Nidhan
టీమిండియా నయా హెడ్ కోచ్ గౌతం గంభీర్ సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్తున్నాడు. కోచ్‌గా ఇంకా ఒక్క సిరీస్ కూడా మొదలవక ముందే జట్టుపై తన మార్క్ చూపిస్తున్నాడు.
టీమిండియా నయా హెడ్ కోచ్ గౌతం గంభీర్ సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్తున్నాడు. కోచ్‌గా ఇంకా ఒక్క సిరీస్ కూడా మొదలవక ముందే జట్టుపై తన మార్క్ చూపిస్తున్నాడు.
Nidhan
టీమిండియా నయా హెడ్ కోచ్ గౌతం గంభీర్ సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్తున్నాడు. కోచ్‌గా ఇంకా ఒక్క సిరీస్ కూడా మొదలవక ముందే జట్టుపై తన మార్క్ చూపిస్తున్నాడు. వచ్చీ రాగానే టీ20 టీమ్ కెప్టెన్ పోస్ట్‌ను భర్తీ చేశాడు. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ పొట్టి ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పడంతో అతడి ప్లేస్‌లో సూర్యకుమార్ యాదవ్‌కు ఆ బాధ్యతలు అప్పగించారు. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాతో పోటీ నెలకొన్నా సూర్యకే ఆ పదవి దక్కింది. నిత్యం గాయాలతో సావాసం చేసే పాండ్యాను కాదని.. టీ20 స్పెషలిస్ట్‌గా ముద్రపడిన మిస్టర్ 360కి సారథ్య పగ్గాలు అప్పగించాడు గంభీర్. లంక సిరీస్‌కు వెళ్లే ముందు పలు ఇతర విషయాల మీద కూడా అతడు క్లారిటీ ఇచ్చాడు.
చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌తో కలసి ప్రెస్మీట్లో పాల్గొన్న గంభీర్ పలు విషయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఫిట్‌గా ఉంటే వన్డే వరల్డ్ కప్-2027 వరకు కంటిన్యూ అవుతారని చెప్పాడు. కోహ్లీతో తనకు మంచి అనుబంధం ఉందన్నాడు. స్పిన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను లంక సిరీస్‌కు ఎంపిక చేయనంత మాత్రాన అతడ్ని వన్డేల నుంచి పూర్తిగా పక్కనబెట్టినట్లు కాదన్నాడు. వన్డేలతో పాటు టెస్టుల్లో అతడు టీమ్‌కు ఎంతో ముఖ్యమైన ప్లేయర్ అని స్పష్టం చేశాడు గౌతీ. సూర్యను కేవలం టీ20లకే పరిమితం చేస్తున్నామని క్లారిటీ ఇచ్చాడు. ప్రెస్మీట్లో భారత క్రికెట్‌కు సంబంధించి ఎన్నో ఆసక్తికర విషయాలు చెప్పుకుంటూ వచ్చిన గంభీర్.. సీనియర్లకు కూడా ఇచ్చిపడేశాడు.
ఇక నుంచి డ్రెస్సింగ్ రూమ్‌లో సీనియర్ల డామినేషన్ కుదరదంటూ ఇన్‌డైరెక్ట్‌గా వార్నింగ్ ఇచ్చాడు గంభీర్. టీమ్ గేమ్స్ విషయంలో ప్రతి ఆటగాడికి పూర్తి స్వేచ్ఛను ఇవ్వాలనేది తన సిద్ధాంతమన్నాడు. ‘ప్రతి ప్లేయర్‌కు ఫ్రీడమ్ ఇవ్వాలి. ఇది ఎంతో ముఖ్యం. నేను దీన్ని ఎంతగానో నమ్ముతా. ఏ బంధమైనా నమ్మకం మీదే నిలబడుతుంది. నేను విషయాలను కాంప్లికేట్ చేయాలనుకోవడం లేదు. ఆటగాళ్లకు అండగా నిలవడం నా బాధ్యతగా భావిస్తా. డ్రెస్సింగ్ రూమ్ ఎప్పుడూ ఆహ్లాదంగా ఉండాలి. సక్సెస్ఫుల్ టీమ్ బాధ్యతలు నా మీద ఉన్నాయి’ అని గంభీర్ చెప్పుకొచ్చాడు. కాంప్లికేట్ చేయాలనుకోవడం లేదు, డ్రెస్సింగ్ రూమ్ హ్యాపీగా ఉండాలంటూ గౌతీ చేసిన వ్యాఖ్యలు నేరుగా సీనియర్లను టార్గెట్ చేసినవేనని సోషల్ మీడియాలో నెటిజన్స్ అంటున్నారు. ఈ ప్రెస్‌మీట్ ద్వారా ప్రతి ఆటగాడికి స్వేచ్ఛ ఉంటుందని.. కొందరు ఎక్కువ, ఇంకొందరు తక్కువ అనేది లేదని గంభీర్ చెప్పకనే చెప్పాడంటున్నారు. మరి.. సీనియర్ ఆటగాళ్లకు గౌతీ ఇన్‌డైరెక్ట్ వార్నింగ్ ఇవ్వడంపై మీ ఒపీనియన్‌ను కామెంట్ చేయండి.
Gambhir said “It is important to give players freedom – that is what I believe in – the best relationship is one build on trust – I don’t complicate things”. pic.twitter.com/KgTc6vBfwG
— Johns. (@CricCrazyJohns) July 22, 2024