SNP
Rohit Sharma, NBA Trophy, Larry O'Brien Trophy: టీ20 వరల్డ్ కప్ టోర్నీ ప్రారంభానికి కంటే ముందే ఒక పెద్ద కప్పుతో రోహిత్ శర్మ ఫొటోలు దిగాడు. అది టీ20 వరల్డ్ కప్ కూడా కాదు. మరి ఆ కప్ ఏంటి దాని కథేంటి ఇప్పుడు తెలుసుకుందాం..
Rohit Sharma, NBA Trophy, Larry O'Brien Trophy: టీ20 వరల్డ్ కప్ టోర్నీ ప్రారంభానికి కంటే ముందే ఒక పెద్ద కప్పుతో రోహిత్ శర్మ ఫొటోలు దిగాడు. అది టీ20 వరల్డ్ కప్ కూడా కాదు. మరి ఆ కప్ ఏంటి దాని కథేంటి ఇప్పుడు తెలుసుకుందాం..
SNP
ప్రస్తుతం రోహిత్ శర్మ టీ20 వరల్డ్ కప్ బిజీలో ఉన్నాడు. అలాగే ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ అంతా రోహిత్ శర్మ టీ20 వరల్డ్ కప్ ఎత్తితే చూడాలని ఆశగా ఎదురుచూస్తున్నారు. రోహిత్ కచ్చితంగా టీ20 కప్పు ఎత్తుతాడని బలంగా నమ్ముతున్నారు. కానీ, వరల్డ్ కప్ ఇంకా ఆరంభం కాకుండానే ఓ భారీ కప్పును ఎత్తాడు రోహిత్ శర్మ. టీ20 వరల్డ్ కప్ 2024లో భాగంగా శనివారం బంగ్లాదేశ్‌తో వామప్ మ్యాచ్ సందర్భంగా ఓ పెద్ద కప్పుతో ఫొటోలకు ఫోజులు ఇచ్చాడు. ఆ కప్ ఏంటి? రోహిత్ శర్మ ఎందుకు అందుకున్నాడు? ఇలాంటి ప్రశ్నలు క్రికెట్ అభిమానులను వేధిస్తున్నాయి. వాటికి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం..
న్యూయార్క్‌లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో శనివారం బంగ్లాదేశ్‌తో తమ వార్మప్ మ్యాచ్ సందర్భంగా రోహిత్ శర్మ టీ20 వరల్డ్ కప్ ట్రోఫీతో ఫొటోలకు ఫోజులు ఇచ్చేందుకు వచ్చాడు. ఇదే సమయంలో మరో భారీ ట్రోఫీని కూడా అందుకున్నాడు. అది ఎన్‌బీఏ(నేషనల్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్) ట్రోఫీ. దీన్నే లారీ ఓబ్రెయిన్ ట్రోఫీ అని కూడా పిలుస్తారు. ఎన్‌బీఏ ఫైనల్స్ ట్రోఫీతో రోహిత్ ఫొటోలు దిగి.. బాస్కెట్‌బాల్ గురించి మాట్లాడాడు. ఎన్‌బీఏ ఫైనల్స్‌కి ముందు ప్రచారంలో భాగంగా ఇది రోహిత్ శర్మ చేతికి అందించారు.
ఈ సందర్భంగా రోహిత్ మాట్లాడుతూ.. ‘మైఖేల్ జోర్డాన్ నాకు ఇష్టమైన ఆటగాడు. అతను చికాగో బుల్స్ కోసం చేసింది స్పష్టంగా స్ఫూర్తిదాయకం. అలాగు లెబ్రాన్ జేమ్స్, స్టెఫ్ కర్రీ ఆట చూసేందుకు కూడా ఇష్టపడతాను.’ అని రోహిత్ అన్నాడు. అయితే.. ఎన్‌బిఎ ట్రోఫీని ఎత్తుకుని.. ‘ఓహ్, ఇది చాలా భారీగా కనిపిస్తోంది. వారు(బాస్కెట్‌బాల్ ఆటగాళ్ళు) చాలా పొడవు, బలంగా ఉండటంలో ఆశ్చర్యం లేదు’ అని సరదాగా అన్నాడు. బంగ్లాదేశ్‌తో ఏకైక వామప్ మ్యాచ్ తర్వాత టీమిండియా జూన్ 5న ఐర్లాండ్‌తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. అలాగే జూన్ 9న పాకిస్థాన్‌తో నసావు గ్రౌండ్‌లోనే మ్యాచ్ ఆడనుంది టీమిండియా. ఈ మ్యాచ్‌ల కోసం సంసిద్ధంగా ఉన్నట్లు కూడా రోహిత్ వెల్లడించాడు. మరి బాస్కెల్ బాల్ ఛాంపియన్స్‌కు అందించినే ఎన్‌బీఏ ట్రోనీతో రోహిత్ ఫొటోలకు ఫోజులు ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Captain Rohit Sharma holding the NBA Finals Trophy and posing with the T20 World Cup Trophy. 🥶🇮🇳 pic.twitter.com/R3cX1YENg8
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 31, 2024