Nidhan
Sachin Tendulkar's 241 Runs Against Australia: ఫేవరెట్ షాట్ ఆడేందుకు బ్యాటర్లు తహతహలాడుతుంటారు. అలాంటి బాల్ వస్తే బాదేస్తారు. కానీ తనకు ఇష్టమైన షాట్ లేకుండా ఏకంగా 241 రన్స్ చేశాడు సచిన్ టెండూల్కర్.
Sachin Tendulkar's 241 Runs Against Australia: ఫేవరెట్ షాట్ ఆడేందుకు బ్యాటర్లు తహతహలాడుతుంటారు. అలాంటి బాల్ వస్తే బాదేస్తారు. కానీ తనకు ఇష్టమైన షాట్ లేకుండా ఏకంగా 241 రన్స్ చేశాడు సచిన్ టెండూల్కర్.
Nidhan
టెస్ట్ క్రికెట్‌ను కొందరు బోరింగ్ ఫార్మాట్‌గా చూస్తారు. రోజుల కొద్దీ జరిగే ఈ తరహా మ్యాచుల్ని ఎవరు చూస్తారులే అనుకుంటారు. కానీ క్రికెట్లోని అసలైన మజా వచ్చేది టెస్టుల నుంచే. ఆటగాళ్ల టెక్నిక్, పేషెన్స్, స్కిల్స్‌కు రియల్ టెస్ట్ పెడుతుందీ ఫార్మాట్. ఎందరో ప్లేయర్లు ఇదే ఫార్మాట్ ద్వారా లెజెండ్స్‌గా ఎదిగారు. అందులో బ్యాటింగ్ గ్రేట్ సచిన్ టెండూల్కర్ ఒకడు. వన్డేల్లో అద్భుతమైన ఆటతీరుతో వరల్డ్ క్రికెట్‌ను శాసించాడు సచిన్. అయితే అతడ్ని నంబర్ వన్ బ్యాటర్‌గా చేసింది, బ్యాటింగ్ గ్రేట్‌గా మార్చింది మాత్రం టెస్టులే. అలాంటి టెస్టుల్లో ఒక దశలో సచిన్ తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. ఫామ్ కోల్పోయి అన్ని వైపుల నుంచి విమర్శలు అందుకున్నాడు. సెంచరీల మోత మోగించే అతడి బ్యాట్ వరుసగా 13 ఇన్నింగ్స్‌ల పాటు మూగబోయింది. 19.4 యావరేజ్‌తో రన్స్ చేస్తూ బాగా స్ట్రగుల్ అయ్యాడు. కానీ పద్నాలుగో ఇన్నింగ్స్‌లో అదిరిపోయే రీతిలో కమ్‌బ్యాక్ ఇచ్చాడు లిటిల్ మాస్టర్.
సచిన్ కెరీర్లో ఎన్నో సూపర్బ్ నాక్స్ ఉన్నాయి. అయితే టాప్-3లో నిలిచే ఇన్నింగ్స్‌ల్లో ఇదొకటిగా చెప్పొచ్చు. ఇది ఆస్ట్రేలియా జట్టుపై 2004లో వచ్చింది. ఆ టీమ్‌తో జరిగిన నాలుగో టెస్టులో మాస్టర్ బ్లాస్టర్ చెలరేగి ఆడాడు. ఫోర్త్ డౌన్లో బ్యాటింగ్‌కు దిగిన అతడు.. 436 బంతుల్లో 241 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇందులో 33 బౌండరీలు ఉన్నాయి. సచిన్ కెరీర్లో ఎన్నో సెంచరీలు, డబుల్ సెంచరీలు ఉన్నాయి. ఈ నాక్‌లో అంత స్పెషాలిటీ ఏం ఉందని అనుకోవచ్చు. ఈ మ్యాచ్‌కు ముందు వరుసగా ఫెయిల్ అయ్యాడతను. సచిన్ పనైపోయిందని.. ఇక అతడ్ని టీమ్‌లో నుంచి తీసేయాల్సిన టైమ్ వచ్చిందని విమర్శకులు విరుచుకుపడ్డారు. ఈ టైమ్‌లో సూపర్బ్‌గా కమ్‌బ్యాక్ ఇచ్చాడు మాస్టర్ బ్లాస్టర్. తన బ్యాట్‌తోనే క్రిటిక్స్‌కు దిమ్మతిరిగేలా ఆన్సర్ ఇచ్చాడు. ఈ ఇన్నింగ్స్‌లో మెయిన్ హైలైట్ అంటే ఒక్క కవర్ డ్రైవ్ కూడా ఆడకపోవడమే.
స్ట్రయిట్ డ్రైవ్, కవర్ డ్రైవ్స్‌కు సచిన్ పెట్టింది పేరు. షోయబ్ అక్తర్, బ్రెట్‌లీ, మెక్‌గ్రాత్.. ఇలా ఎంత తోపు బౌలర్ బౌలింగ్ చేసినా ఆ రెండు షాట్లు అలవోకగా బాదేస్తాడు సచిన్. అలాంటోడు ఆస్ట్రేలియాతో టెస్ట్‌లో ఒక్క కవర్ డ్రైవ్ కూడా కొట్టలేదు. జేసన్ గిలెస్పీ, నాథన్ బ్రాకెన్, బ్రెట్‌లీ ఆఫ్ సైడ్ ఎంత ఊరించే బంతులు వేసినా అతడు ఆ షాట్ ఆడలేదు. ఆఫ్ స్టంప్‌కు బయట పడిన బంతుల్ని వదిలేస్తూ పోయాడు. స్ట్రయిట్ వికెట్, లెగ్ సైడ్ పడిన బంతులకే రన్స్ చేశాడు. ఆ సిరీస్‌లోని అంతకుముందు టెస్ట్‌ల్లో కవర్ డ్రైవ్స్ కొట్టబోయి వికెట్ పారేసుకున్నాడు సచిన్. దీంతో ఆ మ్యాచ్‌లోనూ అతడికి అవే తరహా బంతులు వేస్తూ టెంప్ట్ చేశారు కంగారూ బౌలర్లు. కానీ ఎలాగైనా భారీ ఇన్నింగ్స్ ఆడాలని మెంటల్‌గా ఫిక్స్ అయిన సచిన్ తన మాస్టర్‌క్లాస్ చూపించాడు. ఒక్కసారి ఫిక్స్ అయితే తన మాటే తానే వినను అన్నట్లు ఆడాడు. కవర్ డ్రైవ్ తనకు రాదు, మర్చిపోయాను అన్నట్లు బ్యాటింగ్ చేశాడు.
ఎత్తు తక్కువగా ఉండే సచిన్‌కు ఇతర బ్యాటర్లలా కవర్ డ్రైవ్ ఆడటం అంత ఈజీ కాదు. ఎందుకంటే ఈ షాట్ ఆడాలంటే లెగ్స్ స్ట్రెచ్ చేసి బాల్ బౌన్స్ అయ్యే టైమ్‌లో షాట్ ఆడాల్సి ఉంటుంది. అందుకే సచిన్ కవర్ డ్రైవ్స్ తక్కువగా ఆడేవాడు. తన బ్యాట్‌కు దగ్గర్లో పడి బౌన్స్ అయ్యే బంతుల్నే అతడు ఈ షాట్‌గా మలిచేవాడు. అలాగే ఆడే ప్రయత్నంలో మెల్బోర్న్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యాడు. హెడ్ పొజిషన్లో ఉన్న మిస్టేక్ కారణంగా షాట్‌ను సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయలేకపోయాడు. అందుకే సిడ్నీ టెస్ట్‌లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ షాట్ ఆడొద్దని డిసైడ్ అయ్యాడు. ఆసీస్ ఎంత రెచ్చగొట్టినా అదే పంతంతో ఆడాడు. ఏకంగా 436 బంతులు ఎదుర్కొన్నా సింగిల్ కవర్ డ్రైవ్ కొట్టలేదు. 16 ఏళ్ల వయసు నుంచి ప్రొఫెషనల్ క్రికెట్ ఆడుతున్న సచిన్.. కవర్ డ్రైవ్ ద్వారా ఎన్నో పరుగులు బాదాడు. ఆఫ్ సైడ్ బాల్ పడితే ఆ షాట్ కొట్టడం అతడికి అలవాటు. కానీ సిడ్నీ టెస్ట్‌లో మాత్రం ఆ షాట్ కావాలనే ఆడలేదు.
అప్పటికే సచిన్ స్టార్ బ్యాటర్‌గా ఉన్నాడు. దాదాపుగా లెజెండ్ స్థాయికి చేరుకున్నాడు. అతడు కొత్తగా ప్రూవ్ చేయడానికి ఏమీ లేదు. కానీ అపోజిషన్ టీమ్ మీద పైచేయి సాధించడానికి, టీమిండియాను గెలిపించేందుకు తనను తాను మార్చుకున్నాడు. రెగ్యులర్ షాట్‌ను పక్కనబెట్టి డిఫరెంట్ స్టైల్ క్రికెట్ ఆడాడు. ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్ వస్తే వదిలేస్తూ పోయాడు. మారథాన్ ఇన్నింగ్స్ ఆడిన సచిన్.. ఇన్నింగ్స్ ఆసాంతం లెగ్ సైడ్ షాట్సే ఆడాడు. ఆఫ్ సైడ్ ఊరించే బంతుల మాయలో పడి చాలా మంది బ్యాటర్లు వికెట్లు పారేసుకుంటారు. కానీ ఆ వీక్నెస్ అధిగమించడం ఎలా? టెస్ట్ క్రికెట్లో బాల్స్‌ను వదిలేయడం ఎంత ముఖ్యం అనేది ఈ ఇన్నింగ్స్‌తో సచిన్ నేర్పించాడు. సిడ్నీ ఇన్నింగ్స్ అతడ్ని లివింగ్ లెజెండ్‌గా మార్చేసింది. అతడి కెరీర్‌తో పాటు టెస్ట్ క్రికెట్లో ఎప్పటికీ గుర్తుండిపోయే నాక్స్లో ఒకటిగా ఫ్యాన్స్ గుండెల్లో స్పెషల్‌గా నిలిచిపోయింది.