iDreamPost
android-app
ios-app

Rishabh Pant: ప్లీజ్ సపోర్ట్ చేయండి.. అభిమానులకు రిషబ్ పంత్ రిక్వెస్ట్!

  • Published Jul 22, 2024 | 9:09 PM Updated Updated Jul 22, 2024 | 9:09 PM

టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఇప్పుడు ఫుల్ జోష్​లో ఉన్నాడు. టీ20 వరల్డ్ కప్ సెలబ్రేషన్స్​ పూర్తవడంతో భవిష్యత్ ప్రణాళికల్లో మునిగిపోయాడు.

టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఇప్పుడు ఫుల్ జోష్​లో ఉన్నాడు. టీ20 వరల్డ్ కప్ సెలబ్రేషన్స్​ పూర్తవడంతో భవిష్యత్ ప్రణాళికల్లో మునిగిపోయాడు.

  • Published Jul 22, 2024 | 9:09 PMUpdated Jul 22, 2024 | 9:09 PM
Rishabh Pant: ప్లీజ్ సపోర్ట్ చేయండి.. అభిమానులకు రిషబ్ పంత్ రిక్వెస్ట్!

టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఇప్పుడు ఫుల్ జోష్​లో ఉన్నాడు. టీ20 వరల్డ్ కప్ సెలబ్రేషన్స్​ పూర్తవడంతో భవిష్యత్ ప్రణాళికల్లో మునిగిపోయాడు. రోడ్డు ప్రమాదం కారణంగా రెండేళ్లు క్రికెట్​కు దూరమైన ఈ స్టార్ ప్లేయర్.. కమ్​బ్యాక్​లో అదరగొడుతున్నాడు. ఐపీఎల్-2024లో కీపర్​గా, బ్యాటర్​గా ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత జరిగిన పొట్టి ప్రపంచ కప్​లోనూ కీలక మ్యాచుల్లో సత్తా చాటాడు. భారత్ కప్పు గెలవడంలో తన వంతు పాత్ర పోషించిన పంత్.. మెగాటోర్నీ ముగించుకొని స్వదేశానికి వచ్చాడు. అనంతరం విక్టరీ సెలబ్రేషన్స్​లో పాల్గొన్నాడు. అలాగే అపర కుబేరుడు ముఖేశ్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ పెళ్లి వేడుకకూ హాజరయ్యాడు పంత్.

ఇప్పుడు శ్రీలంక సిరీస్​కు సన్నద్ధమవుతున్నాడు పంత్. వన్డేతో పాటు టీ20 జట్టుకు కూడా సెలెక్ట్ అయిన ఈ స్టైలిష్ ప్లేయర్ అదరగొట్టాలని ఫిక్స్ అయ్యాడు. వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ ఉన్న నేపథ్యంలో టీమ్​లో తన ప్లేస్ ఫిక్స్ చేసుకునేందుకు ఈ వన్డే సిరీస్​ను సద్వినియోగం చేసుకోవాలని చూస్తున్నాడు. హిట్టింగ్ ఎబిలిటీస్​తో పాటు డిఫెన్సివ్ అప్రోచ్​ను కూడా మరింత మెరుగుపర్చుకోవాలని చూస్తున్నాడు. కొత్త కోచ్ గంభీర్​ లెఫ్టాండర్ కాబట్టి అతడి బ్యాటింగ్ టెక్నిక్​లో మార్పులు వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే.. అభిమానులకు పంత్ స్పెషల్ రిక్వెస్ట్ చేశాడు. ప్లీజ్ సాయం చేయమని కోరాడు. అతడు కోరింది తన కోసం కాదు.. ప్యారిస్ ఒలింపిక్స్​కు వెళ్లే భారత ఆటగాళ్ల గురించి కావడం గమనార్హం.

పారిస్ ఒలింపిక్స్ కోసం భారత అథ్లెట్లు సిద్ధమవుతున్నారు. ఈసారి దేశానికి మరిన్ని మెడల్స్ అందించాలని తహతహలాడుతున్నారు. బోలెడన్ని బంగారు పతాకలు సాధించి దేశ ప్రతిష్టను మరింత పెంచాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఈ నేపథ్యంలో వారికి అండగా నిలవాలని, ఎంకరేజ్ చేయాలని కోరాడు పంత్. దేశం కోసం అహర్నిషలు శ్రమిస్తున్న అథ్లెట్లకు ప్రజలందరూ మద్దతుగా నిలవాలని, ఈ పోరాటంలో వారికి ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశాడు. అందరూ కలసికట్టుగా సపోర్ట్ చేయాలని.. అథ్లెట్లకు ఇది ఎంతో ధైర్యాన్ని ఇస్తుందన్నాడు. ఇక, పంత్ కంటే ముందు టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా ఒలింపిక్స్​కు వెళ్లే భారత ఆటగాళ్లకు మద్దతుగా నిలిచాడు. వాళ్ల కోసం అందరమూ ఒక్కటవుదామని, ఎంకరేజ్ చేయాలని పిలుపునిచ్చాడు.