iDreamPost
android-app
ios-app

Rohit Sharma: పాకిస్తాన్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ప్లేయర్లకు ఒకే ఒక్క మాట చెప్పాను: రోహిత్ శర్మ

  • Published Jun 10, 2024 | 8:03 AM Updated Updated Jun 10, 2024 | 8:03 AM

పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో.. పాక్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు తాను ఆటగాళ్లకు ఒకే ఒక్క మాట చెప్పానని, ఆ మాటతో వారు రెచ్చిపోయారని చెప్పుకొచ్చాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.

పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో.. పాక్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు తాను ఆటగాళ్లకు ఒకే ఒక్క మాట చెప్పానని, ఆ మాటతో వారు రెచ్చిపోయారని చెప్పుకొచ్చాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.

Rohit Sharma: పాకిస్తాన్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ప్లేయర్లకు ఒకే ఒక్క మాట చెప్పాను: రోహిత్ శర్మ

పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా చేసింది 119 పరుగులే. దాంతో అందరూ పాక్ గెలుస్తుందని అనుకున్నారు. కానీ అసాధ్యాలను సుసాధ్యం చేయడం భారత్ కు వెన్నతో పెట్టిన విద్య అని మనకు తెలియనిది కాదు. ఈ మ్యాచ్ లో కూడా అదే జరిగింది. 120 పరుగుల టార్గెట్ ను పాకిస్తాన్ ను ఛేదించకుండా నిలవరించడంతో భారత బౌలర్లు విజయవంతం అయ్యారు. అయితే ఒక దశలో పాక్ 12.2 ఓవర్లకు 73/3తో గెలిచే స్థితిలోనే కనిపించింది. అయితే ఇదే టైమ్ లో టీమిండియా ప్లేయర్లకు కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పిన ఒకే ఒక్క మాటతో ఆటగాళ్లు రెచ్చిపోయారు.

టీమిండియా నిర్దేశించిన 120 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన పాకిస్తాన్ 14. 1 ఓవర్లకు 80 పరుగులు చేసి 4 వికెట్లు కోల్పోయింది. పాక్ విజయానికి ఇంకా 20 పరుగులే కావాలి. పైగా బంతులు కూడా కావాల్సినన్ని ఉన్నాయి. దాంతో ఈ మ్యాచ్ లో భారత్ ఓడిపోతుందని అందరూ భావించారు. కానీ పాకిస్తాన్ ఇన్నింగ్స్ సగం పూర్తి అయిన తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆటగాళ్లతో ఒక మాట చెప్పాడు. ఆ మాట విన్న బౌలర్లు ఆ తర్వాత మరింతగా రెచ్చిపోయి కట్టుదిట్టంగా బౌలింగ్ వేశారు. ఇంతకీ రోహిత్ ప్లేయర్లతో ఏం చెప్పాడంటే?

పాకిస్తాన్ తో మ్యాచ్ గెలిచిన అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ..”పాకిస్తాన్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు.. మ్యాచ్ సగం ముగిశాక మేము ఆందోళనలో ఉన్నాం. అయితే ఈ సమయంలో నేను ఆటగాళ్లకు ఒకే ఒక్క మాట చెప్పాను. మనం ఆలౌట్ అయ్యాం.. వారు మాత్రం ఎందుకు కారు? వాళ్లు కూడా ఆలౌట్ అవుతారు గట్టి ప్రయత్నం చేద్దాం” అని చెప్పానని హిట్ మ్యాన్ తెలిపాడు. అయితే నిజానికి టీమిండియా బౌలర్లు ఆలౌట్ చేయలేదు కానీ.. కట్టుదిట్టమైన బంతులు వేసి.. పరుగుల వేగాన్ని పూర్తిగా తగ్గించేశారు. దాంతో పాక్ ప్లేయర్లపై ఒత్తిడి పెరిగింది.. మ్యాచ్ భారత్ వైపు తిరిగింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 19 ఓవర్లకు 119 రన్స్ కు ఆలౌట్ అయ్యింది. అనంతరం బ్యాటింగ్ చేసిన పాక్ పూర్తి ఓవర్లు ఆడి.. 7 వికెట్లకు 113 పరుగులు చేసింది. మరి ఒక్క మాటతో ప్లేయర్లలో జోష్ నింపి.. జట్టు విజయానికి కారణమైన రోహిత్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.