iDreamPost
android-app
ios-app

IND vs PAK: మ్యాచ్ గెలిచినా.. చెత్త రికార్డును నమోదు చేసిన టీమిండియా! చరిత్రలో తొలిసారి..

టీ20 వరల్డ్ కప్ లో భాగంగా పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో గెలిచినా.. ఓ చెత్త రికార్డును నమోదు చేసింది భారత జట్టు. ఆ వివరాల్లోకి వెళితే..

టీ20 వరల్డ్ కప్ లో భాగంగా పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో గెలిచినా.. ఓ చెత్త రికార్డును నమోదు చేసింది భారత జట్టు. ఆ వివరాల్లోకి వెళితే..

IND vs PAK: మ్యాచ్ గెలిచినా.. చెత్త రికార్డును నమోదు చేసిన టీమిండియా! చరిత్రలో తొలిసారి..

టీ20 వరల్డ్ కప్ 2024లో టీమిండియా తన రెండో విజయాన్ని నమోదు చేసింది. న్యూయార్క్ వేదికగా దాయాది పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో 6 పరుగుల తేడాతో సూపర్ విక్టరీ సాధించింది. చివరి ఓవర్ వరకు నరాలు తెగే ఉత్కంఠతతో సాగిన ఈ మ్యాచ్ ప్రేక్షకులకు మాంచి కిక్కిచ్చింది. స్వల్ప స్కోర్లు నమోదు అయిన ఈ పోరులో టీమిండియా ఓ చెత్త రికార్డును తన పేరిట లిఖించుకుంది. చరిత్రలో తొలిసారి ఈ వరస్ట్ రికార్డ్ ను క్రియేట్ చేసింది భారత్. ఆ వివరాల్లోకి వెళితే..

పాకిస్తాన్ తో జరిగిన కీలక మ్యాచ్ లో టీమిండియా 6 రన్స్ తేడాతో గెలిచిన విషయం తెలిసిందే. ఇక ఈ పోరులో టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమిండియాకు పాక్ బౌలర్లు చుక్కలు చూపించారు. వర్షం కారణంగా పిచ్ నుంచి అందుతున్న సహకారాన్ని పేసర్లు నసీమ్ షా(3 వికెట్లు), హారీస్ రౌఫ్(3), అమీర్(2) లు అద్భుతంగా ఉపయోగించుకున్నారు. దాంతో భారత్ 19 ఓవర్లకే 119 రన్స్ కు చాపచుట్టేసింది. రిషబ్ పంత్ ఒక్కడే 42 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. మిగతావారు దారుణంగా విఫలం అయ్యారు.

అనంతరం 120 పరుగుల స్వల్ప టార్గెట్ తో బరిలోకి దిగిన పాక్ కు టీమిండియా బౌలర్లు చుక్కలు చూపించారు. మరీ ముఖ్యంగా యార్కర్ల కింగ్ జస్ప్రీత్ బుమ్రా తన మార్క్ బౌలింగ్ తో పాక్ బ్యాటర్లను ఓ ఆటాడుకున్నాడు. దాంతో పాకిస్తాన్ ఓవర్లు మెుత్తం ఆడి.. 7 వికెట్లు నష్టపోయి 113 పరుగులకే పరిమితం అయ్యి.. 6 రన్స్ తేడాతో ఓడిపోయింది. పాక్ బ్యాటర్లలో మహ్మద్ రిజ్వాన్ 31 రన్స్ తో టాప్ స్కోరర్ గా నిలిచాడు. బుమ్రా తన 4 ఓవర్ల కోటాలో కేవలం 14 రన్స్ మాత్రమే ఇచ్చి 3 కీలక వికెట్లు తీశాడు. పాండ్యా రెండు వికెట్లు పడగొట్టాడు.

ఇదిలా ఉండగా.. ఈ మ్యాచ్ లో టీమిండియా ఆలౌట్ అవ్వడం ద్వారా టీ20ల్లో  ఓ చెత్త రికార్డును తన పేరిట లిఖించుకుంది. టీ20 ఫార్మాట్ లో పాకిస్తాన్ చేతిలో 10 వికెట్లు కోల్పోవడం ఇండియాకు ఇదే మెుదటిసారి. పాక్ తో ఆడిన 8 మ్యాచ్ ల్లో ఈ మ్యాచ్ లో మాత్రమే ఆలౌట్ అయ్యింది. దీంతో పాటుగా టీ20 వరల్డ్ కప్ లో ఇండియాకు ఇది నాలుగో అత్యల్ప స్కోర్ కావడం గమనార్హం. 2016లో 79 రన్స్, 2021లో 110/7 స్కోర్లను న్యూజిలాండ్ పై చేసింది. 2009లో సౌతాఫ్రికాపై 118/8 అత్యల్ప స్కోర్లను నమోదు చేసింది. మరి ఈ మ్యాచ్ లో గెలిచినా.. టీమిండియా చెత్త రికార్డును నమోదు చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి