VIDEO: KL రాహుల్‌ ప్లేస్‌లో శార్ధుల్‌ ఠాకూర్‌! క్లారిటీ ఇచ్చిన రోహిత్‌ శర్మ

వన్డే వరల్డ్ కప్ జోరు కొనసాగుతోంది. నువ్వా నేనా అన్నట్లు జట్ల మధ్య హోరా హోరి పోరు జరుగుతోంది. అంచనాలను తారుమారు చేస్తూ సంచలన విజయాలు నమోదవుతున్నాయి. కాగా నిన్న జరిగిన భారత్, బంగ్లాదేశ్ మ్యాచ్ లో టీమిండియా అదరగొట్టింది.

వన్డే వరల్డ్ కప్ జోరు కొనసాగుతోంది. నువ్వా నేనా అన్నట్లు జట్ల మధ్య హోరా హోరి పోరు జరుగుతోంది. అంచనాలను తారుమారు చేస్తూ సంచలన విజయాలు నమోదవుతున్నాయి. కాగా నిన్న జరిగిన భారత్, బంగ్లాదేశ్ మ్యాచ్ లో టీమిండియా అదరగొట్టింది.

వన్డే వరల్డ్ కప్ జోరు కొనసాగుతోంది. నువ్వా నేనా అన్నట్లు జట్ల మధ్య హోరా హోరి పోరు జరుగుతోంది. అంచనాలను తారుమారు చేస్తూ సంచలన విజయాలు నమోదవుతున్నాయి. కాగా నిన్న జరిగిన భారత్, బంగ్లాదేశ్ మ్యాచ్ లో టీమిండియా అదరగొట్టింది. ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి వరల్డ్ కప్ లో నాలుగో విజయాన్ని అందుకుంది. అయితే ఈ మ్యాచ్ లో టీమిండియా ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చింది. కేఎల్ రాహుల్ స్థానంలో శార్థూల్ ను ఆడించేందుకు కెప్టెన్ రోహిత్ శర్మ నిర్ణయం తీసుకున్నాడు. కానీ చివరకు రాహులే బ్యాటింగ్ చేయాల్సి వచ్చిది. అయితే దీనిపై క్లారిటీ ఇచ్చాడు హిట్ మ్యాన్.

టీమిండియా జట్టులో కీలక ప్లేయర్ పేస్ బౌలర్ శార్ధూల్ ఠాకూర్ ఎక్స్ ట్రా బ్యాట్స్ మెన్ గా కొనసాగుతున్నాడు. అయితే వరల్డ్ కప్ లో శార్ధూల్ బ్యాటింగ్ చేయాలని టీమిండియా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ క్రమంలోనే నిన్న జరిగిన మ్యాచ్ లో శార్ధూల్ కు బ్యాటింగ్ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు రోహిత్. శ్రేయస్ అయ్యర్ ఔటైన తర్వాత శార్ధూల్ ను బ్యాటింగ్ కు వెళ్లాలని సూచించినట్లు డ్రెస్సింగ్ రూమ్ లో గిల్ అడిగిన సందర్భంగా రోహిత్ స్పష్టతనిచ్చాడు.

శ్రేయస్ ఔటైన అనంతరం రాహుల్ ను కాకుండా శార్దూల్ ను పంపాలని నిర్ణయించుకున్నట్లు హిట్ మ్యాన్ తెలిపాడు. ఈ లోగానే శ్రేయస్ ఔటై డగౌట్ కి చేరుకున్నాడు. అయితే అప్పటి వరకు శార్ధూల్ బ్యాటింగ్ కు వెళ్లేందుకు సిద్ధంగా లేడు. కానీ కేఎల్ రాహుల్ రెడీగా ఉన్నాడు. ఈ క్రమంలోనే శార్ధూల్ బ్యాటింగ్ ప్యాడ్స్, గ్లోవ్స్ వేసుకుని బ్యాటింగ్ కు వెళ్లేసరికి ఆలస్యమవుతదని భావించిన రోహిత్ రాహుల్ కే అవకాశం ఇచ్చాడు. ఈ కారణంగా శార్ధూల్ నిన్నటి మ్యాచ్ లో బ్యాటింగ్ చేసే అకాశం కోల్పోయాడు. ఈ నేపథ్యంలోనే రోహిత్ మాట్లాడుతూ.. శార్ధూల్ బిగ్ మ్యాచ్ ప్లేయర్ అంటూ ప్రశంసలతో ముంచెత్తాడు.

Show comments