ఆ ముగ్గుర్ని ఇంటికి పంపే ఆలోచనలో RCB.. ఎవరా ప్లేయర్లు?

ఐపీఎల్‌లో పెద్ద పెద్ద స్టార్‌ క్రికెటర్లు, భారీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న టీమ్‌ ఆర్సీబీ. కానీ, ఇప్పటి వరకు ఒక్క ట్రోఫీ కూడా గెలవలేదు. కొన్నేళ్ల పాటు విరాట్‌ కోహ్లీ కెప్టెన్‌గా ఉన్నా, కెప్టెన్సీ వదిలేసినా.. ఆర్సీబీ రాత మారలేదు. ఐపీఎల్‌ 2023 సీజన్‌లో విరాట్‌ కోహ్లీ సూపర్‌ ఫామ్‌లోకి వచ్చిన సెంచరీల మోత మోగించినా.. 14 మ్యాచ్‌ల్లో 8 విజయాలు సాధించినా.. ఆర్సీబీ కప్పు కొట్టేలేకపోయింది. ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ఓడి ఇంటిదారి పట్టింది. మొత్తం మీద 4వ స్థానంలో నిలిచింది. ఈ ప్రదర్శన పర్వాలేకున్నా.. ఐపీఎల్‌ కప్పు కొట్టడం అతనే ఆర్సీబీకి ఒక తీరని కలలా, అందని ద్రాక్షలా మారిపోయింది.

కానీ, కప్పు సాధించాలనే కసి మాత్రం ఆర్సీబీ టీమ్‌లో ముఖ్యంగా విరాట్‌ కోహ్లీలో మాత్రం బలంగా ఉంది. కనీసం కోహ్లీ కోసమైన ఆర్సీబీ కప్పు కొట్టాలని ఇతర టీమ్స్‌ అభిమానులు కూడా కోరుకుంటున్నారు. ఐపీఎల్‌ కప్పు గెలవడమే లక్ష్యంగా ఉన్న ఆర్సీబీ.. ఐపీఎల్‌ 2024 సీజన్‌ కోసం ఇప్పటి నుంచే జట్టును స్ట్రాంగ్‌ చేసే పనిలో ఉన్నట్లు సమాచారం. అందుకోసం ముందుగా జట్టులోని స్క్రాప్‌ను తొలగించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తుంది. భారీగా డబ్బు తీసుకుంటూ.. జట్టుకు ఏ మాత్రం ఉపయోగపడని ఆటగాళ్లను వదిలించుకునేందుకు రెడీ అయింది ఆర్సీబీ. ఈ క్రమంలోనే ఓ ముగ్గురు స్టార్‌ ఆటగాళ్లను టీమ్‌ నుంచి ఇంటికి పంపనున్నట్లు తెలుస్తుంది. ఆ ముగ్గురితో పాటు మరికొంతమందిని కూడా ఆర్సీబీ వదిలేసుకోనుంది.

అయితే.. ముఖ్యంగా ఈ ముగ్గురిని తొలుత తప్పించి.. ఆ తర్వాత గట్టి పరిశీలన జరిపి.. మిగతా వారిని తప్పించి, వారి స్థానంలో వేలంలో మెరికల్లాంటి ఆటగాళ్లను పట్టాలనేది ఆర్సీబీ ప్లాన్‌. ఆర్సీబీ తొలుత రిలీజ్‌ చేయబోయే ఆటగాళ్ల లిస్ట్‌లో ఫస్ట్‌ పేరు ది ఫినిషర్‌గా పేరుతెచ్చుకున్న దినేష్‌ కార్తీక్‌ ఉన్నట్లు సమాచారం. దాదాపు కెరీర్‌ ముగిసిపోయిందనుకున్న సమయంలో 2022లో డీకేను పిలిచి మరీ ఫినిషర్‌ ఛాన్స్‌ ఇచ్చింది ఆర్సీబీ. దానికి వందరెట్లు న్యాయం చేసిన డీకే.. ఏకంగా టీమిండియాలో కూడా ప్లేస్‌ కొట్టేశాడు. కానీ.. ఐపీఎల్‌ 2022లో రాణించినట్లు 2023 సీజన్‌లో ఆడలేకపోయాడు. దారుణంగా విఫలమయ్యాడు.

ఏదో కోహ్లీ, కెప్టెన్‌ డుప్లెసిస్‌ ఫామ్‌లో ఉండటంతో ఆర్సీబీ కనీసం ప్లే ఆఫ్స్‌కైనా క్వాలిఫై కాగలిగింది. ఇక డీకేతో పాటు శ్రీలంక స్టార్‌ స్పిన్నర్‌ వనిందు హసరంగా, టీమిండియా క్రికెటర్‌ హర్షల్‌ పటేల్‌లను ఆర్సీబీ రిలీజ్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరూ కూడా 2023 సీజన్‌లో సరిగా రాణించలేదు. పైగా గాయాల బెడద అదనపు భారం. దీంతో వీరిని వదిలించుకోవడమే మంచిదనే అభిప్రాయానికి ఆర్సీబీ యాజమాన్యం వచ్చేసింది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. మరి వీరి ముగ్గురి వదులుకోవడం ఆర్సీబీకి లాభమా? నష్టమా? అనేది కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను తెలియజేయండి.

ఇదీ చదవండి: యువీ 6 సిక్సుల తర్వాత.. బ్రాడ్‌ భారత్‌పై ప్రతీకారం తీర్చుకున్నాడని తెలుసా?

Show comments