Nidhan
Rishabh Pant Bowling In DPL: టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ కొత్త అవతారం ఎత్తాడు. ప్యాడ్లు పక్కనబెట్టి బాల్ చేతబట్టి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.
Rishabh Pant Bowling In DPL: టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ కొత్త అవతారం ఎత్తాడు. ప్యాడ్లు పక్కనబెట్టి బాల్ చేతబట్టి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.
Nidhan
టీమిండియా స్టార్ వికెట్ కీపర్, బ్యాటర్ రిషబ్ పంత్ గురించి తెలిసిందే. తనకు ఇచ్చిన రోల్లో అదరగొడుతుంటాడీ యంగ్ క్రికెటర్. గ్రౌండ్లో ఉన్నంత సేపు అందర్నీ ఎంటర్టైన్ చేస్తుంటాడు. కీపింగ్‌లో అద్భుతమైన స్టంపింగ్స్, రనౌట్స్, డైవింగ్ క్యాచెస్తో ఆడియెన్స్‌ను మెస్మరైజ్ చేస్తాడు. అదే బ్యాటింగ్‌లో అయితే రివర్స్ స్వీప్, సింగిల్ హ్యాండ్ షాట్స్‌తో భారీగా పరుగులు రాబడుతుంటాడు. చూస్తుండగానే ప్రత్యర్థి జట్టు నుంచి మ్యాచ్‌ను లాగేసుకుంటాడు. భారీ షాట్లతో మ్యాచ్‌ను వన్ సైడ్ చేసేస్తాడు. అలాంటోడు తాజాగా కొత్త అవతారం ఎత్తాడు. ప్యాడ్లు పక్కనబెట్టి బాల్ చేతబట్టాడు. దీంతో మ్యాచ్ చూస్తున్న ఆడియెన్స్ షాకయ్యారు. వాళ్లు ఆశ్యర్యంలో ఉండగానే బౌలింగ్ చేయడం మొదలుపెట్టాడు పంత్.
ఢిల్లీ ప్రీమియర్ లీగ్-2024లో పంత్ బౌలర్ అవతారం ఎత్తాడు. సాధారణంగా కీపర్లు బౌలింగ్ చేయరు. కానీ పంత్ మాత్రం బాల్ చేతబట్టి యాక్షన్‌లోకి దిగాడు. ఢిల్లీ సూపర్‌స్టార్జ్-పురానీ ఢిల్లీ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇది చోటుచేసుకుంది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ సూపర్‌స్టార్జ్ 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన పురానీ ఢిల్లీ 197 పరుగుల భారీ స్కోరు చేసింది. అయితే ఈ స్కోరును ఇంకో 5 బంతులు ఉండగానే ఊదిపారేసింది ఢిల్లీ సూపర్‌స్టార్జ్. పీయుష్ ఆర్య (57), ఆయుష్ బదోని (57) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. మ్యాచ్‌లో పంత్ టీమ్ ఓడింది. కానీ అతడు బౌలింగ్‌కు దిగడం మాత్రం హైలైట్‌గా నిలిచింది. ఎప్పుడూ చేయి తిప్పని పంత్.. తొలిసారి బౌలింగ్ చేశాడు. అయితే అతడు వేసిన ఫస్ట్ బాల్కే ఢిల్లీ సూపర్‌స్టార్జ్ నెగ్గడంతో ఓవర్ కంప్లీట్ చేసే ఛాన్స్ లభించలేదు. పంత్ బౌలింగ్ యాక్షన్ అందర్నీ ఆకట్టుకుంది. స్పిన్ లెజెండ్ షేన్ వార్న్ మాదిరిగా అతడి బౌలింగ్ యాక్షన్ అనిపించింది.
వార్న్‌తో పాటు భారత వెటరన్ క్రికెటర్ అమిత్ మిశ్రా, క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్‌తో పంత్ యాక్షన్ పోలికలు కనిపించాయి. సింపుల్‌గా రెండు అడుగులు వేసి బౌలింగ్ యాక్షన్ ఫినిష్ చేశాడతడు. అతడి నుంచి మరిన్ని ఓవర్లు వస్తే గానీ బాల్‌ను ఎంతవరకు టర్న్ చేయగలడు? పంత్ బౌలింగ్‌కు పనికొస్తాడా? అనేది ఓ అంచనాకు రావొచ్చని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. అయితే యాక్షన్ మాత్రం బాగుందని మెచ్చుకుంటున్నారు. ఇక, గౌతం గంభీర్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి భారత జట్టులో బ్యాటర్లు కూడా బౌలింగ్ చేయడం చూస్తున్నాం. ఇప్పటికే రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, రింకూ సింగ్ తదితరులు ఈ పని చేశారు. గౌతీ అడగక ముందే పంత్ కూడా చేయి తిప్పడం విశేషం. మరి.. పంత్ బౌలింగ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.
RISHABH PANT BOWLING IN DELHI PREMIER LEAGUE…!!!
He scored 35 in 32 balls while batting.pic.twitter.com/hqUEoE6fmv
— cricket addict’s (@cricket0addicts) August 18, 2024