iDreamPost
android-app
ios-app

రోహిత్‌ను ముంబై కెప్టెన్‌గా తప్పించడానికి కారణం సచిన్‌! వెలుగులో​కి..

  • Published Mar 18, 2024 | 4:53 PM Updated Updated Mar 18, 2024 | 4:53 PM

Sachin Tendulkar, Rohit Sharma: ఐపీఎల్‌ 2024 సీజన్‌ ఆరంభానికి ముందు ఓ సంచలన విషయం బయటికి వచ్చింది. రోహిత్‌ శర్మ కెప్టెన్సీ పోవడానికి కారణం సచిన్‌ టెండూల్కర్‌ అంటూ ఆరోపణలు వస్తున్నాయి. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..

Sachin Tendulkar, Rohit Sharma: ఐపీఎల్‌ 2024 సీజన్‌ ఆరంభానికి ముందు ఓ సంచలన విషయం బయటికి వచ్చింది. రోహిత్‌ శర్మ కెప్టెన్సీ పోవడానికి కారణం సచిన్‌ టెండూల్కర్‌ అంటూ ఆరోపణలు వస్తున్నాయి. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..

  • Published Mar 18, 2024 | 4:53 PMUpdated Mar 18, 2024 | 4:53 PM
రోహిత్‌ను ముంబై కెప్టెన్‌గా తప్పించడానికి కారణం సచిన్‌! వెలుగులో​కి..

ఐపీఎల్‌ 2024 ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. ఈ నెల 22 నుంచి ఈ మెగా టోర్నీ షురూ కానుంది. విరాట్‌ కోహ్లీ, ధోని, రోహిత్‌ శర్మ లాంటి స్టార్‌ ఆటగాళ్లతో ఐపీఎల్‌ టోర్నీ కళకళలాడనుంది. అయితే.. ఈ మెగా టోర్నీ ఆరంభానికి ముందు ఓ బాంబు లాంటి విషయం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే.. ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా ఉన్న రోహిత్‌ శర్మను తప్పించడం వెనుక దిగ్గజ క్రికెటర్‌ సచిన్‌ టెండ్కూలర్‌ హస్తం ఉన్నట్లు టాక్‌ వినిపిస్తోంది. ఈ విషయంపై ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తీవ్ర ప్రకంపనలు వ్యాపిస్తున్నాయి.

ఐపీఎల్‌ 2023 సీజన్‌ వరకు ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా ఉన్న రోహిత్‌ శర్మ.. ఆ టీమ్‌ను అద్భుతంగా నడిపించాడు. రోహిత్‌ శర్మ కెప్టెన్సీలోనే ముంబై ఇండియన్స్‌ ఏకంగా ఐదు సార్లు ఐపీఎల్‌ ఛాంపియన్‌గా నిలిచింది. ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక ట్రోఫీలు సాధించిన జట్టుగా ముంబై ఇండియన్స్‌ ఉంది. ఆ రికార్డును 2023లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ టీమ్‌ సమం చేసింది. అయితే.. ముంబైని ఒక తిరుగులేని శక్తిగా మార్చిన రోహిత్‌ శర్మను ఉన్నపళ​ంగా కెప్టెన్సీని నుంచి పీకేసింది ముంబై మేనేజ్‌మెంట్‌.

రోహిత్‌ను తప్పించి.. అతని స్థానంలో డబ్బుల కోసం ముంబైని వీడి.. మళ్లీ డబ్బుల కోసమే ముంబైలోకి వచ్చిన హార్ధిక్‌ పాండ్యాకు కెప్టెన్సీని అప్పగించింది. రోహిత్‌ను కెప్టెన్‌గా తొలగించడమే బాధ అంటే.. పాండ్యాకు ఆ బాధ్యతలు అప్పగించడం ఫ్యాన్స్‌ కోపాన్ని రెట్టింపు చేసింది. ఈ విషయంపై రోహిత్‌ కూడా ముంబై కోపంగా ఉన్నాడు. ఈ ఏడాది ఐపీఎల్‌ ఆడటం లేదని కూడా చెప్పి మళ్లీ పోస్ట్‌ను డిలీట్‌ చేశాడు రోహిత్‌. ఇలాంటి టైమ్‌లో రోహిత్‌ను కెప్టెన్సీ నుంచి తీసేయడానికి సచిన్‌ కారణం అనే విషయం ఒకటి బయటికి వచ్చింది. ఇందులో వాస్తవం ఎంతో? అసలు రోహిత్‌ను కెప్టెన్‌గా తప్పించాల్సిన అవసరం సచిన్‌ ఏముందనే విషయాలపై ఎలాంటి క్లారిటీ లేదు. అయితే.. సచిన్‌ గతంలో ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా, ఇప్పుడు మెంటర్‌గా ఉన్న విషయం తెలిసిందే. మరి రోహిత్‌ కెప్టెన్సీ పోవడం వెనుక సచిన్‌ హస్తం ఉందని వస్తున్న ఆరోపణలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.