iDreamPost

మీ వల్లే ఓడిపోయాం అంటూ.. ఆసియా క్రికెట్ కౌన్సిల్ పై కేసు వేసిన ఆఫ్ఘానిస్థాన్!

  • Author Soma Sekhar Published - 08:05 PM, Fri - 8 September 23
  • Author Soma Sekhar Published - 08:05 PM, Fri - 8 September 23
మీ వల్లే ఓడిపోయాం అంటూ.. ఆసియా క్రికెట్ కౌన్సిల్ పై కేసు వేసిన ఆఫ్ఘానిస్థాన్!

ఆసియా కప్ 2023లో ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ ల్లో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ ఏదైనా ఉంది అంటే.. అది శ్రీలంక-ఆఫ్ఘానిస్థాన్ మధ్య జరిగిన ఆఖరి గ్రూప్ మ్యాచ్ అనే చెప్పాలి. చివరి వరకు నరాలు తెగే ఉత్కంఠతతో సాగిన ఈ మ్యాచ్ లో 2 పరుగుల స్వల్ప తేడాతో ఆఫ్ఘాన్ ఓడిపోయింది. ఇక తమ ఓటమికి కారణం ఆసియా క్రికెట్ కౌన్సిల్ లో ఉన్న అధికారులే అంటూ వారిపై కేసు వేసింది ఆఫ్ఘానిస్థాన్ క్రికెట్ బోర్డ్. మా ఓటమికి కారణం అయిన అధికారులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. మరి ఏసీసీ అధికారులపై ఆఫ్ఘాన్ కేసు పెట్టడానికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆసియా క్రికెట్ కౌన్సిల్ పై కేసు వేసింది ఆఫ్ఘానిస్థాన్ క్రికెట్ బోర్డ్. ఆసియా కప్ గూప్ దశలో ఆఖరి మ్యాచ్ ఓడిపోవడానికి మీరే కారణం అంటూ ఏసీసీ అధికారులపై కేసు వేసింది. ఏసీసీ అధికారులు సరైన సమాచారం ఇవ్వకుండా చేసిన పొరపాటు వల్లే తాము ఓడిపోయామని, మా ఓటమికి కారణం అయిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది ఆఫ్ఘాన్ క్రికెట్ బోర్డ్. ఇంతకీ అసలు విషయం ఏంటంటే? ఏసీసీ అధికారులు క్వాలిఫైకేషన్ గణాంకాల గురించి సరైన సమాచారం ఇవ్వలేదట. ఇక ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 291 పరుగులు చేసింది.

అనంతరం ఈ లక్ష్యాన్ని 37.1 ఓవర్లలో ఛేదించి ఉంటే ఆఫ్ఘాన్ సూపర్ 4కు అర్హత సాధించి ఉండేది. లక్ష్యాన్ని ఛేదించేందుకు చివరి వరకు గట్టిగానే ప్రయత్నించింది ఆఫ్గాన్ జట్టు. చివరికి 2 పరుగుల తేడాతో ఓడిపోయింది. అసలు విషయం ఏంటంటే? 37 ఓవర్లలో 289 పరుగులు చేసిన ఆఫ్ఘాన్, ఆ నెక్ట్స్ బంతికి 3 రన్స్ లేదా అది మిస్ అయితే.. 37.2 ఓవర్లకు 293 రన్స్, 37.3 ఓవర్లకు 294 పరుగులు ఇది కూడా మిస్ అయితే 38.1 ఓవర్లకు 297 పరుగులు చేసినా ఆఫ్ఘాన్ సూపర్ 4 దశకు చేరుకునేది. అయితే ఈ విషయం తెలియకపోవడంతో.. సిక్సర్ కొట్టాలనే తొందరలో రెండు వికెట్లను కోల్పోయి.. 2 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో మాకు సరైన సమాచారం ఇవ్వలేదని ఏసీసీ అధికారులపై కేసు వేసింది ఆఫ్ఘాన్ క్రికెట్ బోర్డ్. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి