అవకాశాల్ని అందిపుచ్చుకుంటూ.. టీమిండియాలో కీలక ప్లేయర్ గా మారాడు. కాగా.. తాజాగా బర్త్ డే జరుపుకుంటున్న గిల్ కు ఇతర ఆటగాళ్ల నుంచి ఫ్యాన్స్ నుంచి శుభాకాంక్షలు అందుతున్నాయి.

ఇక గిల్ ఫ్యాన్స్ గొప్ప మనసు చాటుకుంటూ.. రోడ్లపై ఆకలితో అలమటించే పిల్లలకు ఫుడ్ అందించారు. ఇదంతా ఒకెత్తు అయితే.. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ శుబ్ మన్ గిల్ కు ప్రత్యేకంగా బర్త్ డే విషెస్ చెప్పాడు.”హ్యాపియెస్ట్ బర్త్ డే శుబ్ మన్ గిల్. ఈ సంవత్సరం నువ్వు పరుగుల వర్షం కురిపించాలి. మరిన్ని గొప్ప ఇన్నింగ్స్ లను నువ్వు పోగుచేసుకోవాలి” అని సచిన్ గిల్ కు బర్త్ డే విషెస్ తెలిపాడు. సచిన్ తో పాటుగా రాబిన్ ఊతప్ప, అక్షర్ పటేల్ తో పాటు మరికొంతమంది గిల్ కు విషెస్ తెలిపారు. మరి గిల్ కు సచిన్ బర్త్ డే విషెస్ తెలుపడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişBetcioivermectin tabletJojobet girişJojobet girişJojobetmeritbetCasibom GirişmeritbetjojobetTophillbetJojobet GirişcasibomCasibom GirişMarsbahis GirişHoliganbetbetebetHoliganbetMarsbahis Girişmarsbahis