టీమిండియా యువ ఓపెనర్ శుబ్ మన్ గిల్ అనారోగ్యం కారణంగా ఆసీస్ తో జరిగిన తొలి మ్యాచ్ కు దూరం అయ్యాడు. అయితే అతడి ఆరోగ్యం మరింతగా క్షీణించి.. రక్తకణాలు పడిపోవడంతో అతడిని ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం అతడు చెన్నైలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అతడు పూర్తిగా కోలుకునే సరికి మరికొన్ని రోజుల సమయం పడుతుందని తెలుస్తోంది. దీంతో అతడి స్థానంలో ఇద్దరు యువ ఆటగాళ్లలో ఒకరిని జట్టులోకి తీసుకునేందుకు మేనేజ్ మెంట్ ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి గిల్ స్థానం కోసం పోటీ పడే ఆ ఇద్దరు యంగ్ ప్లేయర్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.
శుబ్ మన్ గిల్.. వన్డే వరల్డ్ కప్ 2023లో టాప్ స్కోరర్ గా నిలుస్తాడని దిగ్గజాలు ముక్త కఠంతో చెప్పారు. కానీ ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండా అతడు వరల్డ్ కప్ కు దూరమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. దానికి కారణం అతడు కొద్ది రోజులుగా డెంగ్యూతో బాధపడటమే. ప్రస్తుతం అతడికి రక్తకణాలు స్వల్పంగా తగ్గిట్లు తెలుస్తోంది. రక్తకణాల సంఖ్య పెరిగి, అతడు పూర్తి ఫిట్ నెస్ సాధించిన తర్వాతే జట్టులోకి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ పరిణామం టీమిండియాకు పెద్ద ఎదురుదెబ్బనే చెప్పాలి. అయితే గిల్ స్థానంలో బరిలోకి దిగిన ఇషాన్ కిషన్ ఆసీస్ తో మ్యాచ్ లో డకౌట్ గా వెనుదిరిగిన విషయం తెలిసిందే. దీంతో గిల్ స్థానంలో బ్యాకప్ కోసం ఇద్దరు టీమిండియా యువ ఆటగాళ్ల పేర్లను పరిశీలిస్తోందట టీమిండియా మేనేజ్ మెంట్.
ఈ క్రమంలోనే ఏషియన్ గేమ్స్ లో గోల్డ్ మెడల్ సాధించిన భారత జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించిన రుతురాజ్ గైక్వాడ్ పేరుతో పాటుగా.. యువ సంచలనం యశస్వీ జైస్వాల్ పేరును గిల్ కు బ్యాకప్ కోసం పరిశీలిస్తున్నారట. గైక్వాడ్, యశస్వీ జైస్వాల్ లు గత కొంతకాలంగా మంచి ఫామ్ లో ఉన్నారు. వీరిని గిల్ కు కవరప్ గా తీసుకుంటే బాగుంటుందన్నది క్రీడా విశ్లేషకుల అభిప్రాయం. అయితే వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీల్లో యువ ఆటగాళ్లు ఒత్తిడిని తట్టుకుని ఎంత మేరకు నిలబడతారు అన్నదే ఇక్కడ అసలు సమస్య. కాగా.. గిల్ త్వరగా కోలుకోవాలని టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్ ప్రార్థిస్తున్నారు. మరి గిల్ కు బ్యాకప్ గా రుతురాజ్, జైస్వాల్ లో ఎవరు బెస్ట్? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Ruturaj Gaikwad or Yashasvi Jaiswal could be called as a cover up of Shubman Gill if team management decides to call for a backup. (Indian Express). pic.twitter.com/yfhtgUwx7a
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 10, 2023