SNP
Rohit Sharma, IND vs BAN, Virat Kohli: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సూపర్ క్యాచ్‌తో ఆకట్టుకున్నాడు. ఆ క్యాచ్ చూసి.. విరాట్ కోహ్లీ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్ హైలెట్‌గా నిలిచింది. దాని గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
Rohit Sharma, IND vs BAN, Virat Kohli: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సూపర్ క్యాచ్‌తో ఆకట్టుకున్నాడు. ఆ క్యాచ్ చూసి.. విరాట్ కోహ్లీ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్ హైలెట్‌గా నిలిచింది. దాని గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
SNP
క్యాచ్ పట్టడం కాదు.. దాన్ని స్టైల్‌గా పడితే ఆ మజానే వేరు. అలాంటి స్టైలిష్ క్యాచ్‌ను సింగిల్ హ్యాండ్‌తో పట్టేశాడు హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ. రోహిత్ అంటే భారీ భారీ సిక్సులే కాదు.. ఇలాంటి కళ్లు చెదిరే క్యాచ్‌లు కూడా ఉంటాయని చూపించాడు. కాన్పూర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఈ సూపర్ క్యాచ్‌ను అందుకున్నాడు రోహిత్ శర్మ. బంగ్లాతో రెండో టెస్ట్‌కు వరుణుడు అడ్డుపడటంతో మ్యాచ్ తొలి రోజు కొద్ది సేపే జరిగింది. కేవలం 35 ఓవర్ల ఆట సాగింది. రెండు, మూడో రోజు మాత్రం ఆట సాగలేదు. ఎట్టకేలకు వర్షం ఆగిపోవడంతో.. నాలుగో రోజు ఆట మొదలైంది.
తొలి రోజు 3 వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసి.. మళ్లి నాలుగో రోజు ఆట ఆరంభించిన బంగ్లా బ్యాటర్లు టీమిండియా బౌలర్లకు గట్టి పోటీనే ఇచ్చారు. మోమినుల్ అయితే ఏకంగా సెంచరీతో చెలరేగాడు. కానీ, లిట్టన్ దాస్ మాత్రం.. మొహమ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో ఓ పవర్‌ఫుల్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. సిరాజ్ వేసిన ఇన్నింగ్స్ 50వ ఓవర్ నాఉలగో బంతికి దాస్ కవర్స్‌లోకి దూసుకెళ్లేలా షాట్ ఆడాడు. కానీ, టీమిండియా రోహిత్ శర్మ అద్భుతంగా గాల్లోకి కరెక్ట్ టైమ్‌లో జంప్ చేసి.. సింగిల్ హ్యాండ్‌తోనే అద్భుతంగా క్యాచ్ అందుకున్నాడు. ఆ క్యాచ్ చూసి.. స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఇచ్చిన రియాక్షన్ ఇంకా హైలెట్‌గా మారింది.
బుల్లెట్‌లా దూసుకెళ్తున్న బంతిని గాల్లోకి సరైన టైమ్‌లో జంప్ చేసి.. ఒక్క చేత్తో రోహిత్ క్యాచ్ అందుకోవడం చూసి.. కోహ్లీ నమ్మలేకపోయాడు. బౌలర్ సిరాజ్ సైతం షాక్‌లో నోరెళ్లబెట్టేశాడు. క్యాచ్ పట్టుకున్న తర్వాత రోహిత్ శర్మ చేసుకున్న సెలబ్రేషన్స్ కూడా అభిమానులను ఆకట్టుకున్నాయి. బాల్‌ను అలాగే పైకెత్తి పట్టుకొని.. రోహిత్ గ్రౌండ్‌లో పరుగుతీశాడు. మొత్తంగా.. ఇది ఒక సూపర్ మ్యాచ్ క్యాచ్‌గా చెప్పుకోవచ్చు. అంత మంచి షాట్ ఆడి తాను అలా ఎలా అవుట్ అయ్యానా అని లిట్టన్ దాస్ అయితే షాక్ అయిపోయాడు. అలానే రోహిత్‌ను చూస్తూ ఉండిపోయాడు. ఇక చేసేదేం లేక.. రోహిత్ సూపర్ క్యాచ్‌ను సైలెంట్‌గా అప్రిషీయేట్ చేస్తూ.. పెవిలియన్‌కు వెళ్లిపోయాడు. ఈ మ్యాచ్‌లో ఎలాగో రిజల్ట్ వచ్చే ఛాన్స్ లేకపోవడంతో.. ఈ క్యాచ్ ఈ మ్యాచ్‌కు హైలెట్ అంటూ క్రికెట్ అభిమానులు పేర్కొంటున్నారు. మరి రోహిత్ పట్టుకున్న సూపర్ క్యాచ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
A STUNNER FROM CAPTAIN ROHIT SHARMA 🫡
– Hitman leading by example….!!! pic.twitter.com/EUkA8J9WnU
— Johns. (@CricCrazyJohns) September 30, 2024