iDreamPost
android-app
ios-app

IPL 2025: RCB అతడ్ని తీసుకోవాలనుకుంటే దండగే.. మాజీ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్

  • Published Sep 12, 2024 | 9:49 PM Updated Updated Sep 12, 2024 | 10:07 PM

Akash Chopra said RCB will not retain Faf du Plessis and Glenn Maxwell: ఆర్సీబీ నెక్ట్స్ ఐపీఎల్ సీజన్ కోసం ఆ ప్లేయర్ ను తీసుకుంటే దండగే అని షాకింగ్ కామెంట్స్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా.

Akash Chopra said RCB will not retain Faf du Plessis and Glenn Maxwell: ఆర్సీబీ నెక్ట్స్ ఐపీఎల్ సీజన్ కోసం ఆ ప్లేయర్ ను తీసుకుంటే దండగే అని షాకింగ్ కామెంట్స్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా.

IPL 2025: RCB అతడ్ని తీసుకోవాలనుకుంటే దండగే.. మాజీ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్

IPL 2025 మీదే అందరి దృష్టి ఉంది. మెగా వేలానికి, టోర్నీ ఆరంభానికి ఇంకా టైమ్ ఉన్నప్పటికీ.. ఇప్పటి నుంచే ఫ్రాంచైజీలు తమ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. ఎవరిని రిటైన్ చేసుకోవాలి? ఎవరిని జట్టులోనుంచి తప్పించాలి? అన్న విషయాలపై కసరత్తులు ప్రారంభించాయి. ఈ నేపథ్యంలోనే టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా చేసిన కామెంట్స్ ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో ఆసక్తికరంగా మారాయి. ఐపీఎల్ 2025 సీజన్ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ డుప్లెసిస్ ను రిటైన్ చేసుకోదని సంచలన వ్యాఖ్యలు చేశాడు. అలాగే విధ్వంసకర ప్లేయర్ గ్లెన్ మాక్స్ వెల్ ను కూడా తీసుకోదని అభిప్రాయపడ్డాడు.

ఐపీఎల్ 2025కు సంబంధించి, మెగా వేలం గురించి తమ తమ అభిప్రాయాలను ఎప్పటికప్పుడు వెల్లడిస్తూనే ఉన్నారు దిగ్గజ, మాజీ క్రికెటర్లు. తాాజాగా టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా సంచలన కామెంట్స్ చేశాడు. నెక్ట్స్ IPL సీజన్ కు సంబంధించి రాయల్ ఛాలెంజర్స్ జట్టులో ఎవరెవరు ఉంటారు అన్నదానిపై తన అభిప్రాయాలను పేర్కొన్నాడు. “డుప్లెసిస్ ను ఆర్సీబీ రిటైన్ చేసుకోదు. ఎందుకంటే? ప్రస్తుతం అతడి ఏజ్ 40, ఓ ప్లేయర్ ను మూడేళ్ల పాటు కొనసాగించాలన్న ఉద్దేశంతోనే మెగా వేలంలో ప్లేయర్లను ఫ్రాంచైజీలు సొంతం చేసుకుంటాయి. కానీ ఇతడి విషయంలో అలాజరిగేందుకు అవకాశం లేదు. అందుకే డుప్లెసిస్ ను ఆర్సీబీ వదులుకునే అవకాశాలు ఉన్నాయి. ఇక విధ్వంసకర ప్లేయర్ మాక్స్ వెల్ తీసుకోవడం దండగని, అతడికి బదులుగా యంగ్ ఆల్ రౌండర్ విల్ జాక్స్ ను తీసుకోవడం ఉత్తమం” అని పేర్కొన్నాడు ఆకాశ్ చోప్రా.

కాగా.. ఆర్సీబీ విరాట్ కోహ్లీ, కామెరూన్ గ్రీన్, మహ్మద్ సిరాజ్, రజత్ పాటిదార్ లను రిటైన్ చేసుకుంటుందని ఈ మాజీ క్రికెటర్ చెప్పుకొచ్చాడు. భారత బౌలర్ కావడంతో సిరాజ్ ని జట్టులో ఉంచుతారని తెలిపాడు. ఇక రిటైన్ కు సంబంధించిన విషయాలు బీసీసీఐ విడుదల చేసే నిబంధనలపై ఆధారపడి ఉంటాయని చెప్పుకొచ్చాడు. కాగా.. గత 17 సీజన్లుగా టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతున్న ఆర్సీబీకి ప్రతిసారి తీవ్ర నిరాశే ఎదురౌతుంది. జట్టులో ఎంతో మంది స్టార్ ప్లేయర్లు ఉన్నప్పటికీ.. ఒక్క టైటిల్ కూడా సాధించలేకపోయింది. వచ్చే సీజన్ లో అయినా టైటిల్ కొట్టాలని, అందుకోసం ఈ మెగావేలానికి ముందే జట్టును పటిష్టపర్చుకోవాలని మేనేజ్ మెంట్ భావిస్తోంది. అందుకోసం కఠిన నిర్ణయాలు తీసుకోవడంతో పాటుగా టీమ్ లో సమూల మార్పులు తీసుకురావాలని భావిస్తోంది. మరి ఆకాశ్ చోప్రా అన్నట్లు డుప్లెసిస్, మాక్స్ వెల్ ను రిటైన్ చేసుకోకపోవడం మంచిదేనా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.