SNP
Ravichandran Ashwin, Yashasvi Jaiswal: భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్‌లో జైస్వాల్ అద్భుతంగా రాణించాడు. అయితే.. జైస్వాల్ ఆట చూస్తే తనకు ఓ క్రికెటర్ గుర్తుకు వచ్చాడంటూ.. అశ్విన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. మరి ఆ క్రికెటర్ ఎవరో ఇప్పుడు చూద్దాం..
Ravichandran Ashwin, Yashasvi Jaiswal: భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్‌లో జైస్వాల్ అద్భుతంగా రాణించాడు. అయితే.. జైస్వాల్ ఆట చూస్తే తనకు ఓ క్రికెటర్ గుర్తుకు వచ్చాడంటూ.. అశ్విన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. మరి ఆ క్రికెటర్ ఎవరో ఇప్పుడు చూద్దాం..
SNP
టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో సత్తాచాటాడు. భారత తొలి ఇన్నింగ్స్‌లో 70 బంతుల్లోనే 9 ఫోర్లు, 3 సిక్సులతో 76 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచి తొలి రోజు ఆటను ముగించాడు. అగ్రెసివ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్‌కు పేరొందిన రోహిత్ శర్మను మరో ఎండ్‌లో పెట్టుకుని కూడా జైస్వాల్.. రోహిత్‌ను డామినేట్ చేస్తూ మరి రెచ్చిపోయి ఆడాడు. ఇన్నింగ్స్‌ను ఏకంగా బౌండరీతో మొదలుపెట్టిన జైస్వాల్.. ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లోనే ఏకంగా రెండు సిక్సులతో విరుచుకుపడ్డాడు. చాలా వేగంగా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న జైస్వాల్.. రెండో రోజు ఆటలో సెంచరీ సాధించాలనే పట్టుదలతో ఉన్నాడు.
అయితే.. గురువారం జరిగిన తొలి రోజు ఆటలో జైస్వాల్ ప్రదర్శనపై టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఇంగ్లండ్‌పై జైస్వాల్ బ్యాటింగ్ స్టైల్ చూస్తుంటే.. తనకు రిషభ్ పంత్ గుర్తుకు వచ్చాడని అశ్విన్ పేర్కొన్నాడు. టెస్టు క్రికెట్‌లో పంత్ అగ్రెసివ్ బ్యాటింగ్ స్టైల్‌లో సూపర్ సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ దేశాల్లో జరిగిన టెస్టు మ్యాచ్‌ల్లో రిషభ్ పంత్ బ్యాటింగ్ స్టైల్‌కు ఏకంగా మ్యాచ్ స్వరూపాలే మారిపోయాయి. ఆస్ట్రేలియాలోని గాబా టెస్ట్‌లో పంత్ ఆడిన అగ్రెసివ్ ఇన్నింగ్స్‌తోనే టీమిండియా చరిత్ర సృష్టించింది. ఇప్పుడు జైస్వాల్ కూడా అలానే ఎటాకింగ్ గేమ్ ఆడుతున్నాడని అశ్విన్ అభిప్రాయాపడ్డాడు. పైగా జైస్వాల్ బ్యాటింగ్ స్టైల్ కూడా అలానే ఉండటం విశేషం.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 64.3 ఓవర్లలోనే కేవలం 246 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ ఒక్కడే.. 88 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సులతో 70 పరుగులు చేసి రాణంచాడు. మిగతా బ్యాటర్ల దారుణంగా విఫలం అయ్యారు. భారత స్పిన్ మ్యాజిక్ ముందు అంతా తేలిపోయారు. భారత బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా మూడేసి వికెట్లు పడగొట్టారు. అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. తొలి ఇన్నింగ్స్‌కు దిగిన టీమిండియా.. 23 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 119 పరుగులు చేసి తొలి రోజు ఆటను ముగించింది. జైస్వాల్ 70 బంతుల్లోనే 9 ఫోర్లు, 3 సిక్సులతో 76 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మరో ఓపెనర్ కెప్టెన్ రోహిత్ శర్మ 27 బంతుల్లో 3 ఫోర్లతో 24 పరుగులు చేసి జాక్ లీచ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. జైస్వాల్‌తో పాటు వన్‌డౌన్‌లో వచ్చిన శుబ్‌మన్ గిల్ 14 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. మరి జైస్వాల్ గేమ్ చూస్తే తనకు పంత్ గుర్తొచ్చాడని అశ్విన్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Ravi Ashwin said, “Yashasvi Jaiswal reminds me of Rishabh Pant with his style of play”. pic.twitter.com/hqJaqzzngx
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 25, 2024