iDreamPost
android-app
ios-app

RCBకి మారడంపై ఫుల్‌ క్లారిటీ ఇచ్చేసిన రిషభ్‌ పంత్‌! ఏమన్నాడంటే..?

  • Published Sep 26, 2024 | 6:45 PM Updated Updated Sep 26, 2024 | 6:45 PM

Rishabh Pant, RCB, IPL 2025: టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ రిషభ్‌ పంత్‌ వచ్చే సీజన్‌లో ఢిల్లీని వీడి.. వేరే టీమ్‌కు ఆడతాడు అని వస్తున్న వార్తలపై పంత్‌ క్లారిటీ ఇచ్చేశాడు. మరి అతను ఏమన్నాడో ఇప్పుడు చూద్దాం..

Rishabh Pant, RCB, IPL 2025: టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ రిషభ్‌ పంత్‌ వచ్చే సీజన్‌లో ఢిల్లీని వీడి.. వేరే టీమ్‌కు ఆడతాడు అని వస్తున్న వార్తలపై పంత్‌ క్లారిటీ ఇచ్చేశాడు. మరి అతను ఏమన్నాడో ఇప్పుడు చూద్దాం..

  • Published Sep 26, 2024 | 6:45 PMUpdated Sep 26, 2024 | 6:45 PM
RCBకి మారడంపై ఫుల్‌ క్లారిటీ ఇచ్చేసిన రిషభ్‌ పంత్‌! ఏమన్నాడంటే..?

ఐపీఎల్‌ 2025 ప్రారంభానికి ఇంకా చాలానే సమయం ఉన్నప్పటికీ.. ఇప్పటి నుంచే ఐపీఎల్‌ హడావిడి మొదలైనట్లు కనిపిస్తోంది. ఎందుకంటే.. ఐపీఎల్‌ 2025 సీజన్‌ కంటే ముందు మెగా వేలం ఉండటం. ఆటగాళ్ల రిటెన్షన్‌, రిలీజ్‌పై బీసీసీఐ కొత్త రూల్స్‌ తీసుకురానున్న నేపథ్యంలో అందరి దృష్టి ఐపీఎల్‌పైనే ఉంది. అలాగే.. రోహిత్‌ శర్మ లాంటి బిగ్‌ స్టార్‌.. ముంబై ఇండియన్స్‌ నుంచి బయటికి వస్తాడనే టాక్‌ కూడా చాలా గట్టిగా వినిపిస్తూ ఉంది. కెప్టెన్సీ నుంచి తప్పించడంతో ఇతర కారణాల వల్ల అలాంటి ప్రచారం జరుగుతోంది. కానీ, ఎలాంటి రీజన్‌ లేకుండా మరో వార్త కూడా బాగా ప్రచారంలో ఉంది. అదేంటంటే.. రిషభ్‌ పంత్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌ను వీడి.. వేరే టీమ్‌లోకి వెళ్తున్నాడని సోషల్‌ మీడియాలో పుకార్లు హెరెత్తుతున్నాయి.

రిషభ్‌ పంత్‌.. ఢిల్లీకి టాటా చెప్పి.. సీఎస్‌కేలోకి వెళ్తున్నాడని, ధోని వారసుడిగా సీఎస్‌కే పగ్గాలు కూడా చేపడతాడనే టాక్‌ గట్టిగా వినిపించింది. ఆ తర్వాత లేదు లేదు.. పంత్‌ ఆర్సీబీలోకి వెళ్తున్నాడు. ఫాఫ్‌ డుప్లెసిస్‌ను ఈసారి ఆర్సీబీ రిటేన్‌ చేసుకునే పరిస్థితి లేదు.. అందుకే పంత్‌ను ఎలాగైన తీసుకొని.. తమ టీమ్‌కు కెప్టెన్‌ చేయాలని ఆర్సీబీ భావిస్తోంది. ఇప్పటికే పంత్‌తో ఆర్సీబీ మేనేజ్‌మెంట్‌ చర్చలు జరిపిందంటూ.. సోషల్‌ మీడియాలో పోస్టులు వెలువడ్డాయి. అయితే.. తాజాగా ఇలాంటి ఒక పోస్ట్‌పై ఏకంగా రిషభ్‌ పంతే స్పందించాడు. ఎందుకు ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తారంటూ.. నెటిజన్లుపై మండిపడ్డాడు.

ఆర్సీబీలోకి రిషభ్‌ పంత్‌ వెళ్తున్నాడు అని ఓ నెటిజన్‌ పెట్టిన పోస్ట్‌కు రిప్లే ఇస్తూ.. ‘ఫేక్‌ న్యూస్‌. సోషల్ మీడియాలో ఇంత ఫేక్ న్యూస్ ఎందుకు స్ప్రెడ్ చేస్తున్నారు. ఎటువంటి సమాచారం లేకుండా ఇలాంటి వార్తలు సృష్టించకండి. ఇలాంటివి నేను బయటపెట్టడం ఇది మొదటిసారి కాదు, అలాగే చివరిది కూడా కాదు. దయచేసి మీకు ఉండే సో కాల్డ్ సోర్స్‌లను కొటి రెండు సార్లు చెక్‌ చేసుకోండి. రోజురోజుకూ పరిస్థితి మరీ అధ్వాన్నంగా మారుతోంది. ఇది కేవలం ఈ పోస్ట్‌పెట్టిన వ్యక్తికి మాత్రమే కాదు.. ఇలాంటి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే వ్యక్తుల కోసం ఈ పోస్ట్‌’ అంటూ పంత్‌ ట్వీట్‌ చేశాడు. పంత్‌ చేసిన పోస్ట్‌తో అతను ఆర్సీబీలోకి వెళ్లడం లేదనే విషయం స్పష్టమైంది. మరి పంత్‌ ఇచ్చిన క్లారిటీతో పాటు ఫేక్‌ న్యూస్‌లపై పంత్‌ పీకిన క్లాస్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.