iDreamPost
android-app
ios-app

Ormax Sports Stars: ఇండియాలో ఈ ముగ్గురే తోపులు.. క్రేజ్ లో కొట్టేవాళ్లే లేరు!

  • Published Sep 25, 2024 | 1:46 PM Updated Updated Sep 26, 2024 | 6:30 PM

Most Popular Sports Persons in India, Ormax Media: ప్రముఖ మీడియా కంపెనీ అయిన 'ఓర్ మ్యాక్స్' మీడియా ఆగస్ట్ నెలకు సంబంధించి ఇండియాలో మోస్ట్ పాపులర్ స్పోర్ట్స్ పర్సన్స్ లిస్ట్ ను విడుదల చేసింది. ఆ లిస్ట్ ను ఇప్పుడు చూద్దాం.

Most Popular Sports Persons in India, Ormax Media: ప్రముఖ మీడియా కంపెనీ అయిన 'ఓర్ మ్యాక్స్' మీడియా ఆగస్ట్ నెలకు సంబంధించి ఇండియాలో మోస్ట్ పాపులర్ స్పోర్ట్స్ పర్సన్స్ లిస్ట్ ను విడుదల చేసింది. ఆ లిస్ట్ ను ఇప్పుడు చూద్దాం.

Ormax Sports Stars: ఇండియాలో ఈ ముగ్గురే తోపులు.. క్రేజ్ లో కొట్టేవాళ్లే లేరు!

భారత క్రీడారంగంలో వివిధ గేమ్స్ కు సంబంధించి ఎంతో మంది దిగ్గజ ఆటగాళ్లు ఉన్నారు. ఇక వారు తమ గేమ్ తో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టారు.. కొడుతూనే ఉన్నారు. అయితే దేశవ్యాప్తంగా చాలా మంది స్టార్ ప్లేయర్లు ఉన్నప్పటికీ.. ఓ ముగ్గురు మాత్రం తోపులుగా వెలుగొందుతున్నారు. తాజాగా ప్రముఖ మీడియా కంపెనీ అయిన ‘ఓర్ మ్యాక్స్’ మీడియా ఆగస్ట్ నెలకు సంబంధించి ఇండియాలో మోస్ట్ పాపులర్ స్పోర్ట్స్ పర్సన్స్ లిస్ట్ ను విడుదల చేసింది. ఈ లిస్ట్ లో అనూహ్యంగా దిగ్గజ ఫుట్ బాల్ ఆటగాళ్లు క్రిస్టియానో రోనాల్డోతో పాటుగా లియోనల్ మెస్సి కూడా చోటు దక్కించుకోవడం విశేషం. ఇక ఈ లిస్ట్ లో ఇంకెవరెవరు చోటు దక్కించుకున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రముఖ ఓర్ మ్యాక్స్ మీడియా ప్రతి నెలల వివిధ రంగాలకు చెందిన మోస్ట్ పాపులర్ వ్యక్తులకు సంబంధించిన లిస్ట్ ను విడుదల చేస్తూ ఉంటుంది. అందులో భాగంగానే ఆగస్ట్ నెలకు సంబంధించి ఇండియాలో మోస్ట్ పాపులర్ స్పోర్ట్స్ పర్సన్స్ లిస్ట్ ను విడుదల చేసింది. ఈ లిస్ట్ లో టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో నిలిచాడు. దాంతో మరోసారి తన తన ఫాలోయింగ్, రేంజ్ ఏంటో ఈ ప్రపంచానికి తెలియజెప్పాడు. ఇక సెకండ్ ప్లేస్ లో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని ఉన్నాడు. తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ మూడో స్థానంలో నిలిచాడు. ఇక ఈ లిస్ట్ లో నాలుగో ప్లేస్ లో ఫుట్ బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డ్ ఉండటం విశేషం. ఆ తర్వాత సచిన్ టెండుల్కర్, లియోనల్ మెస్సీ, నీరజ్ చోప్రా, సునీల్ చైత్రీ, పీవీ సింధూ, హార్దిక్ పాండ్యా టాప్ 10లో నిలిచారు.

3 players are more important

కాగా.. టీమిండియా రన్ మెషిన్ కింగ్ విరాట్ కోహ్లీకి ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. ఇక ఇండియాలో అయితే ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అందుకే ఫాలోయింగ్ లో కోహ్లీని కొట్టేవాళ్లు లేరంటే అతిశయోక్తికాదు. ఇక ఇప్పుడు ఓర్ మ్యాక్స్ మీడియా ప్రకటించిన ఇండియాస్ మోస్ట్ పాపులర్ స్పోర్ట్స్ పర్సన్స్ లిస్ట్ లో కూడా విరాట్ సత్తా చాటాడు. ఈ లిస్ట్ లో క్రికెట్ గాడ్ సచిన్ టెండుల్కర్ 5వ స్థానంలో ఉండటం గమనార్హం. అలాగే మాస్టర్ బ్లాస్టర్ కంటే క్రిస్టియానో రోనాల్డో ఈ లిస్ట్ లో ముందుండటం విశేషం. మెస్సీకి సైతం ఇండియాలో పాపులారిటీ ఉందని మరోసారి రుజువైంది. మరి ఓర్ మ్యాక్స్ ప్రకటించిన ఈ లిస్ట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetTimebetMeritkingGrandpashabetcasibommeritbet girişjojobet girişjojobet girişdeneme bonusu veren sitelerMariobetMadridbetmadridbetmariobetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabetholiganbet