SNP
Rohit Sharma, Musheer Khan, Cricket News: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన గొప్ప మనసు చాటుకున్నాడు. తాజాగా ప్రమాదంలో గాయపడిన ఓ యువ క్రికెటర్‌ను అతని ఇంటికి వెళ్లి పరామర్శించాడు. దాని గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం..
Rohit Sharma, Musheer Khan, Cricket News: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన గొప్ప మనసు చాటుకున్నాడు. తాజాగా ప్రమాదంలో గాయపడిన ఓ యువ క్రికెటర్‌ను అతని ఇంటికి వెళ్లి పరామర్శించాడు. దాని గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం..
SNP
రోహిత్ శర్మ.. ఈ పేరు వినగానే చాలా మందికి ఫియర్‌లెస్ బ్యాటింగ్, స్మార్ట్ కెప్టెన్సీ, టీ20 వరల్డ్ కప్ విక్టరీ గుర్తుకు వస్తాయి. విరాట్ కోహ్లీ తర్వాత.. భారత జట్టు కెప్టెన్సీ పగ్గాలు అందుకొని టీమ్‌ను నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లాడు. రోహిత్‌ను ఒక కెప్టెన్‌గా, అంతకంటే ఒక మనిషిగా తోటి క్రికెటర్లు చాలా ఇష్టపడతారు. టీమిండియా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ సైతం.. రోహిత్ ఒక గొప్ప హ్యూమన్ బీయింగ్ అని కొనియాడాడు. రోహిత్ లాంటి మంచి వ్యక్తితో కలిసి పనిచేయడం తన అదృష్టంగా చెప్పుకొచ్చాడు. ద్రవిడ్ లాంటి ఒక దిగ్గజం రోహిత్ గురించి ఈ మాట అన్నాడంటే.. ఒక మనిషిగా రోహిత్ ఏ స్థాయిలో ఉన్నాడో, ఉంటాడో మనం అర్థం చేసుకోవచ్చు. తాజాగా రోహిత్ మంచి మనసుకు అద్ధం పట్టే సంఘటన ఒకటి జరిగింది.
సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలోని టీమిండియా బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్ ఆడుతుంటే.. టీ20లకు రిటైర్మెంట్ ఇచ్చిన రోహిత్.. న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే రోహిత్ తన మంచి మనసును చాటుకున్నాడు. టీమిండియా క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు ముషీర్ ఖాన్‌ను రోహిత్ పరామర్శించాడు. డొమెస్టిక్ క్రికెట్‌లో అద్భుతంగా ఆడుతూ.. ఫ్యూచర్ ఆఫ్ ఇండియన్ క్రికెట్‌గా కనిపిస్తున్న ముషీర్ ఖాన్.. ఇటీవలె రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఇరానీ కప్ ఆడేందుకు వెళ్తుండగా.. అతను ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో ముషీర్ తండ్రి నౌషద్ ఖాన్ కూడా ఉన్నారు. ఈ ప్రమాదంలో ముషీర్ మెడ భాగంలో ఫ్రాక్చర్ అయింది.
ఈ విషయం తెలుసుకున్న రోహిత్ శర్మ.. గురువారం ముంబైలోని ముషీర్ ఖాన్ ఇంటికి స్వయంగా వెళ్లి పరామర్శించాడు. నిజానికి ముషీర్ ఖాన్‌తో కలిసి రోహిత్ శర్మ ఆడలేదు. పైగా ఒకటే ఏజ్ గ్రూప్ కూడా కాదు. కానీ, తనకు తెలిసిన మనిషి కావడంతో.. స్వయంగా ఇంటికి వెళ్లి మరీ మంచి చెడ్డా అడిగి తెలుసుకున్నాడు. ఈ ఘటనతో.. రోహిత్ హోదాలు, స్థాయిలు చూడని వ్యక్తి అని మరోసారి నిరూపితమైంది. అతని మంచి మనసు ప్రపంచానికి మరోసారి తెలిసొచ్చింది. ముషీర్ ఖాన్.. ఇప్పుడప్పుడే టీమిండియాలోకి వచ్చే అవకాశం కూడా లేదు, టీమిండియా వన్డే, టెస్ట్ కెప్టెన్‌గా ఉన్న రోహిత్ శర్మ ముందు.. ఛాంపియన్స్ ట్రోఫీ 2025, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025 కప్పులు సాధించాలనే లక్ష్యాలు ఉన్నాయి. ఈ రెండు టోర్నీలు ఆడే జట్టులో ముషీర్‌కి చోటు లేదు. అయినా కూడా రోహిత్ వెళ్లి అతన్ని పరామర్శించాడు.
తన టీమ్‌లోని ప్లేయర్ ఇలా ప్రమాదానికి గురైతే వెళ్లి పరామర్శిస్తే.. సరే కలిసి ఆడే ప్లేయర్, రాబోయే టోర్నీల్లో కీ ప్లేయర్ అని వెళ్లి కలిశాడు అనుకోవచ్చు. కానీ, ముషీర్ ఖాన్ విషయంలో రోహిత్ అలాంటి అవసరాలు ఏం లేవు. జస్ట్.. తెలిసిన ఒక టాలెంట్ కుర్రాడికి ఇలా అయిందే పాపం అని వెళ్లి మాట్లాడాడు. ఇలా వెళ్లి మాట్లాడం వల్ల రోహిత్‌కి వచ్చిందేం లేదు పోయేదేం లేదు. కానీ, ముషీర్ ఖాన్‌కు ఎంత బూస్ట్‌ప్ ఇస్తుందో కదా. టీమిండియా కెప్టెన్, దిగ్గజ క్రికెటర్.. తనను చూసేందుకు తన ఇంటికి వచ్చి, తన యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నాడంటూ.. ముషీర్‌లో అది ఎంత ఉత్సాహం, పాజిటివ్ ఎనర్జీని నింపుతుందో కదా. ఇలా రోహిత్ శర్మ.. తనకు తెలియకుండానే తన మంచి మనసుతో యంగ్ టాలెంట్‌కు అండగా ఉంటాడు. నిజంగా రోహిత్‌కి ఉన్న ఈ సంస్కారానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Rohit Sharma met Musheer Khan to check on him. 👌❤️
– Captain looking after youngsters! pic.twitter.com/TIq4NGFT9a
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 10, 2024