తన ఆరోగ్యానికి సంబంధించి వీడియో రిలీజ్ చేసిన వినోద్ కాంబ్లీ!

Vinod Kambli: మాజీ క్రికెటర్, సచిన్ టెండూల్కర్ చిన్ననాటి స్నేహితుడు వినోద్ కాంబ్లీ 100 కంటే ఎక్కువ వన్డేలు, 17 టెస్ట్ మ్యాచ్ లు ఆడారు. ఈ మధ్యనే కాంబ్లీకి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయ్యింది.

Vinod Kambli: మాజీ క్రికెటర్, సచిన్ టెండూల్కర్ చిన్ననాటి స్నేహితుడు వినోద్ కాంబ్లీ 100 కంటే ఎక్కువ వన్డేలు, 17 టెస్ట్ మ్యాచ్ లు ఆడారు. ఈ మధ్యనే కాంబ్లీకి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయ్యింది.

ఒకప్పుడు క్రికెట్ స్టేడియంలో తన బ్యాటింగ్ ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టింన స్టార్ బ్యాట్స్‌మెన్ పరిస్థితి విషమంగా ఉందంటూ ఓ వీడియో నెట్టింట తెగ వైరల్ అయ్యింది. ఆ వీడియోలో వినోద్ కాంబ్లీ సరిగ్గా నిల్చోలేని పరిస్థితిలో ఓ బైక్ ఆసరా తీసుకున్నాడు. నడవలేని స్థితిలో ఉండగా పక్కన ఉన్నవాళ్లు అతనికి సాయం అందించారు. 52 ఏళ్ల వయసు ఉన్న కాంబ్లీకి ఏమైంది..? ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ఆయనకు సాయం చేయాలంటూ బెస్ట్ ఫ్రెండ్ సచిన్, బీసీసీఐని కోరుతో పోస్టులు పెట్టారు క్రికెట్ అభిమానులు. తాజాగా ఈ పోస్టులపై స్పందించిన వినోద్ కాంబ్లే ఓ వీడియో రిలీజ్ చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

క్రికెట్ దేవుడు సచిన్ టెండుల్కర్ కి బెస్ట్ ఫ్రెండ్, మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ కి సంబంధించిన ఓ వీడియో అభిమానులను ఆవేదనకు గురి చేసిన విషయం తెలిసిందే. ఈ వీడియో చూసిన తోటి క్రీడాకారులు సైతం ఆశ్చర్యపోయినట్లు సమాచారం. ఒకప్పుడు క్రికెట్ మైదానంలో సచిన్, కాంబ్లీ ఆట చూసి అభిమానులు తెగ ఎంజాయ్ చేసేవారు. కొంత కాలానికే క్రికెట్ కి దూరమయ్యారు కాంబ్లీ. ఎప్పుడూ యాక్టీవ్ గా స్టైలిష్ గా ఉండే కాంబ్లీని అలాంటి పరిస్థితిలో చూడటం అందని హృదయాలు కలచి వేసింది. గతంలో ఆయన ఆరోగ్యం క్షీణించింది.. గుండెపోటుకు గుయ్యారు.

ఈ నేపథ్యంలోనే కాంబ్లీని ఆదుకోవాలని బీసీసీఐ, సచిన్, ఇతర క్రీకెట్ ఆటగాళ్లకు రిక్వెస్ట్ చేస్తూ వేలాది పోస్టులు పెట్టారు అభిమానులు. ఈ క్రమంలోనే కాంబ్లీ చిన్ననాటి స్నేహితులు రిక్కా, క్రికెట్ అంపైర్ మార్కస్ ఆయన ఇంటికి వెళ్లి మాట్లాడారు. ఈ సందర్భంగా వినోద్ కాంబ్లీకి చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అందులో కాంబ్లీ మాట్లాడుతూ. ‘దేవుడి దయతో నేను ఆరోగ్యంగా జీవించి ఉన్నాను. ఫీల్డ్ కి వెళ్లి బ్యాటింగ్ చేసేంత ఫిట్ గా ఉన్నాను’ అని తెలిపాడు. మార్కస్ మాట్లాడుతూ.. నేను బాగానే ఉన్నాను.. సోషల్ మీడియాలో వచ్చేవి నమ్మోద్దు అని కాంబ్లీ తనతో చెప్పాడని అన్నారు. కాంబ్లీ కుటుంబ సభ్యులు మాతో హ్యాపీగా గడిపారు అని మార్కస్ తెలిపారు.

Show comments