iDreamPost

Rohit Sharma: నా కెరీర్ లో నన్ను భయపెట్టిన బౌలర్ అతడే: రోహిత్ శర్మ

తన కెరీర్ లో తాను ఎదుర్కొన్న బౌలర్ అత్యంత కఠినమైన బౌలర్ అతడే అంటూ ఓ దిగ్గజ ప్లేయర్ పేరు చెప్పుకొచ్చాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. మరి రోహిత్ ను భయపెట్టిన ఆ బౌలర్ ఎవరు? తెలుసుకుందాం పదండి.

తన కెరీర్ లో తాను ఎదుర్కొన్న బౌలర్ అత్యంత కఠినమైన బౌలర్ అతడే అంటూ ఓ దిగ్గజ ప్లేయర్ పేరు చెప్పుకొచ్చాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. మరి రోహిత్ ను భయపెట్టిన ఆ బౌలర్ ఎవరు? తెలుసుకుందాం పదండి.

Rohit Sharma: నా కెరీర్ లో నన్ను భయపెట్టిన బౌలర్ అతడే: రోహిత్ శర్మ

రోహిత్ శర్మ.. ప్రపంచ క్రికెట్ లో అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడు. దిగ్గజ బౌలర్లు సైతం అతడికి బౌలింగ్  చేయాలంటే ఒకపక్క వణుకుతారు. అలాంటి రోహిత్ శర్మను ఓ బౌలర్ భయపెట్టాడు అంటే మీరు నమ్ముతారా? ఈ విషయం ఎవరో చెప్పలేదు. స్వయంగా రోహిత్ శర్మే చెప్పుకొచ్చాడు. మరి రోహిత్ లాంటి స్టార్ ప్లేయర్ ను భయపెట్టిన ఆ బౌలర్ ఎవరు? తెలుసుకుందాం పదండి.

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రస్తుతం ఐపీఎల్ లో పూర్ ఫామ్ ను కొనసాగించాడు. దాంతో టీ20 వరల్డ్ కప్ ముందర రోహిత్ ఫామ్ పై అభిమానులు ఆందోళన పడుతున్నారు. ఈ నేపథ్యంలో దుబాయ్ ఐ 103.8 ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. రోహిత్ మాట్లాడుతూ..” ఇప్పటి వరకు నా క్రికెట్ కెరీర్ లో నన్ను భయపెట్టిన ఏకైక బౌలర్ సౌతాఫ్రికా దిగ్గజం డేల్ స్టెయిన్. అతడి బౌలింగ్ ఓ అద్భుతం, అతడో లెజెండ్. స్టెయిన్ బంతిని స్వింగ్ చేసే తీరు అమోఘం. దిగ్గజ బ్యాటర్లు సైతం అతడి బౌలింగ్ లో ఆడటానికి భయపడతారు” అంటూ సౌతాఫ్రికా దిగ్గజంపై ప్రశంసలు కురిపించాడు.

కాగా.. ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ కథ ముగియడంతో.. మిగతా ప్లేయర్ల కంటే ముందుగానే వరల్డ్ కప్ జట్టులో ఉన్న ముంబై ప్లేయర్లతో కలిసి అమెరికా చేరుకోనున్నాడు. ఈ ఐపీఎల్ సీజన్ లో పూర్ ఫామ్ ను కొనసాగించిన రోహిత్.. 13 మ్యాచ్ ల్లో 349 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ కూడా ఉంది. అయితే ఆ శతకం మినహ, మిగతా మ్యాచ్ ల్లో పెద్దగా ప్రభావం చూపించలేకపోయాడు. దాంతో ముంబై ఇండియన్స్ ఈ సీజన్ లో ఇంటిదారి పట్టడానికి హిట్ మ్యాన్ కూడా ఓ కారణంగా నిలిచాడు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి