iDreamPost
android-app
ios-app

Rohit Sharma: MI కెప్టెన్ గా తొలగించడంపై తొలిసారి నోరు విప్పిన రోహిత్! ఏమన్నాడంటే?

ముంబై కెప్టెన్సీ నుంచి తీసివేయడంపై తొలిసారి స్పందించాడు హిట్ మ్యాన్. ఎంఐ కెప్టెన్ గా తొలగించడంపై రోహిత్ ఏమన్నాడంటే?

ముంబై కెప్టెన్సీ నుంచి తీసివేయడంపై తొలిసారి స్పందించాడు హిట్ మ్యాన్. ఎంఐ కెప్టెన్ గా తొలగించడంపై రోహిత్ ఏమన్నాడంటే?

Rohit Sharma: MI కెప్టెన్ గా తొలగించడంపై తొలిసారి నోరు విప్పిన రోహిత్! ఏమన్నాడంటే?

T20 వరల్డ్ కప్.. ప్రస్తుతం టీమిండియా ముందున్న టార్గెట్ ఇదే. ఇందుకోసం కొన్ని నెలల నుంచే యువ ఆటాగాళ్లపై ప్రయోగాలు చేస్తూ వస్తోంది. ఇక తాజాగా ఈ మెగాటోర్నీ కోసం టీమిండియా తన స్క్వాడ్ ను ప్రకటించింది. ఈ క్రమంలోనే టీమిండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ తో కలిసి ప్రెస్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. ఈ సందర్భంగా ముంబై కెప్టెన్సీ నుంచి తీసివేయడంపై తొలిసారి స్పందించాడు హిట్ మ్యాన్. ఎంఐ కెప్టెన్ గా తొలగించడంపై రోహిత్ ఏమన్నాడంటే?

ఐపీఎల్ 2024 సీజన్ కోసం ముంబై ఇండియన్స్ భారీ మార్పులే చేసింది. అందులో ఒకటి కెప్టెన్ గా ఐదు టైటిళ్లు అందించిన రోహిత్ శర్మను తీసేసి.. క్యాష్ ఆన్ ట్రేడ్ విధానంలో గుజరాత్ టైటాన్స్ నుంచి వచ్చి హార్దిక్ పాండ్యాకు పగ్గాలు అందించింది. ఈ విషయంపై రోహిత్, ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటి వరకు రోహిత్ ముంబై కెప్టెన్ గా తొలగింపు విషయంపై నోరు విప్పలేదు. తాజాగా వరల్డ్ కప్ టీమ్ సెలెక్షన్స్ లో భాగంగా ఏర్పాటు చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ తో పాటుగా పాల్గొన్నాడు. ఈ సమావేశంలో తొలిసారి ఎంఐ కెప్టెన్ గా తొలగించడంపై, పాండ్యా సారథ్యంలో ఆడటంపై స్పందించాడు.

“మన జీవితంలో అన్నీ అనుకున్నట్లుగా జరగవు. లైఫ్ లో ఇలాంటివన్నీ సహజమే. ఇక పాండ్యా కెప్టెన్సీలో ఆడటంలో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. నేను కెప్టెన్ కాకముందు ఎంతో మంది నాయకత్వంలో ఆడాను. అలా ఆడటం నాకేమీ కొత్త కాదు.. ఇప్పుడు అందులో డిఫరెంట్ కూడా లేదు. ఇక ఈ ఐపీఎల్ సీజన్ లో జట్టుకు విజయాలు అందించడంతో పాటుగా భారీ ఓపెనింగ్స్ ఇవ్వాలని భావించాము. అందుకోసమే ప్రయత్నిస్తున్నాం. అయితే ఓపెనర్ గా వచ్చినప్పుడు దూకుడుగా ఆడాల్సి ఉంటుంది” అంటూ ఈ మీటింగ్ లో చెప్పుకొచ్చాడు. కాగా.. రోహిత్ ఈ సీజన్ లో ఇప్పటి వరకు 10 మ్యాచ్ ల్లో 314 పరుగులు సాధించాడు. ఇక ముంబై విషయానికి వస్తే.. 10 మ్యాచ్ ల్లో 3 విజయాలతో పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో కొనసాగుతోంది. మరి తొలిసారి కెప్టెన్సీ నుంచి తొలగించడంపై రోహిత్ స్పందించిన తీరు మీకేవిధంగా అనిపించింది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి