iDreamPost

T20 World Cup 2024: టీమిండియాకు ఊహించని షాకిచ్చిన ICC! పాక్ తో మ్యాచ్ కు ఇబ్బందేనా?

టీమిండియాకు ఊహించని షాకిచ్చింది ఐసీసీ. దాంతో పాక్ తో జరిగే కీలక పోరుకు ఇబ్బందులు తప్పేలా లేవన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

టీమిండియాకు ఊహించని షాకిచ్చింది ఐసీసీ. దాంతో పాక్ తో జరిగే కీలక పోరుకు ఇబ్బందులు తప్పేలా లేవన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

T20 World Cup 2024: టీమిండియాకు ఊహించని షాకిచ్చిన ICC! పాక్ తో మ్యాచ్ కు ఇబ్బందేనా?

మరికొన్ని రోజుల్లో టీ20 వరల్డ్ కప్ 2024 మెగా సమరం ప్రారంభం కానుంది. ఇందుకోసం ఐసీసీ ఇప్పటికే ఏర్పాట్లను పూర్తి చేసే పనిలో పడింది. 20 జట్లు పాల్గొనే ఈ పొట్టి సమరంలో టీమిండియా హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగబోతోంది. ఇక తన తొలి మ్యాచ్ ను జూన్ 5న ఐర్లాండ్ తో న్యూయార్క్ వేదికగా ఆడనుంది. అయితే ఈ మ్యాచ్ కు ముందు భారత జట్టు జూన్ 1న బంగ్లాదేశ్ తో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఈ క్రమంలోనే టీమిండియాకు ఊహించని షాకిచ్చింది ఐసీసీ. దాంతో పాక్ తో జరిగే కీలక పోరుకు ఇబ్బందులు తప్పేలా లేవన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరి ఐసీసీ టీమిండియాకు ఇచ్చిన షాక్ ఏంటి? పూర్తి వివరాల్లోకి వెళితే..

టీ20 వరల్డ్ కప్ ప్రారంభానికంటే ముందే టీమిండియాకు ఊహించని షాకిచ్చింది ఐసీసీ. ఈ మెగాటోర్నీలో భాగంగా భారత జట్టు జూన్ 5న న్యూయార్క్ వేదికగా ఐర్లాండ్ తో తలపడనుంది. అయితే ఈ మ్యాచ్ కు ముందు ఓ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఈ ప్రాక్టీస్ మ్యాచ్ ను న్యూయార్క్ గ్రౌండ్ లో ఆడాలని టీమిండియా భావించింది. అందుకోసం బీసీసీఐ తన అభ్యర్థనను ఐసీసీకి తెలిపింది. కానీ బీసీసీఐ అభ్యర్థనను ఐసీసీ, వెస్టిండీస్ క్రికెట్ బోర్డు తిరస్కరించినట్లు తెలుస్తోంది. న్యూయర్క్ లో కాకుండా.. ఫ్లోరిడాలో ప్రాక్టీస్ మ్యాచ్ ఏర్పాటు చేసింది.

అయితే ఇక్కడ టీమిండియాకు వచ్చిన ఇబ్బంది ఏంటి? అని మీరు అనుకోవచ్చు. ఇక్కడే భారత్ కు ఓ సమస్య ఉంది. వరల్డ్ కప్ లో భాగంగా భారత్ ఆడే తొలి నాలుగు మ్యాచ్ ల్లో 3 న్యూయార్క్ గ్రౌండ్ లోనే ఆడాలి. అందులో కీలకమైన పాకిస్తాన్ తో మ్యాచ్ కూడా ఉంది. దీంతో ప్రాక్టీస్ మ్యాచ్ ఇదే గ్రౌండ్ లో ఆడితే.. పిచ్ స్వభావం తెలుస్తుందన్నది టీమిండియా ఆలోచన. అందుకే వార్మప్ మ్యాచ్ ను అక్కడ ఆడతామని ఐసీసీకి నివేదించింది. కానీ ఈ అభ్యర్థనను తిరస్కరించడంతో.. టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది. మరి ప్రాక్టీస్ మ్యాచ్ న్యూయార్క్ లో జరక్కపోవడం టీమిండియాకు ఇబ్బందేనా? దాని ప్రభావం పాక్ మ్యాచ్ పై చూపిస్తుందా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి