iDreamPost
android-app
ios-app

బుమ్రాను కెప్టెన్ చేయొద్దు.. దినేశ్ కార్తీక్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

Jasprit Bumrah, Dinesh Karthik: టీమిండియా పేసుగుర్రం జస్ ప్రీత్ బుమ్రా ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటున్నాడు. బంగ్లాదేశ్ సిరీస్ కు ముందు గ్యాప్ దొరకడంతో రెస్ట్ తీసుకుంటున్నాడు. ఫ్యామిలీతో కలసి ఖాళీ టైమ్ ను ఎంజాయ్ చేస్తున్నాడు.

Jasprit Bumrah, Dinesh Karthik: టీమిండియా పేసుగుర్రం జస్ ప్రీత్ బుమ్రా ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటున్నాడు. బంగ్లాదేశ్ సిరీస్ కు ముందు గ్యాప్ దొరకడంతో రెస్ట్ తీసుకుంటున్నాడు. ఫ్యామిలీతో కలసి ఖాళీ టైమ్ ను ఎంజాయ్ చేస్తున్నాడు.

బుమ్రాను కెప్టెన్ చేయొద్దు.. దినేశ్ కార్తీక్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

టీ20 వరల్డ్ కప్-2024 ముగిసిన తర్వాత టీమిండియాలో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. కొత్త హెడ్ కోచ్ గా లెజెండ్ గౌతం గంభీర్ బాధ్యతలు చేపట్టాడు. ర్యాన్ టెన్ డస్కటే, అభిషేక్ నాయర్ అసిస్టెంట్ కోచ్ లుగా వచ్చారు. బౌలింగ్ కోచ్ గా ఇటీవలే మోర్నీ మోర్కెల్ ను నియమించారు. రోహిత్ శర్మ టీ20లకు గుడ్ బై చెప్పడంతో సూర్యకుమార్ యాదవ్ ఆ ఫార్మాట్ రెగ్యులర్ కెప్టెన్ గా, శుబ్ మన్ గిల్ ను వన్డేలు, టీ20లకు వైస్ కెప్టెన్ చేశారు. వన్డే, టెస్టు  పగ్గాలు హిట్ మ్యాన్ టీమ్ దగ్గరే ఉన్నాయి. అన్నీ బాగానే ఉన్నా టెస్టుల్లో వైస్ కెప్టెన్ ఎవరనేది ఇంకా క్లారిటీ రాలేదు. వచ్చే నెలలో జరిగే బంగ్లాదేశ్ సిరీస్ తో దీనిపై స్పష్టత రానుంది. గిల్ తో పాటు పేసుగుర్రం జస్ ప్రీత్ బుమ్రా పేరు వైస్ కెప్టెన్సీ రేసులో వినిపిస్తోంది. అయితే బుమ్రాను సారథ్యం వైపు తీసుకెళ్లొద్దని మాజీ వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ అంటున్నాడు.

బుమ్రాకు ఇప్పుడు వైస్ కెప్టెన్సీ దక్కితే, రోహిత్ రిటైర్మెంట్ తర్వాత టెస్ట్ టీమ్ కు కెప్టెన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అక్కడ రాణిస్తే మిగిలిన ఫార్మాట్లకు కూడా కెప్టెన్ అయ్యే అవకాశం ఉంటుంది. తనకు సారథ్యం అంటే ఇష్టమని ఓ సందర్భంలో బుమ్రా స్వయంగా చెప్పాడు. కాబట్టి లాంగ్ ఫార్మాట్ వైస్ కెప్టెన్సీ విషయంలో అతడి పేరును కన్సిడర్ చేసే ఛాన్స్ ఉంది. అయితే సీనియర్ క్రికెటర్ దినేష్ కార్తీక్ మాత్రం బుమ్రాకు సారథ్య పగ్గాలు ఇవ్వొద్దని అంటున్నాడు. అతడికి కెప్టెన్సీ ఇస్తే బౌలింగ్ మీద తీవ్ర ప్రభావం పడుతుందని హెచ్చరించాడు. అతడు కోహినూర్ కంటే గొప్ప అంటూ ఆకాశానికెత్తేసిన కార్తీక్.. ఈ పేసర్ ను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నాడు. అతడిపై అదనపు ఒత్తిడి పెట్టడం మంచిది కాదన్నాడు డీకే.

‘బుమ్రా ఓ పేస్ బౌలర్. అతడు త్రీ ఫార్మాట్ ప్లేయర్. షెడ్యూల్ ప్రకారం మూడు ఫార్మాట్లలోనూ అతడు ఆడటం చాలా ప్రెజర్ తో కూడుకున్నదే. బుమ్రా విషయంలో వర్క్ లోడ్ మేనేజ్ మెంట్ చాలా కీలకం. ఎప్పటికప్పుడు అతడి సిచ్యువేషన్ ను గమనిస్తూ ఉండాలి. అతడో అరుదైన బౌలర్. టీమ్ కు కీలకమైన బుమ్రాను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అన్ని మ్యాచుల్లోనూ అతడ్ని బరిలోకి దించుతామంటే కుదరదు. అది కరెక్ట్ కాదు. కీలక మ్యాచుల్లోనే అతడి సేవల్ని వినియోగించాలి. కెప్టెన్సీ రెస్పాన్సిబిలిటీస్ ఇస్తే బుమ్రా మీద మరింత ప్రెజర్ పెరుగుతుంది. అందుకే అతడ్ని సారథ్యానికి దూరం పెట్టడం మంచిది’ అని దినేశ్ కార్తీక్ చెప్పుకొచ్చాడు. ఇక, ఇటీవల డీకే ప్రకటించిన ఆల్ టైమ్ ఎలెవన్ లో దిగ్గజం ఎంఎస్ ధోని పేరు లేకపోవడంతో విమర్శలు వచ్చాయి. అది తన పొరపాటు అని.. మళ్లీ టీమ్ లో ఛేంజెస్ చేస్తే మాహీకి ఛాన్స్ ఇస్తానన్నాడు కార్తీక్.