iDreamPost
android-app
ios-app

Sourav Ganguly: కోల్‌కత్తా డాక్టర్‌ హత్యాచార ఘటన! వివాదంలో మాజీ క్రికెటర్‌ సౌరవ్‌ గంగూలీ!

  • Published Aug 19, 2024 | 5:02 PM Updated Updated Aug 19, 2024 | 5:02 PM

Sreelekha Mitra, Sourav Ganguly, Kolkata, RG Kar Medical College: కోల్‌కత్తా డాక్టర్‌ హత్యాచార ఘటనపై చేసిన ఒక చిన్న కామెంట్‌తో టీమిండియా దిగ్గజ మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ వివాదంలో చిక్కుకున్నాడు. ఆయన ఏమన్నాడో ఇప్పుడు చూద్దాం..

Sreelekha Mitra, Sourav Ganguly, Kolkata, RG Kar Medical College: కోల్‌కత్తా డాక్టర్‌ హత్యాచార ఘటనపై చేసిన ఒక చిన్న కామెంట్‌తో టీమిండియా దిగ్గజ మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ వివాదంలో చిక్కుకున్నాడు. ఆయన ఏమన్నాడో ఇప్పుడు చూద్దాం..

  • Published Aug 19, 2024 | 5:02 PMUpdated Aug 19, 2024 | 5:02 PM
Sourav Ganguly: కోల్‌కత్తా డాక్టర్‌ హత్యాచార ఘటన! వివాదంలో మాజీ క్రికెటర్‌ సౌరవ్‌ గంగూలీ!

దేశవ్యాప్తంగా కోల్‌కత్తా డాక్టర్‌ హత్యాచార ఘటనపై నిరసనలు కొనసాగుతున్నాయి. నిందితులకు కఠిన శిక్షను విధించాలంటూ, దేశంలో మహిళలకు అసలు రక్షణే లేకుండా పోతుందంటూ.. మహిళలు, వైద్యులు, సామాన్యులు అంతా రోడ్లెక్కి నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. దేశం మొత్తం ఈ ఘటనపైనే చర్చ జరుగుతోంది. సోషల్‌ మీడియాలో కూడా బాధితురాలికి న్యాయం జరగాలంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ఈ ఘటనపై టీమిండియా దిగ్గజ మాజీ క్రికెటర్‌ సౌరవ్‌ గంగూలీ కూడా కామెంట్‌ చేశాడు. తన సొంత రాష్ట్రం పశ్చిమ బెంగాల్‌లో జరిగిన ఘటన కావడంతో దాదా స్పందించాడు.. కానీ, ఆయన చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు సిగ్గుపడాలంటూ.. నెటిజన్లు గంగూలీని తిట్టిపోస్తున్నారు. ఇంతకీ ఆయన ఏమన్నాడో ఇప్పుడు చూద్దాం..

కోల్‌కత్తాలోని ఆర్‌జీ కర్‌ మెడికల్‌ కాలేజ్‌ అండ్‌ హాస్పిటల్‌లోని ఎమర్జెన్సీ బ్లాక్‌లో గల సెమినార్‌ హాల్‌లో.. ఈ నెల 8న ఓ ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం చేసి, ఆపై అతి దారుణంగా హత్యచేశారు. ఈ విషయం ఈ నెల 9వ ఉదయం వెలుగుచూసింది. దీంతో.. కోల్‌కత్తా వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అయ్యాయి. ఈ క్రమంలోనే ఈ నెల 11న ఓ ప్రైవేట్‌ కార్యక్రమంలో పాల్గొన్న సౌరవ్‌ గంగూలీ.. డాక్టర్‌ హత్యాచార ఘటనపై స్పందిస్తూ.. ‘ఇలాంటి దారుణ సంఘటన చోటు చేసుకోవడం నిజం చాలా బాధాకరం. మహిళల రక్షణ కోసం మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి ఘటనలు ఎక్కడైనా జరగొచ్చు. కానీ, మన మంచి సెక్యూరిటీ వ్యవస్థనే కలిగి ఉన్నాం. మన ఒక అద్భుతమైన దేశంలో ఉంటున్నాం. పశ్చిమ బెంగాల్‌ అనే కాదు.. ఏ రాష్ట్రంలో అయినా మంచి భద్రత ఉంది. మనం ఒక గొప్ప రాష్ట్రం, గొప్ప మహానగరంలో నివశిస్తున్నాం.. ఒక్క సంఘటనను పట్టుకుని.. ఇలా జడ్జ్‌ చేయడం సరికాదు. ఏది ఏమైనా.. బాధితురాలికి న్యాయం జరగాలి’ అని దాదా పేర్కొన్నాడు.

ఆయన చేసిన ఈ వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఆస్పత్రిలో నైట్‌ డ్యూటీలో ప్రజలకు సేవ చేస్తున్న 31 ఏళ్ల ట్రైనీ డాక్టర్‌పై ఇంతటి దారుణ ఘటన జరిగితే.. మన దేశంలో మంచి సెక్యూరిటీ ఉంది, ఒక్క సంఘటనను పట్టుకుని ఎవర్ని నిందించకూడదంటూ పేర్కొనడం సరికాదంటూ గంగూలీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక క్రికెటర్‌గా నువ్వు దేశానికి, క్రికెట్‌కు చేసిన సేవలతో నిన్ను ఎంతో అభిమానించాం కానీ.. ఇలాంటి వ్యాఖ్యలతో నిన్ను నువ్వు దిగజార్చుకోవద్దు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇదే విషయమై ప్రముఖ బెంగాలీ నటి శ్రీలేఖ మిత్రా కూడా గంగూలీపై ఘాటు విమర్శలు చేశారు. అయితే.. గంగూలీపై వస్తున్న విమర్శలను ఆయన అభిమానులు ఖండిస్తున్నారు. దేశ కీర్తి ప్రతిష్టతలను, బెంగాల్‌ పేరును విశ్వవ్యాప్తం చేసిన వ్యక్తిగా గంగూలీ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని, డబ్బు కోసం, అధికారం కోసం.. దాదా ఏనాడు న్యాయానికి వ్యతిరేకంగా నిల్చోలేదని అంటున్నారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.